Nani Dasara Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Dasara OTT Release Date: ‘దసరా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Published Thu, Apr 20 2023 10:33 AM | Last Updated on Thu, Apr 20 2023 11:05 AM

Nani Dasara Movie OTT Release Date Out - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని, ‘మహానటి’ కీర్తి సురేశ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ధరణిగా నాని, వె న్నెలగా కీర్తి సురేశ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలంగాణలో యాసలో ఈ ఇద్దరు స్టార్స్‌ చేప్పే డైలాగ్స్‌, ఊరమాస్‌ యాక్టింగ్‌తో పాటు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితీరుపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఫలితంగా  ‘దసరా’ నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది.

(చదవండి: 36 ఏళ్ల వయసులో మళ్లీ మాటలు నేర్పించారు..అమ్మ తర్వాతే ఎవరైనా: సాయి తేజ్‌)

ఇన్నాళ్లు థియేటర్స్‌లో దుమ్ములేపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అయింది. దసరా ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఓటీటీ సంస్థ ‘దసరా’ విడుదల తేదిని ప్రకటించింది. ఏప్రిల్‌ 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ట్వీటర్‌ వేదికగా తెలియజేసింది. థియేటర్స్‌లో ఈ సినిమాను మిస్‌ అయిన ప్రేక్షకులు మరో వారం రోజుల్లో ఓటీటీలో చూడొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement