
మహేష్ బాబు దీపావళి గిఫ్ట్స్
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎవరితో పెద్దగా కలవకుండా దూరంగా ఉంటున్న మహేష్, ఈ మధ్యకాలంలో తన పద్ధతి మార్చుకున్నాడు. ఫిలిం ఫంక్షన్స్తో పాటు పబ్లిక్ ఈవెంట్స్లోనూ సందడి చేస్తున్నాడు. అంతేకాదు.. గతంలో ఎప్పుడు పెద్దగా వార్తల్లో కనిపించడానికి ఇష్టపడని ఈ సూపర్ స్టార్, ఈ మధ్య వరుసగా వార్తల్లో వ్యక్తిగా మారుతున్నాడు. ముఖ్యంగా శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్లో చాలా మార్పు కనిపిస్తోంది.
శ్రీమంతుడు సక్సెస్ తరువాత తనకు అంతటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివకు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు ప్రిన్స్. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది. తాజాగా అలాంటి న్యూస్ మరోటి క్రియేట్ చేశాడు మహేష్. తనకు అత్యంత సన్నిహితులైన కొంత మంది మిత్రులకు దీపావళి సందర్భంగా పండ్లు, స్వీట్లు పంపించాడు.
మహేష్ పంపిన గిఫ్ట్ ప్యాక్ లో స్వీట్స్, ఆర్గానిక్ మామిడి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు మహేష్ స్వయంగా రాసిన శుభాకాంక్షల పత్రాన్ని కూడా తన సన్నిహితులకు పంపాడు. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో మరోసారి మహేష్ వార్తల్లో నిలిచాడు. మహేష్, క్రిష్ల కాంబినేషన్లో సినిమా తెరకెక్కాల్సి ఉన్నా, అది వర్క్అవుట్ కాలేదు. ఈ పరిణామంతో త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఆశించవచ్చేమో.
Thank you so much @urstrulyMahesh and Namrata for fabulous Deepavali wishes and wish you a great Deepavali too... pic.twitter.com/87ROmk4avr
— Krish Jagarlamudi (@DirKrish) November 11, 2015