Thiragabadara Saami Movie
-
ఓటీటీలో 'తిరగబడరసామీ' స్ట్రీమింగ్పై ప్రకటన
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తిరగబడరసామీ'. ఆగష్టు నెలలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న ఈ మూవీని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిచారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోలే మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ప్రేమలో పడ్డారని లావణ్య అరోపించింది. తనను ప్రేమించిన రాజ్ మాల్వీ పరిచయంతో మోసం చేశాడని ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే.(ఇదీ చదవండి: సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?)'తిరగబడరా సామీ' ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మించారు. మిక్స్డ్ టాక్ రావడతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో రాజ్ తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా,ప్రగతి, రఘుబాబు,తాగుబోతు రమేశ్ వంటి స్టార్స్ నటించారు.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్
ప్రస్తుతం అందరూ వినాయక చవితి నిమజ్జనం మూడ్‌లో ఉన్నారు. అలానే వచ్చే వారం 'దేవర' రిలీజ్ ఉంది కాబట్టి ఈ వారం చెప్పుకోదగ్గ మువీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'గొర్రె పురాణం', 'మన్యం ధీరుడు', 'హైడ్ అండ్ సీక్' అనే చిన్న చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ 16కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో తంగలాన్, మారుతీనగర్ సుబ్రమణ్యం, తిరగబడరా సామీ చిత్రాలతో పాటు ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సూపర్ హిట్ హిందీ సిరీస్ పంచాయత్ తమిళ రీమేక్ 'తలైవేట్టాయామా పాళ్యం' ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఇవి కాకుండా శుక్రవారం కొత్త సినిమాలు ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్/ వెబ్ సిరీస్ (సెప్టెంబరు 16 నుంచి 22 వరకు)హాట్స్టార్అన్ప్రీజన్డ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 16అగాథా: హౌస్ ఆఫ్ హార్క్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 18ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 20తలైవేట్టాయామాపాళ్యం (తమిళ సిరీస్) - సెప్టెంబరు 20ద జడ్జ్ ఫ్రమ్ హెల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21అమెజాన్ ప్రైమ్ఏ వెరీ రాయల్ స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19నెట్ఫ్లిక్స్కలినరీ క్లాస్ వార్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 17ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 19హిజ్ త్రీ డాటర్స్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20తంగలాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 20ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 21ఆహాహై ఆన్ కాదల్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 16తిరగబడరా సామీ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 19మారుతీనగర్ సుబ్రమణ్యం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 20జియో సినిమాజో తేరా హై వో మేరా హై (హిందీ మూవీ) - సెప్టెంబరు 20ద పెంగ్విన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
'తిరగబడర సామీ' సినిమా రివ్యూ
లావణ్య అనే అమ్మాయి వల్ల హీరో రాజ్ తరుణ్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి, తనని మోసం చేశాడని ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాయి. అదే మాల్వి మాల్హోత్రా-రాజ్ తరుణ్ జంటగా కలిసి నటించిన 'తిరగబడర సామీ' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. రచ్చ వల్ల చర్చల్లో నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?లావణ్య అనే అమ్మాయి వల్ల రాజ్ తరుణ్‌తో పాటు 'తిరగబడర సామీ' సినిమా కూడా వార్తల్లో నిలిచింది. కానీ అనుకున్నంతగా ఇందులో ఏం లేదు. టాలీవుడ్లో చాలాసార్లు చూసేసిన కథతోనే సినిమా తీశారు. పోనీ ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. మొదలైన దగ్గర చివరివరకు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో సాధారణ ప్రేక్షకుడు సులభంగా ఊహించేస్తాడు. అంత నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించారు.తప్పిపోయిన, కనిపించకుండా పోయిన వ్యక్తుల్ని.. ఆయా వ్యక్తుల కుటుంబీకులకు అప్పగించే కుర్రాడిగా రాజ్ తరుణ్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత పాటలు ఇలా చప్పగా సాగుతూ ఉంటుంది. అసలు తనని పెళ్లి చేసుకున్న శైలజ ఎవరో తెలిసే విషయంతో ఇంటర్వెల్ పడుతుంది. అయితే అనవసరమైన సీన్లతో సెకండాఫ్ ఇంకా భారంగా సాగుతుంది. ఫైట్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.గంట 55 నిమిషాల నిడివితో తీసినప్పటికీ.. ఏదో మూడు గంటల సినిమా చూస్తున్నామా అనేంత భారమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడెప్పుడో 90ల్లో రాసుకున్న కథని ఇప్పుడెందుకు తీశారు? అసలు రాజ్ తరుణ్ ఇలాంటి మూవీ ఎందుకు చేశాడా అని సందేహాలు వస్తాయి. ఇందులో హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెబుతారు. కానీ ఒక్కచోట కూడా పొట్ట ఎత్తుగా ఉన్నట్లు చూపించారు. ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో బోలెడు ఉంటాయి.ఎవరెలా చేశారు?రాజ్ తరుణ్ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. కాకపోతే ఇందులో అతడి యాక్టింగ్ స్టామినాని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఏదో అలా చేశాడంతే! హీరోయిన్ మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ పర్లేదు. విలన్‌గా చేసిన మకరంద్ దేశ్ పాండే పాత్ర, బిహేవ్ చేసే విధానం మరీ సిల్లీగా ఉంటుంది. గ్లామర్ షో చేసేందుకే మన్నారా చోప్రా పాత్ర ఉంది. మిగిలిన పాత్రలన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే! టెక్నికల్ విషయాలకొస్తే.. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాలు తీసిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి.. మరీ ఇలా అయిపోయారేంటి అనిపిస్తుంది. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరీ లౌడ్‌గా ఉండి తెగ ఇబ్బంది పెట్టింది. సినిమాటోగ్రాఫీ, నిర్మాణ విలువలు ఓకే ఓకే. ఓవరాల్‌గా చెప్పుకొంటే రాజ్ తరుణ్-లావణ్య గొడవ వల్ల కాస్త హైలైట్ అయిన ఈ సినిమా.. కనీసం అంటే కనీసం ఆకట్టుకోలేకపోయింది! -
పోలీసులతో పాటు మీడియా ముందుకు రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాత్ తరుణ్‌పై ఫిర్యాదు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకొని మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ క్రమంలో తనకు అబార్షన్ కూడా చేపించాడని ఆమె ఆరోపించింది.రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడర స్వామి' సినిమాకు సంబంధించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి లావణ్య కూడా వస్తుందని సమాచారం ఉంది. తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందే రాజ్ తరుణ్‌ను నిలదీయాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఏమైన గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు.'తిరగబడర స్వామి' సినిమాలో మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని లావణ్య ఆరోపించింది. అయితే, తాజాగా జరగనున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రానికి మాల్వీ మల్హోత్రా కూడా వస్తుందా అనేది తేలాల్సి ఉంది.లావణ్యపై ఫైర్ అయిన రాజ్ తరుణ్ స్నేహితుడు'తిరగబడర స్వామి' సినిమా మీడయా సమావేశానికి రాజ్ తరుణ్ స్నేహితుడు rj శేఖర్ బాషా కూడా హజరయ్యాడు. లావణ్య విషయంలో రాజ్ తరుణ్‌కు సంబంధించి ఎలాంటి తప్పులేదని ఆయన చెప్పాడు. ఈ విషయంలో తప్పంతా లావణ్యదే అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. ఆమె గుండెకాయ మస్తాన్ వద్ద ఉందంటూ చెప్పుకొచ్చాడు. రాజ్ తరుణ్‌ను నిలదీసేందుకు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఆమె వస్తుందని ప్రశ్నించాడు. అమె ప్రసాద్ ల్యాబ్ వద్దకు వస్తే ఆమె చేసిన తప్పుల గురించి కచ్చితంగా నిలదీస్తానంటూ ఆర్జే శేఖర్ ఫైర్ అయ్యాడు. అయితే, మరికొంత సమయంలో ప్రారంభం కానున్న ఈ మీడియా సమావేశానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో పాటు రాజ్ తరుణ్ ఇప్పటికే హజరయ్యారు. పోలీసులు సమక్షంలో ఈ మీడియా సమావేశం జరగనుంది. -
కొందరు ఇండస్ట్రీని దోచుకుంటున్నారు: నిర్మాత
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరో హీరోయిన్లుగా, మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ– ‘‘మూడు ముళ్ళ బంధానికి భార్యాభర్తలు ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనమే ‘తిరగబడర సామీ’. ఓ మామూలు కుర్రాడు ఏ పరిస్థితుల వల్ల వైలెంట్‌గా మారాడు? అనేది కథ. రాజ్ తరుణ్ – మాల్వీల వ్యక్తిగత అంశాలతో ఈ సినిమాకు సంబంధం లేదు. వాళ్లిద్దరి ప్రెజెన్స్‌తో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. జేడీ చక్రవర్తితో ఓ సినిమా ప్లానింగ్ ఉంది. ‘తిరుమల బాలాజీ’, ‘రాహు కేతు’ వెబ్ సిరీస్‌లతో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొందరు సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్నారు. టికెట్ ధరలను తగ్గించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (‘బడ్డీ’ సినిమా టికెట్ ధర తగ్గించడాన్ని ఉద్దేశించి) రిలీజ్ చేయడాన్ని సపోర్ట్ చేస్తున్నా. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను’’ అని చెప్పుకొచ్చారు. -
తిరగబడరా స్వామి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మాల్వీ మల్హోత్రా.. పోటోలు