Raj Tarun's Stand Up Rahul OTT Release Date Locked, Deets inside - Sakshi
Sakshi News home page

Stand Up Rahul: అప్పుడే ఓటీటీలోకి వస్తున్న స్టాండప్‌ రాహుల్‌, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published Wed, Mar 30 2022 10:18 AM | Last Updated on Fri, Apr 8 2022 3:23 PM

Stand Up Rahul OTT Release Date Locked - Sakshi

రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం 'స్టాండప్‌ రాహుల్‌'. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించారు. స్టాండప్‌ కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్‌తో సాగుతుందీ మూవీ. మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టాండప్‌ రాహుల్‌కు పెద్దగా ఆదరణ లభించలేదు.

ఈ క్రమంలో తాజాగా ఓటీటీలో రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అయింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఏ‍ప్రిల్‌ 8 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. 'స్టాండప్‌ అనే పదం కఠినమైన పీటీ టీచర్‌లాగా అనిపించినా మూవీ మాత్రం ఫన్‌ ఉంటది. స్టాండప్‌ రాహుల్‌ ఆహాలో ఏప్రిల్‌ 8 నుంచి ప్రసారం కానుంది. వీక్షించేయండి' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది ఆహా.

చదవండి: రిపోర్టర్లపై స్టార్‌ హీరో ఘాటు వ్యాఖ్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement