
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. గోదావరి ఖని బొగ్గు గనుల నేపథ్యంలో మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. మొన్నటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాని ఈ సినిమాతో మాస్ ఇమేజ్‌ను సొంతం సంపాదించుకున్నాడు.
మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో పాటు అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. సుమారు వంద కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాల్ని మిగిల్చింది. థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. మే30 నుంచి దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దాదాపు 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుందట.
Comments
Please login to add a commentAdd a comment