ఓటీటీలో 'తిరగబడరసామీ' స్ట్రీమింగ్‌పై ప్రకటన | Tiragabadara Saami Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'తిరగబడరసామీ' స్ట్రీమింగ్‌పై ప్రకటన

Published Mon, Sep 16 2024 5:01 PM | Last Updated on Mon, Sep 16 2024 5:34 PM

Tiragabadara Saami Movie OTT Streaming Date Locked

టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తిరగబడరసామీ'. ఆగష్టు నెలలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనే టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీని ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిచారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోలే మాల్వీ మల్హోత్రాతో రాజ్‌ తరుణ్‌ ప్రేమలో పడ్డారని లావణ్య అరోపించింది. తనను ప్రేమించిన రాజ్‌ మాల్వీ పరిచయంతో మోసం చేశాడని ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: సిద్ధార్థ్‌,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?)

'తిరగబడరా సామీ' ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్‍కు తీసుకొస్తున్నట్లు ఒక పోస్టర్‌ను షేర్‌ చేసింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మించారు. మిక్స్‌డ్‌ టాక్‌ రావడతో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో  రాజ్ తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా,ప్రగతి, రఘుబాబు,తాగుబోతు రమేశ్ వంటి స్టార్స్‌ నటించారు.

కథేంటి?
సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement