స్టాండప్‌ కమెడియన్‌గా వర్ష బొల్లమ్మ | Stand Up Rahul: Varsha Bollamma As Shreya Rao First Look Released | Sakshi
Sakshi News home page

Stand Up Rahul: శ్రేయా రావుగా వర్ష బొల్లమ్మ!

Published Thu, Jun 24 2021 7:26 AM | Last Updated on Thu, Jun 24 2021 7:26 AM

Stand Up Rahul: Varsha Bollamma As Shreya Rao First Look Released - Sakshi

శ్రేయా రావు స్టాండప్‌ కమెడియన్‌. వీక్షకులను నవ్వించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు రాహుల్‌. అతను కూడా స్టాండప్‌ కమెడియనే. ఈ ఇద్దరి కథ ఏంటి? అనేది ‘స్టాండప్‌ రాహుల్‌’ సినిమాలో తెలుస్తుంది. రాహుల్‌గా రాజ్‌ తరుణ్, శ్రేయా రావు పాత్రను వర్ష బొల్లమ్మ చేస్తున్నారు. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌ లుక్‌ విడుదలైంది.

తాజాగా వర్ష లుక్‌ని విడుదల చేశారు. సాంటో మోహన్‌ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నంద్‌కుమార్‌ అబ్బినేని, భరత్‌ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్‌ అగస్తి, కెమెరా: శ్రీరాజ్‌ రవీంద్రన్‌. 

చదవండి: Raj Tarun: రాహుల్‌.. కూర్చుంది చాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement