varsha
-
అమ్మాయి కాదనుకుని లోపలకు రానివ్వలేదన్న వర్ష.. కుటుంబంతో రోడ్డుమీద అమర్..
టాలీవుడ్ నటి సురేఖ కూతురు సుప్రిత (Suprita) త్వరలోనే హీరోయిన్గా పరిచయం కానుంది. బిగ్‌బాస్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary)తో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆమె యాంకర్ అవతారమెత్తింది. పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా ఈ షోకు నటుడు అమర్దీప్, కమెడియన్ వర్ష అతిథులుగా విచ్చేశారు. సముద్రంలో సునామీని, కెమెరా ముందు సుప్రితను ఎవ్వరూ ఆపలేరు అని డైలాగ్ వేసింది. అందుకు అమర్.. 'సునామీలో T సైలెంట్.. ఆవిడ (సుప్రిత) వచ్చిందంటే జనాలు సైలెంట్' అన్నాడు.అమ్మాయిని కాదనుకుని..మీరు అమ్మాయా? అబ్బాయా? అని వర్షను ప్రశ్నించింది. అందుకామె.. నేను అమ్మాయిని కాదనుకుని ఒక పార్లర్లోనికి పంపించలేదని తెలిపింది. ఎంత డౌట్ వస్తే అలా చేసుంటారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత ఓ సంఘటన జరిగింది కదా.. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అని సురేఖ ప్రశ్నించింది. అందుకు అమర్.. ఆరోజు నేను నా కుటుంబంతో రోడ్డు మీద నిల్చున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో ఆ దారిలో వెళ్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బ్రో, వి డోంట్ కేర్ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ హీరోయిన్ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా: లక్ష్మీ మంచు -
‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ హీరోయిన్ ‘అను’ పెళ్లి సందడి (ఫొటోలు)
-
మారుతి సుజుకి డిజైర్ కారును ఆవిష్కరించిన జబర్దస్త్ వర్ష (ఫొటోలు)
-
సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న జబర్దస్త్ వర్ష (ఫోటోలు)
-
ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి హెచ్‌కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది ముద్దుగమ్మ. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్‌వుడ్‌లోనూ పలు సీరియల్స్‌లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.(ఇది చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్‌లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శాండల్‌వుడ్ బ్యూటీ వర్ష హెచ్‌కే. అంతకుముందు కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. View this post on Instagram A post shared by 𝙆𝙖𝙪𝙨𝙝𝙞𝙠 𝙉𝙖𝙞𝙙𝙪 (@peoplez_prince) -
మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటం దక్కించుకున్న వర్షారెడ్డి
-
మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్‌తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు. 2012లో మిస్ సౌత్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్‌కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు. -
విజయవాడ : అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్ ని ప్రారంభించిన సినీనటి వర్ష (ఫొటోలు)
-
రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో సందడి చేసిన నటి వర్ష (ఫోటోలు)
-
'ఫ్యామిలీ స్టార్'లో తళుక్కుమన్న బ్యూటీ.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
overthinkers club: అతిగా ఆలోచన ఆనందానికి శత్రువు
‘నేను చేసింది తప్పేమో’ ‘నేను చేసిన పని వల్ల ఇలా అవుతుందేమో’ ‘వాళ్లు అలా చేస్తే ఏం చేయాలి?’ ‘నా పరువు పోతుందేమో’... చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్ ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్ మీడియా ద్వారా ఈ క్లబ్ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు. ‘జీవితంలో మార్పులు సహజం. కాని జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు... వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు. వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్. ఆలోచన.. అతి ఆలోచన ‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే... వాన పడితే... వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది... లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్ అవుతాయి. ధ్యాస మళ్లించాలి ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్ ► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు ► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్ చేద్దాం... చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి ► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి ∙సోషల్ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి ► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది ► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి. ఓవర్‌థింకర్ల లక్షణాలు ► ఆత్మవిమర్శ అధికంగా చేయడం ► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్ఫెక్షనిజం) ► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం ► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం ► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం ► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం ► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం. -
Jabardasth Varsha: బ్లాక్ చీరలో వర్ష అందాలు... లేటెస్ట్ ఫోటోస్ చూశారా? (ఫోటోలు)
-
కిక్కెక్కుతోందే జన్మ...
సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మా.. కిక్కెక్కుతోందే జన్మ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, తిరుపతి జావన లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ఈ సినిమాకు సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
Jabardasth Varsha Latest Photos: సముద్రతీరంలో జబర్దస్త్ వర్ష ఆటలు.. తడిసి ముద్దవుతున్న అందాలు (ఫోటోలు)
-
బంజారాహిల్స్: టెక్నోవిజన్ స్టోర్‌లో సందడి చేసిన జబర్దస్త్ ఫేం, నటి వర్ష (ఫొటోలు)
-
ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి!
జబర్దస్త్ కామెడీషోతో పేరుప్రఖ్యాతలు సంపాదించింది వర్ష. అందంతో అలరిస్తూనే కామెడీ స్కిట్లతో నవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ 7వ సీజన్లో అడుగుపెట్టనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ షోలో తన ఎంట్రీపై స్పందించింది వర్ష. 'నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒక స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కూడా వచ్చింది. కానీ బుల్లితెరను వదలడం ఇష్టం లేక అక్కడికి వెళ్లలేదు. త్వరలో పెద్ద షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నా అయితే ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. కానీ హీరోయిన్గా చేయాలన్న ఆశ లేదు. అక్క, వదిన, ఫ్రెండ్.. ఇలాంటి రోల్స్ మాత్రమే చేస్తాను. ఇకపోతే త్వరలో నేను ఓ పెద్ద షోకి వెళ్తున్నాను.. ఏం చదువుకున్నాను? వంటి విషయాలను అక్కడే రివీల్ చేస్తాను. ఇప్పటికే నాకు చెక్కులు కూడా పంపించేశారు' అంటూ పరోక్షంగా బిగ్‌బాస్ ఎంట్రీ గురించి హింట్లు వదిలింది వర్ష. అన్నయ్యను స్కూటీతో ఢీ కొట్టారు తన జీవితంలో ఎంతగానో బాధపడ్డ సందర్భం గురించి చెప్తూ.. 'నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. రెండేళ్లక్రితం నేను సంక్రాంతికి ఊరెళ్లాను. అప్పుడు అమ్మ ఫోన్ చేసి మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని, త్వరగా రా అని చెప్పింది. మా అన్నయ్యను స్కూటీతో గుద్దారు. అది చాలా చిన్న యాక్సిడెంట్ అనుకున్నాను. తీరా ఆస్పత్రికి వెళ్లాక తన బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది.. బతకడం కష్టం అన్నారు. డాక్టర్ కాలు పట్టుకుని ఏడ్చాను. ఎంత ఖర్చయినా సరే బతికించండి అని బతిమాలాను. రెండు రోజులు వాష్‌రూమ్ బయటే నిద్ర అన్నయ్య కండీషన్ నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్లు తట్టుకోలేరు. అందుకే ఆ టెన్షన్ అంతా నేనే భరించాను. రెండు రోజులు వాష్‌రూమ్ బయట పడుకున్నాను. ఆ తర్వాత రోజు అన్నయ్య మెదడులో రక్తం లీక్ అవుతుందని చెప్పడంతో భరించలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. ఇంతలో అంబులెన్స్‌లో సొమ్మసిల్లి పడిపోవడంతో సెలైన్స్ పెట్టి నాకు ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత అన్నయ్యకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఎందుకంటే అన్నయ్య నా పంచప్రాణాలు' అని చెప్పుకొచ్చింది వర్ష. చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు -
Anchor Varsha Photos: హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్‌లో జబర్దస్త్ వర్ష సందడి (ఫొటోలు)
-
ఆమె సేవ అనూహ్యం
లక్నో: ఈ ఫొటోలో మహిళ పేరు వర్ష వర్మ. వయసు 44 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు చెందిన ఆమెలో సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే తపన ఉంది. దీంతో అయిదేళ్లుగా ఎవరూ చేయలేని ఒక అనూహ్యమైన పనికి పూనుకున్నారు. ఏక్ కోషిస్ ఏసీ భీ అనే సంస్థను స్థాపించి మార్చురీల్లో గుర్తు పట్టని మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారిని గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నట్టుగా ఆమె భావిస్తున్నారు. 72 గంటల సేపు మృత దేహం కోసం కుటుంబ సభ్యులెవరూ రాకపోతే స్థానిక అధికారులు ఆమెకే చెబుతారు. ఇలా వారానికి సగటున మూడు మృతదేహాలకు వర్ష అంతిమ సంస్కారం నిర్వహిస్తున్నారు. ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని వర్ష చెబుతున్నారు. -
పింక్ లో ప్రియమణి.. బ్లూ డ్రెస్‌లో వర్ష..తారల అందాలు
పింక్ డ్రెస్ లో మతి పోగోడుతున్న ప్రియమణి నీలి రంగు డ్రెస్‌లో వర్ష పరువాల విందు వొకేషన్ మూడ్ అంటూ సముద్రం ఒడ్డున బోటుపై ఫోటోకి పోజులు ఇచ్చాడు బుల్లితెర నటుడు రవికృష్ణ View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
మాల్దీవుల్లో రకుల్ రచ్చ..చీరలో అనసూయ హొయలు
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న దివి చీరలో అనసూయ అందాల ప్రదర్శన సంప్రదాయ దుస్తుల్లో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది జబర్దస్త్ ఫేం వర్ష . View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు: వర్ష
జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయింది వర్ష. ఆన్ స్క్రీన్‌పై కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో జోడీ కట్టి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ 'ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?' అంటూ యూట్యూబ్‌లో వీడియో షేర్ చేసింది. ఏంటి? ఇంత సడన్‌గా పెళ్లి కబురు చెప్పిందేంటా? అని అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. 'సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నేను చాలా షాకయ్యాను. కొన్ని పరిస్థితుల వల్ల ఎవరికీ చెప్పకుండానే సడన్‌గా ఎంగేజ్మెంట్ జరగబోతోంది. నాకైతే చాలా సిగ్గేస్తోంది. పెళ్లికొడుకు ఎలా ఉంటాడు? అనేది వీడియో చివర్లో చూపిస్తాను' అంటూ తన దగ్గరున్న చీరలు, నగలు అన్నింటనీ చూపించింది. అందులో ఒక చీరను, దానికి సూటయ్యే నగలను పెట్టుకుని ఎలాగోలా ముస్తాబైంది. చివర్లో మాత్రం ఎంగేజ్మెంట్ తనది కాదని షాకిచ్చింది. రాకింగ్ రాకేశ్ రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ అన్నాడు. త్వరగా రెడీ అయి వచ్చేశాను. నా ఎంగేజ్మెంట్ గురించి కూడా త్వరలో చెప్తానులే అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మరీ అంత సిగ్గుపడినప్పుడే ఇదంతా ప్రాంక్ అని అర్థం చేసుకోవాల్సిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధంలో మమ్మల్నే నిందించొద్దు: నటి -
వర్ష తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇమ్మానుయేల్
-
బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్!
బుల్లితెర ఆన్‌స్క్రీన్ జోడి వర్ష, ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ గురించి తెలిసిందే. కామెడీ షో జబర్థస్త్ స్టేజ్‌పై జోడి కట్టి ఎంతో పాపులారిటి సంపాదించుకున్నారు. స్క్రీన్‌పై రియల్ కపుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రష్మీ-సుధీర్ జోడి తర్వాత వీరిద్దరితో జోడి అంతగా గుర్తింపు పొందింది. ఏ షోలో అయినా వీరిద్దరు జతకట్టి ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తున్నారు. ఆ మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఈ ఆన్‌స్క్రీన్ జోడి ఇటీవల ఓ షోలో కలిసిపోయారు. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో వర్ష బర్త్‌డేకు ఇమ్మాన్యుయేల్ ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే నెల ఆమె బర్త్‌డే సందర్భంగా కాస్ట్లీ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్వయంగా వర్షని హైదరాబాద్‌లోని ప్రముఖ జ్యువెల్లరి షాప్‌కు తీసుకెళ్లి ఆమెతో షాపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే నిజానికి నెక్లెస్ బహుమతిగా ఇవ్వలేదని, తమ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఇటీవలే అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఆయన కస్టడీని పొడింగించింది ముంబై ప్రత్యేక కోర్టు. సోమవారం వరకు ఈడీ అధీనంలోనే విచారణ ఎదుర్కోనున్నారు రౌత్. కస్టడీ పొడిగించిన క్రమంలో.. ఈ కేసు దర్యాప్తులో ఈడీ పురోగతి సాధించినట్లు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ముంబైలోని ఛాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని గత ఆదివారం సంజయ్ రౌత్‌ను సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. అనంతరం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. అలాగే.. ఆయన భార్య, ఇతరులకు ప్రమేయం ఉన్న ట్రాన్సాక్షన్స్‌లను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో గురువారం పీఎంఎల్ఏ కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే ముందు రౌత్‌ను హాజరుపరిచింది ఈడీ. లోతైన విచారణ జరిపేందుకు కస్టడీ పొడగించాలని కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రౌత్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించారు. హౌసింగ్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌లో రౌత్, ఆయన కుటుంబం సుమారు రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో పేర్కొంది ఈడీ. అయితే.. ఈ వాదనలు తోసిపుచ్చారు రౌత్. సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు.. పార్థ ఛాల్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు గురువారం సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసులో రౌత్ కస్టడీ పొడిగించిన కొన్ని గంటల్లోనే సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్ష రౌత్ ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినట్లు బయటకి రావటంతో ఈ సమన్లు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్ష రౌత్ ఖాతాలోకి సుమారు రూ.1.08 కోట్లు నగదు వచ్చినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
Fashion: ఒక్కో బ్లవుజు ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..!
ఏ ఇద్దరు మనుషులూ ఒక్కలా ఉండరు. ఏ ఇద్దరి అభిరుచులూ ఒక్కలా ఉండవు. మరి ధరించే దుస్తులు మాత్రం ఒకేలా ఎందుకుండాలి? దేనికది ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదు? ఇది ఓ సందేహం. చీరల కోసం వందలాది షోరూమ్‌లున్నాయి. బ్లవుజుకు ఒక్క షో రూమ్ కూడా ఉండదెందుకు? మరో సందేహం. అది లేదు... ఇది లేదు... అనుకోవడం కాదు, ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు? ఇన్ని సందేహాలు, సమాధానాల మధ్య రూపుదిద్దుకున్న ఐడియా ‘డిజైనింగ్ ఐడియాస్, జస్ బ్లవుజ్’. హైదరాబాదీ డిజైనర్ వర్షామహేంద్ర ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఓ కొత్త ఆలోచన ఆ తర్వాత వందలాది మందికి ఉపాధి మార్గంగా మారింది. వర్షామహేంద్రది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి బి.ఎ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ‘‘మా నాన్న వ్యాపారి. అమ్మ స్కూల్ టీచర్. నాకు డెస్క్ జాబ్ నచ్చేది కాదు. నాన్నలాగ బిజినెస్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉండేది. అదే సమయంలో కెరీర్ సృజనాత్మకంగా, నాకంటూ ప్రత్యేకమైనదిగా ఉండాలనే కోరిక కూడా ఉండేది. దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబై, జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఏడాది డిప్లమో కోర్సు చేశాను. పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లడం నా లక్ష్యాన్ని సులువు చేసింది. అక్కడ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. నా పెళ్లి చీరలు, బ్లవుజ్‌ల అనుభవంతో కోర్సులో చేరినప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టితో ఫ్యాషన్ ప్రపంచాన్ని గమనించగలిగాను. ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) కోసం పని చేయడం నాకు మంచి అవకాశం. వర్షామహేంద్ర క్లోతింగ్‌లో అనేక ప్రయోగాలు చేశాం. కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ నా బలం. అలాగే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన వడపోతలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరువందల మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉండడంతో నాకు సొంతంగా నా బ్రాండ్‌ను విజయవంతం చేయగలననే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే 2010లో హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సొంత స్టార్టప్ ప్రారంభించాను. ఇండియన్ బిజినెస్ స్కూల్– గోల్డ్మాన్సాచె ఫెలో పదివేల మంది మహిళల్లో స్థానం లభించడం నాకు మంచి సోపానం అయింది. ఇంటర్న్‌షిప్ కోసం న్యూయార్క్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆహ్వానం అందింది. దాదాపుగా రెండు నెలలు అక్కడ క్రాఫ్ట్మెన్ను, విద్యార్థులను సమన్వయం చేస్తూ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 2014లో యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యాను. అది నా ఫస్ట్ ఫ్యాషన్ షో. న్యూయార్క్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొన్నాను. ఇన్ని వేదికల మీద విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ... కేవలం బ్లవుజ్‌ల కోసమే ఒక వేదికకు రూపకల్పన చేస్తూ నేను స్టార్టప్ ప్రారంభించడం తెలివైన నిర్ణయమే అని అనిపించింది. మార్కెట్ స్టడీ చేయలేదు మామూలుగా స్టార్టప్ ప్రారంభించే ముందు మార్కెట్ స్టడీ చేయాలి. కానీ నేను మార్కెట్లో ఉన్న గ్యాప్‌ని గుర్తించగలిగాను. అదే నా విజయ రహస్యం. నాతోపాటు ఇద్దరు ఉద్యోగులతో మొదలైన స్టార్టప్ ఇప్పుడు డెబ్బై మందితో పని చేస్తోంది. వెయ్యి నుంచి పన్నెండు వందల బ్లవుజ్‌లు ఒక చోట దేనికది ప్రత్యేకంగా ఉంటే ఇంకేం కావాలి. ఒక్కో బ్లవుజ్ ధర రెండున్నర వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఒకప్పుడు చీర కొనుక్కుని బ్లవుజ్ కోసం మ్యాచింగ్ సెంటర్లకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు నచ్చిన డిజైనర్ బ్లవుజ్ కొని ఆ తర్వాత దానికి సరిపడే సింపుల్ చీరను సెలెక్ట్ చేస్తున్నారు. బ్లవుజ్ హైలైట్ కావడమే ఫ్యాషన్ ట్రెండ్‌గా చేయగలిగాను. ఇది ఫ్యాషన్ రంగానికి నా కంట్రిబ్యూషన్ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా నేను ఫ్యాషన్ రంగంలో ఉన్నాను. దేశవిదేశాల ఫ్యాషన్ వేదికలను చూశాను. మన భారతీయ వస్త్రధారణలోనే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇక నా స్వీయ అనుభవంలోకి వస్తే... నా పెళ్లికి హెవీ చీర కొనేశాను. బ్లవుజ్ కుట్టించుకోవడానికి పెద్ద–చిన్న టైలర్ల చుట్టూ తిరిగాను. ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. నా అసంతృప్తి నుంచి నేను డిజైన్ చేసుకున్న ఫ్యాషన్ ఇది. నేను సృష్టించుకున్న కెరీర్ ఇది. అప్పుడు నేను సృష్టించిన ట్రెండ్ వందలాది మందికి ఉపాధి మార్గం అయిందంటే ఎంతో సంతోషంగా కూడా ఉంది’’ అన్నారు వర్షామహేంద్ర. ఎల్లలు దాటిన మన నేత మన సంప్రదాయ నేతకు ఆదరణ తగ్గి నేతకారుల ఇంటి కొత్త తరం ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్న రోజుల్లో వర్ష వీవింగ్ ఫ్యూజన్‌కు తెర తీశారు. నేతకారుల జీవిక కోసం సహాయం చేస్తున్న యూకేలోని ఎన్జీవోతో కలిసి పోచంపల్లి నేతకారుల కోసం పని చేశారామె. అలాగే ఇప్పుడు పైథానీ, కంచిపట్టు, నారాయణపేట, చీరాల, లక్నో నేతకారులు, ఉదయ్‌పూర్–జైపూర్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారులు, కోల్‌కతా రేషమ్ కళాకారులతో కలిసి ఒక చీరలో రెండు – మూడు రకాల సమ్మేళనానికి రూపమిస్తున్నారు. ‘‘ఒక చీరను విదేశీ వేదిక మీద ప్రదర్శించినప్పుడు దాని గురించి వివరించడానికి బోలెడంత సమాచారం ఉంటుంది. మన వస్త్ర విశేషం అదే’’ అన్నారామె. చీరకు చక్కటి కట్టు అందాన్ని తెస్తుంది, బ్లవుజ్‌కి చక్కటి కుట్టు అందాన్ని తెస్తుంది. ఈ రెండింటినీ మేళవించడంలో సక్సెస్ అయ్యారు వర్ష. – వాకా మంజులారెడ్డి చదవండి👉🏾Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
మహిళల వద్దకే ఉద్యోగాలు
పదహారు శాతం అంటే... ప్రపం చంలో ఏ దేశంతో పోల్చి చూసినా భారతదేశంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం అత్యల్పమనే! ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కోవిడ్‌కు ముందు ఈ శాతం 21గా ఉండేది. ఇందులో ఉన్న మరింత ప్రతికూలత ఏమిటంటే... ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం ప్రాంత, వర్గ తారతమ్యం లేకుండా రెండిటిలోనూ ఒకే విధమైన అనిమిత్తతతో ఉండటం. గ్రామీణ ప్రాంతాల్లో కొంత నయం. పట్టణాల్లోనైతే ఉద్యోగ పంతం పట్టింపు లేనట్లే ఉంటుంది. ఇక సంపన్న స్థాయిలో వివాహిత మహిళల్లో 6.5 శాతం మాత్రమే ఉద్యోగాలలో కనిపిస్తుండగా ఈ శాతం అవివాహిత మహిళల్లో 15 శాతంగా ఉంది. ఈ స్వల్పశాతాలకు అనేకానేక కారణాలు దోహదం చేస్తుండవచ్చు. అందుకే దీన్నొక సమష్టి సమస్యగా చూడాలి తప్ప వ్యక్తిగత స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నించలేం. ఎవరో కొంతమంది ప్రతిభావంతులైన, అవకాశాలున్న మహిళలు ఉద్యోగాలలోకి రావడం వల్ల మహిళా ఉద్యోగ భాగస్వామ్యంలో మెరుగుదల, పెరుగుదల ఏమీ కనిపించవు. సాధారణంగా ఉద్యోగ రంగంలో మహిళలు తక్కువగా కనిపించడానికి వ్యక్తిగత, సామాజిక, కుటుంబపరమైన కారణాలు అనేకం అవరోధంగా ఉంటాయి. మహిళలకు ఉద్యోగావకాశాలను, అనుకూలతలను కల్పించేందుకు పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు జరిగినప్పటికీ... పైన పేర్కొన్న అవరోధాల వల్ల వీటి ప్రభావం తక్కువగానే ఉంటుంది. మరేం చేయాలి? ‘వండర్ గర్ల్స్’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ పరిస్థితిని మార్చగల కొన్ని పరిష్కార మార్గాలైతే కనిపించాయి. మొదటిది, ఉద్యోగాల ఉన్నతస్థాయిలలో ఆదర్శ ప్రాయంగా వెలుగొందుతున్న మహిళల నుంచి సమాజానికి ప్రేరణను అందించడం. అంటే వారి గురించి విస్తృతంగా తెలియబరచడం. సామర్థ్యాలను నిరూపించుకుంటూ విజయ పథంలో దూసుకువెళుతున్న మహిళామణుల గురించి పాఠశాల స్థాయి బాలికలకు, బాలురకు తెలిసే అవకాశం తక్కువ. పాఠ్యాంశాలలోనే ఆ మహిళల గురించి తెలియజేయడం వల్ల పిల్లల్లో లక్ష్యాలు ఏర్పడతాయి. ఈ విషయంలో తల్లిదండ్రుల చేయూత కూడా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అబ్బాయిలకు మహిళపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. అమ్మాయిల్ని ఉద్యోగాలకు ప్రోత్సహించే వాతావరణం కుటుంబాలలో ప్రారంభం అవు తుంది. రెండోది, సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం. సంరక్షణ అనే ప్రాథమిక మూలస్తంభం మీదనే మన ఆర్థికవ్యవస్థ నిలబడి ఉంది. శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ అనేవి శ్రమ, ప్రయాసలతో కూడినవి కనుక ఆ రంగం సహజంగానే మహిళలపై ఆధారపడవలసి వస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ నాలుగు కోట్ల మంది భారతీయ మహిళలు సంరక్షణ రంగంలోనే పనిచేస్తున్నారు. సంరక్షణ రంగం ఆధునికం అయితే... ఇతర రంగాలలో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం మెరుగయ్యే అవకాశం తప్పక ఉంటుంది. మూడు, విధాన నిర్ణయాలు అనేవి స్త్రీ పురుష సమానత్వ దృక్కోణంలో మాత్రమే జరగాలి. దేశంలో మహిళల, ఆర్థిక రంగ స్థితిగతులపై సామాజిక శాస్త్రవేత్త దీపా నారాయణ్, భట్టాచార్య కలిసి ఇటీవల ఒక నివేదికను వెలువరించారు. సామాజిక అధ్యయనాలపై విస్తృత చర్చ, అవగాహన కల్పన జరగాలని ఆ నివేదికలో వారు సూచించారు. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు అధికారంలో ఉన్నవారు... చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసు కోవాలని పేర్కొన్నారు. నాలుగోది, ఇంజనీరింగ్ విద్యలో ప్రస్తుతం ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించేలా ఒక సమానత్వ వారధిని నిర్మించడం. పాఠశాల స్థాయిలో విద్యార్థినులు గణితం, సైన్సు సబ్జెక్టులలో ప్రతిభను కనబరుస్తున్న వాస్తవాన్ని విస్మరించకుండా... ఉన్నతస్థాయి ఇంజనీరింగ్ విద్య కోసం వారికి అవసరమైన ఆర్థిక వనరులను కల్పిస్తే సమానత్వ వారధి నిర్మాణానికి ఎంతో కాలం పట్టదు. ఐఐటీ సీట్ల కోసం లక్షల మందితో పోటీ పడాలి. తల్లిదండ్రులు లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఆమెకు ఎంత ప్రతిభ ఉన్నా ఐఐటీకి వెళ్లే దారిలో వెనుకబడిపోతోంది. తనయుళ్లతో సమానంగా కూతుళ్లకూ డబ్బును ధారపోసి కోచింగ్ ఇప్పించే తల్లిదండ్రులెందరు?! అమ్మాయిని, అబ్బాయిని సమానంగా చూసినప్పుడు, చదివించినప్పుడు దీర్ఘకాలంలోనే అయినా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తప్పక కుదుట పడతాయి. ఐదు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా పట్టణ ప్రాంత సదుపాయాలను వృద్ధి చేయడం. కార్యాలయాలు నగరానికి దూరంగా ఎక్కడో శివార్లలో ఉంటే అంత దూరం వెళ్లలేని యువతులు తమలో ఎంత నైపుణ్యం ఉన్నా దగ్గరల్లోని ఉద్యోగానికే మొగ్గు చూపుతారు. ఈ కారణంగా శివార్ల ఉద్యోగ కేంద్రాలకు నైపుణ్యాల కొరత ఏర్పడటమే కాకుండా, అక్కడికి వెళ్లలేని మహిళల సామర్థ్యాలు తక్కువ ప్రతిఫలంతో వృధా అయే ప్రమాదం ఉంటుంది. (క్లిక్: జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం) ఆరు, ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్ శిక్షణను పొందేందుకూ మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించాలి. డిజిటల్ విద్యను నేర్పించే వారు మహిళా అధ్యాపకులై ఉండటం అత్యవసరం. పెద్ద ఎత్తున్న శిక్షణ తీసుకోవడానికి మహిళలు ముందుకు వచ్చేందుకు అవసరమైన ‘సేఫ్ డిజిటల్ స్పేస్’ను నగరాలు అందుబాటులోకి తేవాలి. (క్లిక్: ‘ఫ్యామిలీ డాక్టర్’ అవసరం) స్వీడన్ సంగీత పరిశ్రమకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గేయ రచయితలకు, ఆల్బమ్ నిర్మాతలకు నెలవు. ఆ ప్రాముఖ్యాన్ని నిలుపుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం... సామాన్యులు కూడా సంగీతం వైపు ఉత్సాహంగా అడుగులు వేసేందుకు అవసరమైన సబ్సీడీలను ఇవ్వడమే కాకుండా, పాఠశాల విద్య తర్వాత సంగీత సాధనకు ఉచిత ప్రభుత్వ సంగీత పాఠశాలను నిర్మించింది. ఇక్కడ మనం స్వీడన్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఉద్యోగ రంగానికి చేరువవడంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు పరిష్కారాలను అన్వేషించవచ్చు. ప్రజల్ని, ఫలితాల్ని మలిచేది వ్యవస్థే కదా! (క్లిక్: బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!) - వర్ష అడుసుమిల్లి ‘వండర్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు -
ఓటీటీలోకి స్టాండప్ రాహుల్, ఎప్పుడు? ఎక్కడంటే?
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. స్టాండప్ కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్‌తో సాగుతుందీ మూవీ. మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టాండప్ రాహుల్‌కు పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఏప్రిల్ 8 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 'స్టాండప్ అనే పదం కఠినమైన పీటీ టీచర్‌లాగా అనిపించినా మూవీ మాత్రం ఫన్ ఉంటది. స్టాండప్ రాహుల్ ఆహాలో ఏప్రిల్ 8 నుంచి ప్రసారం కానుంది. వీక్షించేయండి' అని ట్విటర్లో రాసుకొచ్చింది ఆహా. #StandUp ane word strict PT teacher laga anipichina, movie matram fun untadi😉#StandUpRahulOnAHA premieres April 8, sit and watch it 😎@itsRajTarun @VarshaBollamma @standupsanto @sidhu_mudda @Nandu_Abbineni @bharath1985 @sonymusicsouth pic.twitter.com/fTN3MqvXg6 — ahavideoin (@ahavideoIN) March 29, 2022 చదవండి: రిపోర్టర్లపై స్టార్ హీరో ఘాటు వ్యాఖ్యలు.. -
స్టాండప్ రాహుల్ సినిమా రివ్యూ
టైటిల్: స్టాండప్ రాహుల్: కూర్చుంది చాలు నటీనటులు: రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళీశర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకుడు: శాంటో మోహన్ వీరంకి నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంగీతం: స్వీకర్ అగస్తి సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవిచంద్రన్ రిలీజ్ డేట్: 18 మార్చి 2022 డిఫరెంట్ కాన్సెప్టులతో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్నాడు రాజ్‌తరుణ్. రానురానూ కథలపై పట్టు కోల్పోయిన అతడికి సక్సెస్ అందుకోవడం అందని ద్రాక్షే అయింది. తాజాగా స్టాండప్ రాహుల్: కూర్చుంది చాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ యంగ్ హీరో. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు. మరి నిజంగానే హీరో స్టాండప్ కమెడియన్‌గా ప్రేక్షకుడిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? వరుస అపజయాలతో కూలబడిపోయిన రాజ్‌తరుణ్ ఈ సినిమాతోనైనా లేచి నిలబడ్డాడా? లేదా? అనేది రివ్యూలో చూసేయండి.. కథ స్టాండప్ కామెడీ అనగానే చాలామందికి ఆమధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే పాత్ర గుర్తుకు రావడం ఖాయం. స్టాండప్ కమెడియన్ అంటే గుండెలో కొండంత శోకాన్ని దాచుకుని ఆ విషాదాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా నాలుగు జోకులు చెప్తూ ఎదుటివారిని నవ్విస్తారని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు. స్టాండప్ రాహుల్‌లో రాజ్‌తరుణ్ పోషించిన పాత్ర కూడా సేమ్ టు సేమ్. రాహుల్(రాజ్ తరుణ్)కు స్టాండప్ కామెడీ అంటే ప్యాషన్. తండ్రి ప్రకాశ్(మురళీ శర్మ) మనసుకు నచ్చింది చేయమంటాడు. తల్లి ఇందు(ఇంద్రజ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలంటుంది. వీళ్లిద్దరూ హీరో చిన్నతనంలోనే విడిపోతారు. ఇక రాహుల్ తనకిష్టమైన స్టాండప్ కామెడీతో పాటు ఉద్యోగాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే ఆఫీసులో పనిచేసే శ్రేయారావు(వర్ష బొల్లమ్మ)తో అతడు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లంటే గిట్టని రాహుల్ సహజీవనం చేద్దామంటాడు. అతడి ప్రేమను గెలవడం కోసం ఇష్టం లేకపోయినా లివ్ ఇన్ రిలేషన్‌కు సరేనంటుంది శ్రేయ. హీరో పెళ్లి మీద నమ్మకం కోల్పోవడానికి కారణం తన తల్లిదండ్రులే. ఇంతకీ రాహుల్ తల్లిదండ్రుల కథేంటి? వాళ్లెందుకు విడిపోయారు? హీరో ఎందుకు పెళ్లికి నిరాకరిస్తాడు? అసలు వీరి సహజీవనం పెళ్లి దాకా వెళ్లిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని లోతుగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించడంలో కొంత తడబడ్డాడనే చెప్పాలి. కొన్నిచోట్ల భావోద్వేగాలను మరింత పండించగలిగే అవకాశం ఉన్నా ఎందుకో దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపించింది. కథానేపథ్యం, అందుకు తగ్గట్టుగా పాత్రల్ని సృష్టించడంలో అతడి నైపుణ్యం బాగుంది. హీరో ప్యాషన్ స్టాండప్ కామెడీ అయినప్పటికీ పెద్దగా హాస్యాన్ని పండించకపోవడం గమనార్హం. మురళీ శర్మ వంటి పెద్ద నటుడిని తీసుకున్నారు కానీ ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాత్రల మధ్య సంఘర్షణని రేకెత్తించకపోవడం మరో మైనస్ అనే చెప్పుకోవాలి. ఉద్యోగం కోసం హీరో హైదరాబాద్‌కు చేరుకున్నాకే అసలు కథ మొదలువుతుంది. అతడి కుటుంబ నేపథ్యం పరిచయమయ్యాక ప్రేక్షకుడికి కథాగమనం తెలిసిపోతుంది. తర్వాత ఏం జరగబోతుందనేది ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేలా సన్నివేశాలు ఉండటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. దర్శకుడు శాంటో మోహన్ ఎమోషన్స్ మీద కూడా ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా మరో రేంజ్లో ఉండేదేమో! చదవండి: రాజ్ తరుణ్, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం: వరుణ్ తేజ్ నటీనటులు కొత్తదనాన్ని కోరుకునే రాజ్‌తరుణ్ స్టాండప్ కమెడియన్ రాహుల్ పాత్రను అవలీలగా చేసేశాడు. లుక్స్ పరంగానే కాదు, పాత్రకు తగ్గట్టుగా ఎమోషన్స్‌లో వేరియన్స్ చూపించాడు. వర్ష బొల్లమ్మ తన క్యూట్‌నెస్‌తోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంది. సీనియర్ నటులు ఇంద్రజ, మురళీశర్మల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కోసమే ఆ పాత్రలు డిజైన్ చేసినట్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. సాంకేతికంగా సినిమా మెప్పించింది. శ్రీరాజ్ రవిచంద్రన్ కెమెరాతో జిమ్మిక్కులు చేశాడు. స్వీకర్ అగస్త్య మంచి సంగీతం అందించాడు. డైరెక్టర్ శాంటోకి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవమున్నవాడిలా తెరకెక్కించాడు. కాకపోతే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టిన అతడు సంఘర్షణ, భావోద్వేగాల మీద ఫోకస్ చేయలేకపోయాడు. ప్లస్ ► రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ ► సంగీతం ► సినిమాటోగ్రఫీ మైనస్‌లు ► బలమైన ఎమోషన్స్ లేకపోవవడం ► బలహీనమైన పాత్రలు కొసమెరుపు: స్టాండప్ రాహుల్.. కూర్చున్నా, లేచినా పెద్ద తేడా లేదు! -
చిరునవ్వుతో మాయ చేస్తున్న వర్ష బొల్లమ్మ (ఫోటోలు)
-
ఆ రూల్ పెట్టుకోలేదు.. నాకు వచ్చిన పాత్రలు చేస్తున్నా
‘‘కోవిడ్ తర్వాత అందరూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నారు. థియేటర్స్‌కు వచ్చినవారు హాయిగా నవ్వుకోవాలి. మా ‘స్టాండప్ రాహుల్’ సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసి, థియేటర్ల నుంచి నవ్వుతూ బయటికొస్తారు’’ అని వర్ష బొల్లమ్మ అన్నారు. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్టాండప్ రాహుల్’లో శ్రేయ పాత్రలో నటించాను. నా పాత్ర స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. శాంటో మామూలు సమయంలో కూల్‌గా ఉన్నా, సెట్లో మాత్రం సినిమా గురించే ఆలోచించేవారు. ఈ చిత్రనిర్మాతలు దర్శకునికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఔట్పుట్ బాగా వచ్చేలా సహకరించారు. ఆయా ప్రాంతాల కల్చర్, భాష నేర్చుకోవడం నాకు ఇష్టం. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండప్ రాహుల్’ చిత్రాలకు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. గ్లామర్ పాత్రలు చేయడం లేదేంటి? అని కొందరు అడుగుతున్నారు. నాకు వచ్చిన పాత్రలు చేస్తున్నాను.. అయితే ఇలాంటి పాత్రలే చేయాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు. నా పాత్ర నిడివి ఎక్కువగా లేకపోయినా పాత్ర బలంగా ఉండాలనుకుంటాను. విజయ్ సార్ ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్)లో నా స్క్రీన్ స్పేస్ తక్కువ అయినా పాత్రకు ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘స్వాతి ముత్యం’ అనే సినిమా చేస్తున్నాను. మరో సినిమాకి కూడా సంతకం చేశాను’’ అన్నారు. -
ఆ ముగ్గురి వల్లే ఇంత బాధ అనుభవిస్తున్నాం: వర్ష ఎమోషనల్
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి లోనైంది. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్ చేసింది. 'దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా, సఫర్ అవ్వకుండా ఉంటారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది' అని వర్ష పేర్కొంది. -
మంచి మాట.. రేపటి కోసం...
‘ఆకాశవాణి... ఇప్పుడు మీరు వింటున్నది శుభ్ కల్(రేపటి కోసం)’ అని రేడియో నుంచి ఆమె గొంతు వినిపించినప్పుడు ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు తమ రేడియో దగ్గరికి వడివడిగా వస్తారు. రేడియోసౌండ్ పెంచుతారు. గ్రామీణ మహిళలకు చాలా ఇష్టమైన రేడియో కార్యక్రమం ఇది. ‘శుభ్ కల్’లో సినిమా పాటలు, కథలు, నాటికలు వినిపించవు. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలు వినిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు వినడానికి ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. ఆసక్తికరంగా చెబితే ఎలాంటి విషయాలనైనా ఆసక్తికరంగా వింటారని నిరూపించింది 27 సంవత్సరాల వర్షా రైక్వార్. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాకు చెందిన వర్ష ‘బుందెల్‌ఖండ్ 90.4 ఎం.ఎమ్’లో రేడియో జాకీ. వర్ష నాన్న రైతు. ఆయన వరుస కరువులతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకానొక దశలో ఊరు విడిచి వలస వెళదామని కూడా ఆలోచించాడు. చిన్నప్పుడు తండ్రిని అడిగేది ‘వర్షాలు ఎందుకు రావడం లేదు?’ ‘కరువు ఎందుకు వస్తుంది?’.. ఇలాంటి ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబు ఒక్కటే...‘అంతా విధినిర్ణయం తల్లీ. మనమేమీ చేయలేము. మనం మానవమాత్రులం’ అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో...కరువు కాటకాల్లో విధి పాత్ర కంటే మానవతప్పిదాల పాత్రే ఎక్కువ ఉందని గ్రహించింది. తప్పులు మూడు విధాలుగా జరుగుతాయి. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు, తెలిసీ తెలియక చేసే తప్పులు. ఈ మూడు సమూహాలను దృష్టిలో పెట్టుకొని ‘శుభ్ కల్’ కార్యక్రమానికి డిజైన్ చేసింది వర్ష. గంభీరమైన ఉపన్యాసాలు, అంత తేలిగ్గా అర్థం కాని జటిల సాంకేతిక పదజాలం కాకుండా స్థానిక భాష, యాసలతో నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది వర్ష. కొన్ని స్కిట్స్‌లో రెండు పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర పర్యావరణానికి సంబంధించి మంచిపనులు చేస్తుంటుంది. రెండో పాత్ర...ఇదంత వ్యర్థం అనుకుంటుంది. రెండు పాత్రల మధ్య స్థానిక యాసలలో జరిగే సరదా సంభాషణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. వాదనలో చివరికి రెండో పాత్ర ఓడిపోతుంది. తన తప్పును తెలుసుకొని ‘ఇలాంటి తప్పు మీరు చేయవద్దు’ అని చెబుతుంది. ఈ కార్యక్రమంతో ప్రభావితం అయిన రాజ్పూర్ గ్రామరైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. ఈ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. కేవలం రేడియో కార్యక్రమానికే పరిమితం కాకుండా ‘పల్లె పల్లెకు’ అంటూ తన బృందంతో కలిసి పల్లెలకు వెళుతుంటుంది వర్ష. ఆమె వెళ్లే పల్లెలలో వాహనాలు వెళ్లలేనివి మాత్రమే కాదు కాలినడకన వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పల్లెలు ఉన్నాయి. రేడియో జాకీగా మంచి పేరు ఉండడంతో ఏ పల్లెకు వెళ్లినా వర్షను గుర్తుపట్టి ఆదరిస్తారు. ఆ ఆదరణతోనే మహిళలతో సమావేశాలు నిర్వహించి చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు, నీటి సంరక్షణ మార్గాలు, సేంద్రియ వ్యవసాయం...ఇలా ఎన్నో విషయాలను చెబుతుంది. ఆ కార్యక్రమాలు ఎంత మంచి ఫలితం ఇచ్చాయంటే మొక్కలు నాటడాన్ని మహిళలు తప్పనిసరి కార్యక్రమం చేసుకున్నారు. నీటి వృథాను ఆరికట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. కిచెన్ గార్డెన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి ‘వి చేంజ్ నౌ’ మూమెంట్ యంగ్క్లైమెట్ లీడర్స్‌లో వర్ష ఒకరు. ‘మన భూమిని మనమే రక్షించుకోవాలి’ అంటుంది వర్ష రైక్వార్. అందరూ వినదగిన మాటే కదా! -
ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి
Megastar Chiranjeevi: ‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తాను. ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. వాటిని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్‌గా పని చేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది’’ అని అన్నారు చిరంజీవి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ కుమార్తె వర్షా విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘11:11’. ఈ చిత్రంలో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిరంజీవి మాట్లాడుతూ –‘‘80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు.. ఇలా నాకు 12 సినిమాల వరకు చేశారు రాజ్–కోటి. సుమారు 60 పాటలంటే నాకు 90 శాతం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చిన కోటిగారి ఋణం తీర్చుకోలేకపోయాననే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటిగారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లెజెండరీ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావుగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని కోటిగారు ప్రేక్షకులకు అందించారు. తన ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోటి తనయుడు రాజీవ్, రాజ్‌గారి అబ్బాయి సాగర్లకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి. ఈ సినిమా విజయం సాధించి చిత్రయూనిట్ అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి ఆశీర్వాదాలు అందడం నా కొడుకు అదృష్టం’’ అన్నారు కోటి. ‘‘ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మగారి సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ ’’ అన్నారు దర్శకుడు కిట్టు నల్లూరి. ‘‘చిరంజీవి గారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రాజీవ్ . ‘‘కష్టపడితే ఏదైనా సాధించగలం అనే దానికి చిరంజీవిగారు నిదర్శనం’’ అన్నారు వీరేశ్. ఈ కార్యక్రమంలో వర్షా విశ్వనాథ్, నటుడు రోహిత్, నటుడు సదన్, సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ పాల్గొన్నారు. -
స్టాండప్ కమెడియన్‌గా వర్ష బొల్లమ్మ
శ్రేయా రావు స్టాండప్ కమెడియన్. వీక్షకులను నవ్వించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు రాహుల్. అతను కూడా స్టాండప్ కమెడియనే. ఈ ఇద్దరి కథ ఏంటి? అనేది ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో తెలుస్తుంది. రాహుల్‌గా రాజ్ తరుణ్, శ్రేయా రావు పాత్రను వర్ష బొల్లమ్మ చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ లుక్ విడుదలైంది. తాజాగా వర్ష లుక్‌ని విడుదల చేశారు. సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తి, కెమెరా: శ్రీరాజ్ రవీంద్రన్. చదవండి: Raj Tarun: రాహుల్.. కూర్చుంది చాలు! -
తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష: పెళ్లికి రెడీ అయిందా?
టీవీ యాంకర్ వర్ష... తన అందచందాలతో షోలో సందడి చేసే ఆమె అడపాదడపా సీరియళ్లలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే! యాంకరింగ్, నటన రెండింటిలోనూ రాణిస్తున్న ఈ భామ ఫొటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందహో.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చాటింపు వేసి మరీ చెప్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. కానీ వర్ష మెడలో మూడు ముళ్లు పడితే ఇమ్మాన్యుయేల్ ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే వర్ష పెళ్లి చేసుకోబోతుందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే! చదవండి: విజయ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ -
వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ
ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భాషతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వర్షా విశ్వనాథ్. ఆమె ఎవరో కాదు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు. వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు వర్ష. కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్ పూర్తి చేసిన వర్షా విశ్వనాథ్ తమిళంలో మూడు చిత్రాల్లో నటించారు. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఇప్పుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. రమణ్ కథానాయకుడిగా శిరీషారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వర్ష పక్కింటి అమ్మాయిగా కనిపించనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు వర్ష. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి వర్షా విశ్వనాథ్ అంగీకరించారు. ఇవి కాకుండా తమిళంలోనూ సినిమాల్లో నటించారు వర్షా విశ్వనాథ్. చదవండి: యాంకర్ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో కూడా.. -
గుడ్‌న్యూస్ చెప్పిన వర్ష, ఆ వెంటనే గిఫ్ట్‌తో పార్టీకి!
నటి, యాంకర్ వర్ష కరోనాను జయించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్ష ఈజ్ బ్యాక్ అంటూ సంతోషంగా కామెంట్లు చేస్తున్నారు. అలా కోవిడ్ నుంచి బయటపడిందో లేదో అప్పుడే సందడి మొదలు పెట్టేసింది వర్ష. తన సోదరి కుసుమ పుట్టినరోజు పురస్కరించుకుని ఓ స్పెషల్ గిఫ్ట్‌ను తీసుకెళ్లి ఆమెను సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు పలు ఫొటోలను, చిన్నపాటి వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కానీ బర్త్‌డే ఫంక్షన్లో తన సోదరితో దిగిన ఫొటోలను మాత్రం చూపించలేదు. ఏం గిఫ్ట్ ఇచ్చిందనేది కూడా సస్పెన్స్‌గా ఉంచింది. ఏదేమైనా పది రోజుల్లోనే ఆ మహమ్మారి బారి నుంచి వర్ష బయటపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తను షూటింగ్స్‌లో పాల్గొనుండటంతో బుల్లితెర మీద ఆమె సందడి చూసేందుకు ఎదురు చూస్తున్నామంటున్నారు. చదవండి: ఆరోగ్యం బాగోలేదు, కరోనా సోకింది: జబర్దస్త్ వర్ష -
ఘోరంగా ఉంది.. నాకు కరోనా పాజిటివ్: జబర్దస్త్ వర్ష
కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ తనకు సమానమేనంటూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు దీని బారిన పడగా ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ వర్ష సైతం కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. "సడన్‌గా ఇలా లైవ్‌లోకి వచ్చానేంటని అనుకుంటున్నారా? పరిస్థితులు అలా లైవ్‌లోకి వచ్చేలా చేశాయి. రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని నేను లైవ్‌లో ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ జరిగేది ఏదీ బయటకు తెలీదు. చనిపోయినవాళ్లను ప్యాక్ చేసి విసిరేస్తున్నారు. అది చూడగానే లైవ్‌కి వచ్చి చెప్పాలనుకున్నా.. దయచేసి అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వేడినీళ్లు తీసుకోండి. అన్నిరకాల ముందు జాగ్రత్తలు పాటించండి" అని వర్ష కోరింది. కాగా, సీరియళ్లతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన వర్ష.. బుల్లితెర షోలతో బిజీబిజీగా మారిపోయింది. అందచందాలతో, తన మాటలతో కవ్వించే ఈ బ్యూటీకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆమెకు కరోనా సోకడంతో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఎలా ఉన్నాడంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆన్‌స్క్రీన్ మీద ఈ జంట బాగా పాపులర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వర్ష అతడితో కలిసి స్కిట్లు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్ యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు అభిమానులు. చదవండి: సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? పవన్ కల్యాణ్‌కు సోకిన కరోనా! -
మరోసారి రెచ్చిపోయిన హైపర్ ఆది.. వ్యాఖ్యలు దుమారం
హైపర్ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తనదైన కామెడీ టైమింగ్, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. అయితే ఒక్కోసారి శృతి మించే పంచ్‌లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. తాజాగా హైపర్ ఆది మరోసారి తన డబుల్ మీనింగ్ డైలాగులతో యాంకర్‌పై రెచ్చిపోయాడు. ఓ షోలో పాల్గొన్న హైపర్ ఆది..యాంకర్ వర్షపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ అవుతున్నాయి. హైపర్ ఆది-వర్షకు మధ్య జరిగిన ఓ డిస్కషన్లో ఎలా ఉన్నావు అని ఆది అడగ్గా...బావున్నానండీ. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి అని వర్ష చెప్పింది. దీనికి కౌంటర్‌గా... 'అదే పనిగా నీకు వచ్చే కామెంట్లు చూసుకుపోయావా..షోలో కొత్తగా వచ్చిన లేడీ గెటప్ ఎవరు అని చాలామంది అడుగుతున్నారు' అంటూ వర్షపై బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆమె జెండర్‌పై ఆది చేసిన ఈ వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. లేడీ యాంకర్ల పరువు తీసేలా ఆది బిహేవ్ చేస్తున్నాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి : ప్రేమలో ఉన్నా.. సురేఖ వాణి షాకింగ్ పోస్ట్ జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్లీ లంబోర్గిని కారు! -
మెలొడీ మేళా
-
నేను తెలుగమ్మాయిని కాదు: హీరోయిన్
‘‘ఎంత వాణిజ్య అంశాలున్న సినిమా అయినా కథే ముఖ్యం. ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ చిత్రంలో కథే హీరో. కథకి ప్రాధాన్యత ఇస్తే సినిమా బాగుంటుంది. ఇందులో కథకి అనుగుణంగా కామెడీ ఉంటుంది’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తన గురించిన ఎన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘నా స్వస్థలం కర్నాటకలోని కొడుగు. అయితే నా పేరు వర్ష బొలమ్మ కావడంతో తెలుగు అమ్మాయేనేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేను తెలుగమ్మాయిని కాదు. కానీ తెలుగు మాట్లాడగలను. నాకు వంట రాదు. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మా అన్న కోసం ఏదో వండి పెట్టాను.. అది తిన్న తర్వాత తనకి రెండు రోజులు ఆరోగ్యం బాగాలేదు. దీంతో అప్పటి నుంచి కిచెన్‌లోకి వెళ్లడమే మానేశా’’ అంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.(చదవండి: నా సినిమాల్లో అన్నయ్య ప్రమేయం ఉండదు) ఇది రెండో సినిమా తెలుగులో ‘చూసీ చూడంగానే’ నా మొదటి సినిమా. ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ నా రెండో చిత్రం. ఇందులో నా పాత్ర పేరు సంధ్య.. నేనే డబ్బింగ్ చెప్పాను. సంధ్య సింపుల్ గర్ల్. గుంటూరులో పుట్టి పెరిగి చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసే పాత్ర. నాన్నకు ఎదురు చెప్పదు. సంధ్య పాత్రలో నటనకు బాగా అవకాశం ఉంది. వినోద్‌గారు కథ చెప్పినప్పుడు నిజాయతీ ఉన్న వ్యక్తి అని తెలిసింది.. అందుకే ఆయన్ని నమ్మాను. తెలుగులో రాజ్ తరుణ్‌తో ‘స్టాండప్ రాహుల్’ అనే ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా’’అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చారు. కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు తెరకెక్కించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. వర్ష బొలమ్మ కథానాయికగా నటించిన సినిమా ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.(చదవండి: ఆ సినిమా హక్కులన్నీ ‘జీ’కే సొంతం!) Building his dream castle!#KeeluGurram, song out now. ▶️ https://t.co/Kc34cWZNGK Watch #MiddleClassMelodiesOnPrime premieres on Nov 20@ananddeverkonda @vinodanantoju #DivyaSripada @SweekarAgasthi @TharunBhasckerD @rhvikram @BhavyaCreations #AnandaPrasad pic.twitter.com/D0UrQyimKE — Varsha Bollamma (@VarshaBollamma) November 16, 2020 -
ప్రియురాలితో నటుడి వివాహం
సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు వినాయక్ జోషి ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు వర్షా బెలవాడితో ఆర్య సమాజం ఆచారాల ప్రకారం పరస్పరం ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక శుక్రవారం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలన పాటిస్తూ నిరాడంబరంగా వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లి కార్యక్రమాన్ని బంధువులు, స్నేహితులు, అభిమానుల కోసం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వినాయక్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు వినాయక్, వర్షాలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షా బెలవాడి జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వర్షా బాడ్మింటన్ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వినాయక్, వర్షా చిన్ననాటి స్నేహితులు. ఏడేళ్ల వయసులో వీరిద్దరు ఒకే చోట డాన్స్ నేర్చుకున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మళ్లీ కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఇక సినిమాలో విషయానికి వస్తే.. హీరో వినాయక్ 70 సినిమాల్లో నటించారు. అమృతా వర్షిని, లాలి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. అదే విధంగా బిగ్ బాస్ కన్నడ సీజన్3లో వినాయక్ పాల్గొని సందడి చేశారు. -
‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ
చిత్రం : చూసీ చూడంగానే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్, పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా, వెంకటేశ్ కాకుమాను సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శేష సింధు రావు నిర్మాత : రాజ్ కందుకూరి బ్యానర్ : ధర్మపథ క్రియేషన్స్ పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి హిట్ చిత్రాలు అందించిన నిర్మాత రాజ్ కందుకూరి. తన సినిమాల్లో చాలా వరకు కొత్త నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అవకాశం కల్పించే రాజ్.. తన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘చూసీ చూడంగానే’. అలాగే ఈ చిత్రంతో శేష సింధు రావును దర్శకురాలిగా పరిచయం చేశారు. తమిళ చిత్రం 96లో ప్రభ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వర్ష బొల్లమ్మ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమాలకు విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించే రాజ్.. ఇది తన కుమారుడి తొలి సినిమా కావడంతో చిత్ర ప్రమోషన్స్‌ను భారీగానే చేశాడు. అలాగే సురేష్ ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సాంగ్స్, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టునేలా చేశారు. మరి తన కుమారుడిని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడంలో రాజ్ కందుకూరి సక్సెస్ అయ్యాడో లేదో రివ్యూలో చూద్దాం. కథ : సిద్దు (శివ కందుకూరి) తల్లిదండ్రుల బలవంతం మేరకు ఇంజనీరింగ్‌లో అడుగుపెడతాడు. అక్కడ ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఈయర్ వచ్చేసరికి ఐశ్వర్య సిద్దును వదిలి వెళ్లిపోతుంది. అయితే ఆ డ్రిపెషన్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయని సిద్దు.. ఫ్యాషన్ పొటోగ్రాఫర్ అవుదామనుకుంటాడు. కానీ మూడేళ్ల తర్వాత వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్ అవుతాడు. అలా ఓ పెళ్లిలో శృతిని (వర్ష) చూసి లవ్‌లో పడతాడు. శృతికి, సిద్దు వారి కామన్ ఫ్రెండ్ యోగి ద్వారా కలుస్తారు. వారిద్దరరు ఫ్రెండ్స్ అవుతుండగా.. స్టోరిలో చిన్నపాటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. సిద్దును శృతి ఇంజనీరింగ్‌లో లవ్ చేసిందని.. ఇప్పటికి అతన్నే ఇష్టపడుతుందని తెలుస్తుంది. అయితే సిద్దు తన ప్రేమ విషయాన్ని చెప్పేలోగానే.. శృతి బాయ్‌ఫ్రెండ్ విరాట్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అందుకు శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా? లేక విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమా అయినప్పటికీ శివ కందుకూరి తన నటనతో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ వర్ష.. శృతి పాత్రకు సరిగా సరిపోయింది. కళ్లతో మంచి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ.. సినిమాకు మంచి ఆకర్షణగా నిలిచింది. మరో హీరోయిన్ ఐశ్వర్య తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. శివ తల్లిదండ్రుల పాత్రలో నటించిన పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా తమ పాత్రల మేరకు నటించారు. శృతి తండ్రి పాత్రలో కనిపించిన గురురాజ్ మానేపల్లి పాత్రకు అంత ప్రాధాన్యత లభించలేదు. శివ ఫ్రెండ్ యోగి పాత్రలో నటించిన వెంకటేశ్ కాకుమాను తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. విశ్లేషణ : ప్రేమ కథలు ఎప్పడైనా స్ర్కీన్‌పై ఎంత బాగా ప్రజెంట్ చేశామనేదే ముఖ్యం. అయితే ఈ కథలో కొద్దిగా కొత్తదనం ఉన్నప్పటికీ.. నూతన దర్శకురాలు శేష సింధు దానిని తెరపై అందంగా చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఫస్టాప్ మొత్తం సాగదీతగా అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథతో పాటు వచ్చే కామెడీ మెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకునేలా అనిపించదు. మరోవైపు గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సాంగ్స్‌లో గోపి తన మార్కు చాటుకున్నాడు. నిర్మాత రాజ్ కుందుకూరి నిర్మాణ విలువలు సినిమాకు భారీ లుక్‌ను తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరోగా తన కుమారుడిని ప్రొజెక్టు చేయడంలో రాజ్ కుందుకూరి కొద్దివరకు సఫలం అయ్యాడనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ : హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటన గోపి సుందర్ మ్యూజిక్ సెకాండఫ్‌లో కొన్ని సీన్లు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు తెరపై కథను బాగా ప్రజెంట్ చేయకపోవడం -సుమంత్ కనుకుల, సాక్షి వెబ్‌డెస్క్ -
సహజత్వానికి దగ్గరగా చూసీ చూడంగానే
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన తొలి చిత్రం ‘చూసీ చూడంగానే’. వర్ష, మాళవిక కథానాయికలుగా నటించారు. శేష సింధు రావు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ప్రతిభావంతులైన యువకులతో సినిమాలు చేయడానికే నేను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఈ సినిమా కథకు మా అబ్బాయి శివ హీరో అయితే బాగుంటుందని దర్శకురాలు శేష చెప్పడంతో శివను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘నాపై నమ్మకం ఉంచి నన్ను హీరోను చేసిన మా నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. కథ బాగా నచ్చింది. నా కోసం మంచి స్క్రిప్ట్ రాసిన శేషగారికి థ్యాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా సినిమాను విడుదల చేస్తోన్న నిర్మాత డి.సురేష్‌బాబుగారికి థ్యాంక్స్’’ అన్నారు శివ. ‘‘శివ బాగా నటించడానికి ఆస్కారం ఉన్న పాత్ర ఇది. హీరోయిన్ వర్ష బాగా నటించింది. షూటింగ్ పూర్తయ్యేలోపు వర్ష తెలుగు నేర్చుకుంది. మంచి డైలాగ్స్ రాసిన పద్మతో పాటు సహకరించిన నటీనటులు, చిత్రబందానికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు శేష. ‘‘చిన్న సినిమాలను రాజ్ కందుకూరిగారు ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ సాధించాలి. హీరోగా పరిచయం అవుతున్న శివకు ఇది సరైన సబ్జెక్ట్’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఇది నా తొలి తెలుగు సినిమా. శివ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వర్ష. ‘‘ఈ మూవీ నా కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు మాళవిక. -
పరీక్షల్లో ఫెయిల్..నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
-
నలుగురు విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు వెరసి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే సిటీలో ఈ విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ♦ వనస్థలిపురం సుభద్రానగర్‌కు చెందిన ఎ.ఉదయ మాణిక్య వరప్రకాశ్ కుమార్తె వందన దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫలితాల్లో 440కి 325 మార్కులే వచ్చాయని మనస్తాపానికి గురైన వందన బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ♦ కూకట్పల్లి పరిధి ఖైత్లాపూర్‌లో ఉండే కాట్రాజ్ శేఖర్ కుమారుడు సాయికుమార్ (17) ఎంఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇతడు ఫెయిలయ్యాడు. మనోవేదనకు గురైన సాయికుమార్‌ను తల్లిదండ్రులు ఓదార్చి మళ్లీ రాసి పాస్ కావచ్చని చెప్పి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సాయికుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ పిర్జాదిగూడ మల్లికార్జున్ నగర్లో నివసించే దూలం మధు కుమార్తె వర్ష (16) ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రాసి, అన్ని సబ్జెక్ట్లూ తప్పింది. దీంతో మనస్తాపం చెందిన వర్ష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ♦ గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన మువ్వ రామకృష్ణ కుమార్తె శ్రీవిద్య (18) చింతల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఆమె నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైన విషయం తెలిసి, వారు నివాసముండే అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. అక్కడికక్కడే మృతి చెందింది. -
వర్ష ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్!
అనంతపురం న్యూసిటీ:నిబంధనలకు విరుద్ధంగా రక్తమార్పిడి చేయడం..ఇతర కారణాలతో గత నెల 21న సీజ్ చేసిన వర్ష ఆస్పత్రిని తిరిగి నిర్వహించుకునేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి రెండు రోజుల క్రితమే నిర్వాహకులు ఆస్పత్రిని తెరిచినా అధికారులు పట్టించుకోలేదు. విమర్శలు రావడంతో సోమవారం రాత్రి డీఎంహెచ్ఓ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ సిరప్ప , డాక్టర్ కొండయ్య, రవీంద్రనాథ్‌రెడ్డి ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఆరుపడకలకు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ధరల పట్టికతో పాటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను కన్పించేలా ఉంచాలన్నారు. రష్యాలో ఎండీ చేసినా ఇక్కడ ఎంబీబీఎస్గానే పరిగణిస్తారని, ఆ మేరకు ప్రిస్క్రిప్షన్, ఆస్పత్రి బోర్డులో హోదా మార్పు చేసుకోవాలన్నారు. ఆపరేషన్ థియేటర్ సర్జరీలు చేయరాదన్నారు. నిబంధనలకు లోబడి ఈ నెల 21 నుంచి ఆస్పత్రిని నిర్వహించుకోవచ్చన్నారు. కాగా సీజ్ చేసిన అధికారులే తిరిగి అనుమతులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'వర్షిం'చిన ముడుపులు !
అనంతపురం న్యూసిటీ: నగరంలోని వర్ష ఆస్పత్రి తిరిగి తెరుచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 21న నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి, వివిధ కారణాలను చూపుతూ డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్ పంచనామా చేసి ఆస్పత్రిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైద్యాధికారులే తిరిగి ఆస్పత్రి తెరిచేందుకు అనుమతులివ్వడం విమర్శలకు దారితీస్తోంది. దీని వెనుక భారీగా ముడుపుల బాగోతం నడిచాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. రాత్రికి రాత్రే కమిటీలు వర్ష ఆస్పత్రి సీజ్ జిల్లాలోనే ఇది పెద్ద సంచలనమైంది.డీఎంహెచ్ఓ తీసుకున్న నిర్ణయంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆస్పత్రి నిర్వహణలో చాలా లోపాలున్నాయి, ఎటువంటి సురక్షిత ప్రమాణాలు లేవని డీఎంహెచ్ఓ తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ఆస్పత్రి నిర్వాహకురాలు డాక్టర్ సుప్రజాచౌదరి, ఇద్దరు వ్యక్తులు డీఎంహెచ్ఓ కార్యాలయంలోని డెమో ముందు కూర్చుని వివరణ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఈ నెల 13న డీఎంహెచ్ఓ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు ఐదు మంది సభ్యులతో వెళ్లారు. ఈ విషయాలను బయటకు పొక్కనీయకుండా డీఎంహెచ్ఓ, డెమో జాగ్రత్త పడ్డారు. వాస్తవంగా ఈ నెల 11న కమిటీ వేశామని వైద్య ఆరోగ్యశాఖాధికారి చెబుతున్నా.. కమిటీ లిస్టులో మాత్రం తేదీని ఈ నెల 7 అని పెన్‌తో రాశారు. దీన్ని బట్టి పక్కా ప్లాన్‌తోనే వర్ష ఆస్పత్రిని ఓపెన్ చేసేందుకునే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. నిర్వాహకులకే తాళాలు ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు వారి సమక్షంలోనే తిరిగి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఓపెన్ చేసుకునేందుకు నిర్వాహకుల చేతికే తాళాలివ్వడం పలు విమర్శలు తావిస్తోంది. ఇదే విషయాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్‌ను సాక్షి ఆరా తీస్తే డెమో వెళ్లారని సమాధానం ఇచ్చారు. డెమో ఉమాపతిని ఆరా తీస్తే ఆర్డర్ ఇచ్చాం వారే ఓపెన్ చేసుకోవాలని చెప్పామన్నారు. ప్రాక్టీస్‌కు అనుమతివ్వలేదు వర్ష ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇంకా అనుమతివ్వలేదు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేశాం. వారి నుంచి రిపోర్టు వచ్చాకే ప్రాక్టీస్‌కు అనుమతిస్తాం. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్,డీఎంహెచ్ఓ -
వర్ష ఆస్పత్రి సీజ్
అనంతపురం న్యూసిటీ: నిబంధనలకు విరుద్ధంగా రక్తమా ర్పిడికి పాల్పడడంతో పాటు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న వర్ష ఆస్పత్రిని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సోమవారం సీజ్ చేశారు. నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి (బ్లడ్ ట్రాన్స్మిషన్) చేస్తున్నట్లు సమాచారంతో డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు ఆదివారం తనిఖీ చేసిన విషయం విదితమే. ఆస్పత్రిలో రక్తమార్పిడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ నిర్వహణ, శానిటేషన్ వైఫల్యం, ధరల పట్టిక పొందుపర్చకపోవడం, కేస్‌షీట్‌లో వైద్యుల సంతకాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్‌లో పలు లోపాలు అధికారుల తనిఖీలో వెలుగుచూశాయి. ఈ కారణాల రీత్యా ఆస్పత్రిని మూసివేశారు. నగర చరిత్రలో ఆస్పత్రిని సీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. బ్లడ్ బ్యాగ్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయోనని డ్రగ్ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. సదరు ఆస్పత్రి నిర్వాహకులపై డ్రగ్ అధికారులు కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెల్సింది. వేకువజాము వరకు విచారణ వర్ష ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సుప్రజ చౌదరి, ఆమె భర్త డాక్టర్ హర్షవర్ధన్ (అపెక్స్ రేడియాలజిస్టు)లను ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు విచారణ చేశారు. ఆస్పత్రిలో చిల్లవారిపల్లికు చెందిన రాములమ్మ, బుక్కపట్నం చెన్నరాయుడుపల్లికి చెందిన అనితలకు ఎందుకు రక్తమార్పిడి చేశారని, ప్రభుత్వ మార్గదర్శకాలు మీకు తెలియవా అని ప్రశ్నించారు. డ్రగ్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఆస్పత్రి సీజ్ చేయడమే కాక కెరియర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. బ్లడ్ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిందేనని అధికారులు గట్టిగా నిలదీశారు. ఓ ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా బ్యాగులు తీసుకున్నట్లు వారు అంగీకరించారు. సర్వజనాస్పత్రికి రోగుల తరలింపు.. వర్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను డీఎంహెచ్ఓ 108 అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీఎంహెచ్ఓ వెంట డెమో ఉమాపతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూపర్వైజర్ రమణ, సిబ్బంది గంగాధర్ తదితరులున్నారు. -
వైవిధ్యభరితంగా 143
తమిళసినిమా: ఈ తరం యువతకు 143 అంటే తెలియకుండా ఉండదు. ఐలవ్యూకు ప్రేమికుల సంకేతం 143. దీన్ని ఈ తరం దర్శకులు చిత్ర టైటిల్‌గా వాడుకోవచ్చని భావించకపోవడం విశేషమే. ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఒక చిత్రం తయారవుతోంది. నవ నటుడు రిషీ కథానాయకుడిగా పరిచయం అవుతూ స్వీయ దర్శకత్వంలో రూపొం దిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా ప్రియాంక వర్ష, నక్షత్ర నటిస్తున్నారు. ఐ టాకీస్ పతాకంపై సతీష్ చంద్ర పాలట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌భాస్కర్ సంగీతాన్ని, రాజేశ్.జేకే ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శక హీరో తెలుపుతూ వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా 143 ఉంటుందన్నారు. అమావాస్య రోజున పుట్టిన అబ్బాయి, పౌర్ణమి రోజున పుట్టిన అమ్మాయి ప్రేమించుకుంటారన్నారు. వీరి ప్రేమకు ఒక విలన్ ఉంటాడన్నారు. మరి విరుద్ధమైన రోజుల్లో పుట్టిన ఈ ప్రేమ జంట ఒకటవుతారా? లేదా?అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథా చిత్రమే 143 అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శక కథానాయకుడు రిషీ తెలిపారు. -
పెళ్లి వేడుకలో ప్రభాస్
-
కారు, లారీ ఢీ: ఇద్దరి మృతి
కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో జాతీయరహదారిపై ఈ ఘటన జరిగింది. వైఎస్సార్ జిల్లా కడప నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. నంద్యాల వైపు వస్తున్న లారీ ఎదురుగా ఢీకొనటంతో కారులో ఉన్న ఇద్దరు చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన నరేంద్రారెడ్డి, వర్షగా గుర్తించారు. -
భర్తను చంపి బాత్ రూంలో పాతేసి జైలుపాలు
మీరట్: సినిమా పక్కీలో కట్టుకున్న భర్తను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూంలోనే పాతి పెట్టిన ఓ భార్యకు కోర్టు జీవిత కారాగార శిక్షను విధించింది. దీంతోపాటు రూ.25 వేల జరిమాన కూడా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం మీరట్‌లోని గంగా నగర్‌కు చెందిన రాజేంద్రపటేల్, వర్షా అనే ఇద్దరు భార్య భర్తలు. రాజేంద్ర పటేల్ ఆర్మీ జవానుగా పనిచేస్తుండగా ఆమె ఇంట్లోనే ఉంటుంది. 2012 మార్చి 24న రాజేంద్ర పటేల్‌కు వర్ష నిద్ర మాత్రలు వేసి అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసింది. అనంతరం అతడిని ఈడ్చుకెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బాత్రూంలో పాతిపెట్టి పైన బండలు వేసి ప్లాసింగ్ కూడా చేయించింది. ఆ తర్వాత ఇల్లును మంజు అనే మరో మహిళకు అమ్మేసింది. దీంతో వారు మార్చి 27న గృహ ప్రవేశం చేయగా వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు తెలిసింది. అక్కడ తవ్వకాలు జరపడంతో రాజేంద్ర కుమార్ మృతదేహం బయటపడింది. దీంతో అదే రోజు వర్షాను పోలీసులు అరెస్టు చేశారు. చివరికి మంగళవారం జిల్లా కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.