
నెక్ట్స్ సినిమాకు భారీ ఫ్లాన్స్
కెరీర్లో ఇప్పటి వరకు లో బడ్జెట్లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి). ఇటీవల కంచె సినిమాతో మరోసారి తన మార్క్ చూపించి ప్రేక్షకుల్ని అలపించిన అతడు తన నెక్ట్స్ సినిమా విషయంలో భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇంట్రస్టింగ్ లైన్స్ను ఎంచుకొని లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తరువాత సినిమాను మాత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట.
నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్న క్రిష్, ఇప్పటికే ఓ లైన్ను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అయితే హీరో ఎవరన్నదీ మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు. మహేష్ బాబు హీరోగా క్రిష్ సినిమా ఉంటుందన్న వార్తలు చాలా కాలం క్రితమే వినిపించాయి. దీనికి తోడు కంచె సక్సెస్ తరువాత రామ్చరణ్ కూడా క్రిష్తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఇలా స్టార్ హీరోలు క్రిష్తో సినిమా కోసం వెయిట్ చేస్తుండటంతో భారీ బడ్జెట్ సినిమా చేయటం పెద్ద కష్టమేమి కాదు.
వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె దసరా కానుకగా గురువారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో క్రిష్ తరువాతి ప్రాజెక్ట్స్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.