
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరో హీరోయిన్లుగా, మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ– ‘‘మూడు ముళ్ళ బంధానికి భార్యాభర్తలు ఏ విధంగా కట్టుబడి ఉండాలనడానికి నిదర్శనమే ‘తిరగబడర సామీ’. ఓ మామూలు కుర్రాడు ఏ పరిస్థితుల వల్ల వైలెంట్‌గా మారాడు? అనేది కథ.
రాజ్ తరుణ్ – మాల్వీల వ్యక్తిగత అంశాలతో ఈ సినిమాకు సంబంధం లేదు. వాళ్లిద్దరి ప్రెజెన్స్‌తో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. జేడీ చక్రవర్తితో ఓ సినిమా ప్లానింగ్ ఉంది. ‘తిరుమల బాలాజీ’, ‘రాహు కేతు’ వెబ్ సిరీస్‌లతో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొందరు సినిమా ఇండస్ట్రీని దోచుకుంటున్నారు. టికెట్ ధరలను తగ్గించి నిర్మాత జ్ఞానవేల్ రాజా (‘బడ్డీ’ సినిమా టికెట్ ధర తగ్గించడాన్ని ఉద్దేశించి) రిలీజ్ చేయడాన్ని సపోర్ట్ చేస్తున్నా. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment