వరల్డ్‌ కప్‌ విక్టరీ.. టీమిండియాకు టాలీవుడ్ తారల విషెస్! Tollywood Celebrities Wishes To Team India T20 World Cup 2024 Won | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ప్రపంచకప్‌.. రాజమౌళి, రామ్ చరణ్ ట్వీట్‌ వైరల్!

Published Sun, Jun 30 2024 9:00 AM | Last Updated on Sun, Jun 30 2024 1:42 PM

Tollywood Celebrities Wishes To Team India won the T20 World Cup

టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 2007 తర్వాత పొట్టి ఫార్మాట్‌లో మరోసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన వేళ టాలీవుడ్ సినీతారలు సైతం మన జట్టుకు అభినందనలు తెలిపారు.

దర్శకధీరుడు రాజమౌళి విన్నింగ్‌ మూమెంట్‌ ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ అద్భుతమైన విజయాన్ని గుర్తుండిపోయేలా చేసిన టీమిండియాకు, రోహిత్ శర్మకు నా ప్రత్యేక అభినందనలు అంటూ గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌ సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.

 

పొట్టి ప్రపంచకప్ గెలిచిన వేళ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు మనదే.. హీరోస్-ఇన్-బ్లూ.. కొత్త ప్రపంచ ఛాంపియన్స్.. సూర్యకుమార్‌ క్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. జై హింద్‌' అంటూ పోస్ట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు నా అభినందనలు అంటూ అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement