ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్ | Upcoming OTT Release Movies Telugu September 3rd Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT: ఓటీటీల్లో ఈ వారం ఏమేం సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయ్?

Published Mon, Sep 16 2024 8:39 AM | Last Updated on Mon, Sep 16 2024 10:13 AM

Upcoming OTT Release Movies Telugu September 3rd Week 2024

ప్రస్తుతం అందరూ వినాయక చవితి నిమజ్జనం మూడ్‌లో ఉ‍న్నారు. అలానే వచ్చే వారం 'దేవర' రిలీజ్ ఉంది కాబట్టి ఈ వారం చెప్పుకోదగ్గ మువీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'గొర్రె పురాణం', 'మన్యం ధీరుడు', 'హైడ్ అండ్ సీక్' అనే చిన్న చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ 16కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామీ చిత్రాలతో పాటు ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సూపర్ హిట్ హిందీ సిరీస్ పంచాయత్ తమిళ రీమేక్ 'తలైవేట్టాయామా పాళ్యం' ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఇవి కాకుండా శుక్రవారం కొత్త సినిమాలు ఏమైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్/ వెబ్ సిరీస్ (సెప్టెంబరు 16 నుంచి 22 వరకు)

హాట్‌స్టార్

  • అన్‌ప్రీజన్డ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16

  • అగాథా: హౌస్ ఆఫ్ హార్క్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 18

  • ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 20

  • తలైవేట్టాయామాపాళ్యం (తమిళ సిరీస్) - సెప్టెంబరు 20

  • ద జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21

అమెజాన్ ప్రైమ్

  • ఏ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19

నెట్‌ఫ్లిక్స్

  • కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 17

  • ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 19

  • హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20

  • తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 20

  • ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 21

ఆహా

  • హై ఆన్ కాదల్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 16

  • తిరగబడరా సామీ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 19

  • మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 20

జియో సినిమా

  • జో తేరా హై వో మేరా హై (హిందీ మూవీ) - సెప్టెంబరు 20

  • ద పెంగ్విన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement