Superstar Mahesh Babu Praises Nani's Dasara Movie And Calls It A Stunning Cinema - Sakshi
Sakshi News home page

Mahesh Babu: 'సినిమా చాలా అద్భుతంగా ఉంది'..దసరాపై మహేశ్ బాబు రివ్యూ

Published Sat, Apr 1 2023 3:15 PM | Last Updated on Sat, Apr 1 2023 4:14 PM

Prince Mahesh Babu Praised Dasara Movie Black Buster Hit - Sakshi

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రిన్స్ స్పందించారు. దసరా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ..' దసరా మూవీ అద్భుతంగా ఉంది.  ఈ సినిమా చూసి గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నాని అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు మహేశ్‌కు ట్వీట్‌కు ధన్యవాదాలు చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది .సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రెండు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాని మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో  ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement