దీపావళి.. తెలుగు వారి ముంగిట ఎంతో వెలుగులతో జరిగే పండుగ. నేడు ప్రతి ఇంటి ముందు కాంతులు వెదజల్లుతూ ఆకాశంలోకి రివ్వున వెళ్లే తారా జువ్వలతో పాటు చిచ్చుబుడ్లు వెలుగుల ముందు అందరూ ఆనందంగా గడుపుతారు. ప్రతి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా ఇవన్నీ నిలుస్తాయి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. అందుకే సినిమాల్లో కూడా దీపావళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగ సందర్భంగా కొన్ని పాటలు మీకోసం..
అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించిన విచిత్రబంధం సినిమాలో “చీకటి వెలుగుల రంగేళి..” అంటూ సాగే దీపావళి పాట ఆ రోజుల్లో పెద్ద హిట్ అయింది. 1972లో ఏయన్నార్ నటించిన సినిమాల్లో నవలా చిత్రం ‘విచిత్రబంధం’ ఘనవిజయం సాధించింది.
మామగారు 1991లో ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున జంటగా నటించారు. ఇందులోని దిపావళి పండుగ సాంగ్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.
ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షాసేథ్, ప్రభాస్ మధ్య దీపావళీ సాంగ్ బాగా పాపులర్ అయింది.
1950 లో విడుదలైన షావుకారు తెలుగు సినిమా డ్రామా ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఇందులో నటించిన వారు షావుకరు జానకి, గోవింద రాజుల సుబ్బ రావు, నందమురి తారక రామారావు. నిర్మాతగా బి నాగిరెడ్డి కాగా ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటసాల స్వరాలు సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment