Keerthy Suresh: నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు: కీర్తి సురేశ్‌ | Voice Of Keerthy Suresh Dubbing For Deleted Dasara Movie Scene, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు: కీర్తి సురేశ్‌

Published Sun, Apr 16 2023 6:48 PM | Last Updated on Mon, Apr 17 2023 11:02 AM

Keerthy Suresh Shares Deleted Scene Her Own Dubbing  - Sakshi

నేచురల్ స్టార్‌ నాని, కీర్తి సురేశ్ జంటగా రీసెంట్‌ బ్లాక్ బస్టర్ మూవీ దసరా. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీలో కీర్తి, నాని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినీ ప్రముఖులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కీర్తి సురేశ్ పాత్రలో జీవించింది. అచ్చ తెలంగాణ యాసలో తన మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో తనకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరో విశేషం. 

అయితే తాజాగా కీర్తి సురేశ్‌ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో తనపాత్రకు తానే డబ్బింగ్ చెబుతూ కనిపించింది. ఈ సీన్‌ సినిమా నుంచి తొలగించినట్లు కీర్తి వెల్లడించింది. కీర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' దసరా మూవీలో తొలగించిన సీన్ ఇది. ఆ సీన్‌కు నేనే డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నన్ను చూసి అంతా టెన్షన్ పడ్డారు. డబ్బింగ్ ఒక అద్భుతమైన కళ.' అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ తెలుగు డబ్బింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అచ్చ తెలుగులో.. అది తెలంగాణ యాసలో డబ్బింగ్  చెప్పిన మహానటి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement