నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. దాదాపు 20 రోజులకు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తుపాన్ ధాటికి ఈ మూవీ పరిస్థితి దారుణం అయిపోయింది. తొలి వీకెండ్ ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా థియేట్రికల్ రన్ దాదాపు చివరకొచ్చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య సూపర్ యాక్టింగ్ చేశారు. కానీ వర్షాల వల్ల ఈ సినిమాని చాలామంది థియేటర్లలో చూడలేకపోయారు. అయితే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు అనుకున్న టైం కంటే ముందే దీన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)
ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమా.. సెప్టెంబరు 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నాని మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.
'సరిపోదా శనివారం' స్టోరీ విషయానికొస్తే సూర్య(నాని)కి కోపమెక్కువ. కానీ తల్లి చెప్పడంతో శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు. పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఇదలా ఉండగా దయానంద్ (ఎస్జే సూర్య) అనే సీఐ క్రూరుడు, మహా కోపిష్టి. ఇతడు సోకులపాలెం అనే ఊరి ప్రజల్ని తెగ హింసిస్తుంటాడు. అలాంటి దయాకి సూర్య ఎలా అడ్డు నిలబడ్డాడు? చివరకు ఏమైందంనేదే మిగిలిన కథ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment