Allu Arjun About RRR: Allu Arjun Congratulated RRR Movie Team For Massive Success - Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌పై అల్లు అర్జున్‌ రియాక్షన్‌.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌

Published Sat, Mar 26 2022 12:57 PM | Last Updated on Sat, Mar 26 2022 1:51 PM

Allu Arjun Congratulated RRR Movie Team For Massive Success - Sakshi

Allu Arjun About RRR: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లో హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ అంచనాల మధ్య శుక్రవారం (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం..తొలిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తారక్‌, చెర్రీల యాక్టింగ్‌కు సినీ ప్రేక్షకలోకం ఫిదా అయింది. మెగా, నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, దర్శకులు ట్విటర్‌ వేదికగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత గొప్ప సినిమా అందించినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. తన బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని.. ఆయనను చూసి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు తన బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

(చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రివ్యూ)

తారక్ నటనను డైనమిక్ పవర్ హౌస్ తో పోల్చారు బన్నీ. అలాగే కీలకమైన పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ నటనను కూడా పొగిడారు. సంగీత దర్శకుడు కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత డివివి దానయ్య.. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు . భారత్‌ గర్వించదగ్గ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇచ్చినందుకు వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement