కాదన్న కథలే కలిసొస్తున్నాయా..? | varun tej taking the stories rejected by others | Sakshi
Sakshi News home page

కాదన్న కథలే కలిసొస్తున్నాయా..?

Published Thu, Dec 3 2015 10:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

కాదన్న కథలే కలిసొస్తున్నాయా..?

కాదన్న కథలే కలిసొస్తున్నాయా..?

ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు వరుణ్ తేజ్, తొలి సినిమా నుంచే రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ప్రయోగాలు చేస్తున్నాడు. మెగా ఇమేజ్ కు దూరంగా సాఫ్ట్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇచ్చిన వరుణ్, తరువాత పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కిన కంచె సినిమాలో నటించాడు. అయితే స్టోరీ సెలెక్షన్ విషయంలో కూడా కొత్తదనాన్నిచూపిస్తున్నాడు వరుణ్, ఇతర హీరోలు కాదన్న కథలను ఎంపిక చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

కంచె సినిమాకు ముందు క్రిష్ మహేష్ బాబు హీరోగా శివమ్ పేరుతో సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాకపోవటంతో వరుణ్ హీరోగా కంచె సినిమాను చేశాడు. అయితే మహేష్తో అనుకున్న కథనే వరుణ్తో చేశాడన్న టాక్ అప్పట్లో బలంగా వినిపించింది. అదే బాటలో పూరీ తెరకెక్కిస్తున్న లోఫర్ సినిమా కూడా ముందు నితిన్ హీరోగా ప్లాన్ చేశారు. అయితే నితిన్ ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవటంతో వరుణ్ తేజ్ చేతికి వచ్చింది. ఈ సినిమాపై కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తుండటంతో వరుణ్ సెలెక్షన్ కరెక్టే అంటున్నారు ఫ్యాన్స్.

తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. నాని హీరోగా దిల్ రాజు నిర్మించాలనుకున్న సినిమానే ఇప్పుడు వరుణ్ చేతికి వచ్చిందంటున్నారు. ఇలా ఇతర హీరోలు కాదన్న కథలను ఎంపిక చేసుకుంటున్న వరుణ్ ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement