
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి లోనైంది. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్ చేసింది.
'దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా, సఫర్ అవ్వకుండా ఉంటారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది' అని వర్ష పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment