tv anchor
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
ఇష్టపడితే దూరం పెట్టాడని...
ఉప్పల్ (హైదరాబాద్): ఓ యువతి టీవీ యాంకర్‌ను ఇష్టపడింది. అయితే అతను నో చెప్పడంతో కిడ్నాప్‌నకు పథకరచన వేసింది. అది కాస్త ఫెయిల్ కావడంతో కటకటాలపాలైంది. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్ అరుణోదయకాలనీకి చెందిన బోగిరెడ్డి త్రిష్ణ ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థకు సీఈఓ. భారత్ మ్యాట్రిమోని పేరుతో ఇన్‌స్ర్ట్రాగాంలో చైతన్యరెడ్డి త్రిష్ణకు పరిచయమయ్యాడు. అయితే చైతన్యరెడ్డి ఉప్పల్‌కు చెందిన టీవియాంకర్ ప్రణవ్సిస్టా ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌కు వాడుకున్నాడు. ప్రణవ్ ఫొటో చూసి త్రిష్ణ ఇష్టం పెంచుకుంది. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతూ దగ్గరైంది. దీనిని అదనుగా భావించిన చైతన్యరెడ్డి తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని త్రిష్ణను కోరాడు. దీంతో ఆమె పెద్ద మొత్తంలో ఫోన్‌పే ద్వారా పంపింది. తిరిగి డబ్బు చెల్లించమని అడగ్గా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన త్రిష్ణ కూపీ లాగగా, చైతన్యరెడ్డి ఫేక్ ఐడీ ద్వారా ప్రణవ్ సిస్టా ఫొటో వాడుకొని మోసం చేసినట్టు నిర్థారణకు వచి్చంది. వెంటనే ప్రణవ్ను మెసేజ్‌ల ద్వారా అలర్ట్ చేసింది. దీంతో ఆయన సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. తర్వాత మెసేజ్‌ల ద్వారా పరిచయం పెంచుకొని ప్రణవ్ను మరింతగా ఇష్టపడింది. ఎలాగైనా అతడిని వశం చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన కార్యాలయంలో పనిచేసే నలుగురి ద్వారా ప్రణవ్ వివరాలు తెలుసుకుంది. ఉప్పల్‌లో పార్కు చేసిన ప్రణవ్ కారుకు వారు జీపీఎస్(యాపిల్ ఎయిర్ ట్యాగ్) బిగించారు. దీని ద్వారా ప్రణవ్ కదలికలను గుర్తిస్తూ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. అయినా ప్రణవ్ దారికి రాలేదు. దీంతో కిడ్నాప్‌నకు ప్లాన్ వేసింది. రూ.50,000 సుపారీ ఇచ్చింది. దీంతో కిడ్నాపర్లు రంగంలోకి దిగి ఈ నెల 11న అర్ధరాత్రి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక రోడ్డులో ప్రణవ్ను అడ్డగించారు. తమ కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి చితకబాదుతూ త్రిష్ణ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి నుంచి ఎలాగో అలా తప్పించుకొని వచ్చిన ప్రణవ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసులో ప్రధాన నిందితురాలైన త్రిష్ణను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించినట్టు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలి సెల్‌ఫోన్, కారుకు వాడిన జీపీఎస్ ట్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. -
'ఏ యాసతో అవమానాలు పడ్డదో.. ఇప్పుడదే ఆమెను స్టార్‌ను చేసింది'
ఏ యాస మాట్లాడి అవమానపడ్డదో.. ఆ యాసతోనే పాపులర్ అయిన నటి.. జోర్దార్ సుజాత. కయ్యకయ్య అరుస్తూనే కమ్మని పదాలతో.. శనార్తులంటూ వరుస బుల్లితెర అవకాశాలతో పాటు, వెబ్ ప్రపంచంలోకీ అడుగుపెట్టిన ఆమె గురించి కొన్ని వివరాలు..! సుజాత అసలు పేరు శ్రుతి. స్వగ్రామం వరంగల్ జిల్లా.. ఉప్పర్ పల్లి. అమ్మ అంగన్వాడీ టీచర్. నాన్న ప్రైవేట్ టూరిస్ట్ బస్ డ్రైవర్. ముగ్గురు అక్కాచెల్లెళ్లలోకి తనే చిన్నది. ఇద్దరు అక్కలకు ఇంటరైపోయిన వెంటనే పెళ్లి చేశారు. తన వంతు వచ్చేసరికి పోలీసు ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులను ఒప్పించి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగంతోనే ఇంటికి తిరిగి వస్తానని హైదరాబాద్ వచ్చింది. మొదట ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్‌లో చేరింది. అయితే తన యాస, తీరు వల్ల అక్కడ ఇమడలేకపోయింది. (ఇది చదవండి: నాపై 8 నెలలు విషప్రయోగం చేశారు: జేడీ చక్రవర్తి ఎమోషనల్) ఆ తర్వాత టీవీ చానళ్లలో తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసి.. అక్కడ ప్రయత్నించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ ‘జోర్దార్ సుజాత’గా మారి మంచి గుర్తింపు పొందింది. అదే.. ఆమెకు బుల్లితెర అవకాశాలనూ తెచ్చిపెట్టింది. ఇక బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడిప్పుడే సినిమాలకు కూడా అడుగుతుండ్రు. సిస్టర్ రోల్స్, ఫ్రెండ్ రోల్స్ చాలానే వస్తున్నయి. ఇంకేదీ ఫైనల్ చేయలేదు. మనమేదైనా చేస్తే టర్నింగ్ పాయింట్ లెక్క ఉండాలేగనీ, ఏదో చేస్నున్నవా అంటే చేస్తున్న అన్నట్లు ఉండొద్దు కదా? – సుజాత పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. తర్వాత తన పేరు మీదనే సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి మరింత పాపులర్ అయింది. ఈ మధ్యనే జబర్దస్త్ కమేడియన్ రాకింగ్ రాకేశ్‌ను ప్రేమ వివాహం చేసుకొని, జీవితంలో మరో అడుగు ముందుకు వేసింది. ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్‌తో వెబ్ దునియాలోనూ తన జోరు సాగిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్‌లో.. తెలంగాణ యాసలో సుజాత అందంగా తిట్టిన తిట్లు.. సోషల్ మీడియాలో రీల్స్‌గా మారి తెగ వైరల్ అవుతున్నాయి. (ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి) -
క్రికెటర్‌తో ప్రేమలో యాంకర్ వర్షిణి? బహుత్ 'సుందర్' హై!
బుల్లితెర యాంకర్ వర్షిణి ఈ మధ్య వార్తల్లో బాగా హైలైట్ అవుతోంది. కారణం తను ఉప్పల్ స్టేడియంకు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇదివరకే ఆమెను ఓ ఆటాడేసుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే ఆమె అలా పదేపదే మ్యాచ్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణం ఉందట. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసమే తను పదేపదే స్టేడియంకు వెళ్లిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఛాన్స్ దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై అటు సుందర్, ఇటు వర్షిణి ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. అయితే వర్షిణిని మాత్రం మళ్లీ చెడుగుడు ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా క్రికెటర్ గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణి గ్లామర్ ఫోటోలు షేర్ చేయగా దాని కింద అందరూ వాషింగ్టన్ సుందర్ గురించే ఆరా తీస్తున్నారు. 'ఏంటి, సుందర్‌తో డేటింగ్ అంటగా..', 'బహుత్ సుందర్ హై', 'నీ డ్రెస్ చాలా బాగా వాషింగ్ చేసుకున్నావ్.. బహుత్ సుందర్ హై' అంటూ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. కొందరైతే ఏకంగా క్రికెటర్‌ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. బుల్లితెరపై ఎంత అందాలు ఆరబోసినా రాని గుర్తింపు క్రికెటర్ భార్య అయితే వస్తుందని సలహా ఇస్తున్నారు. క్రికెటర్లను పెళ్లి చేసుకున్న సినీతారల జాబితాలో చేరిపోమని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) చదవండి: గ్రాండ్‌గా ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ఇంట పెళ్లి -
ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్
సీరియల్స్‌తో నటిగా కెరీర్ ఆరంభించిన సౌమ్య రావు జబర్దస్త్‌తో యాంకర్‌గా మారింది. షోలో నవ్వుతూ, చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచులు విసిరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్మెంట్.. మందులు.. ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ భగవంతుడు నాకెందుకిలా చేశాడని బాధేస్తోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధే గుర్తొస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. రేయిపగలు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మా.. లవ్ యూ సోమచ్' అని రాసుకొచ్చింది. చదవండి: పొద్దున ఆరు గంటలకే చికెన్ తిన్న ఎన్టీఆర్.. నాక్కూడా : రామ్ చరణ్ -
రూ.20 లక్షలు గెలిచా.. ఒక్క పూటలో ఖతం చేశా: యాంకర్
ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్తే ఎంత అవుతుంది? వందల్లో, లేదంటే వేలల్లో! కానీ ఓ యాంకర్ మాత్రం జస్ట్ డిన్నర్‌కే రూ.20 లక్షలు ఖర్చు పెట్టిందట! హిందీ బుల్లితెర యాంకర్ మిని మాథుర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. 'ఓ క్విజ్ షోలో నేను రూ.20 లక్షలు గెలుచుకున్నాను. ఇంకేముందీ, ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్, దగ్గరివాళ్లు అందరినీ కలుపుకుని దాదాపు 22 మందిని డిన్నర్‌కు తీసుకెళ్లాను. ఓ పెద్ద ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లి తిన్నాం. అలా నాకు వచ్చిన డబ్బంతా ఒక్కపూటలో ఖర్చైపోయింది. నేను ఎమ్టీవీలో పనిచేసిన తొలినాళ్లలో రూ.50,000 జీతం వచ్చేది. మిగతావాటితో పోలిస్తే అది కొంత తక్కువే! మోడలింగ్ విషయానికి వస్తే ఓ అనూహ్య ఘటన వల్ల మోడల్‌గా మారాల్సి వచ్చింది. ఓసారి ఏమైందంటే.. ఓ యాడ్ కోసం సుష్మితా సేన్ రావాల్సి ఉంది. ఆ ప్రకటనలో ఆమె ఓ పైలట్‌గా నటించాలి. టైం అవుతున్నా తను రాలేదు. ఆలస్యమవుతుండటంతో ఆమె స్థానంలో నన్ను పెట్టి చేశారు' అని చెప్పుకొచ్చింది. కాగా మిని మాథుర్.. ఇండియన్ ఐడల్ షో మొదటి మూడు సీజన్లకు, అలాగే ఆరో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇదే కాకుండా మిస్ ఇండియా పేజెంట్, దిల్సే దిల్సే ఆజ్‌తక్, బాంబే బ్లష్, పాప్‌కార్న్ జూమ్, సిర్ఫ్ ఏక్ మినిట్ మె సహారా వన్ వంటి పలు షోలకు హోస్టింగ్ చేసింది. దిల్ విల్ ప్యార్ వార్, ఐ మే ఔర్ మే చిత్రాల్లో మైండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. -
నటి మృతి.. మరణానికి కారణమదేనా? వైరలవుతున్న వీడియో!
ప్రముఖ మలయాళ నటి, యాంకర్ కమెడియన్ సుబి సురేశ్ మరణంతో మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. అయితే సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె తన అనారోగ్యం గురించి మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. సుబి సురేశ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఆ వీడియోలో తను ఏమందంటే.. 'సమయానికి తినడం, మందులు వేసుకోవడం వంటి మంచి అలవాటు నాకు లేదు. దీనివల్ల ఓసారి షూటింగ్‌కు ముందు రోజు ఛాతీలో నొప్పి వచ్చింది, దీనికి గ్యాస్ట్రిక్ సమస్య కూడా తోడైంది. ఆ మరుసటి రోజు నేను ఏదీ తినలేకపోయాను. ఒకటే వాంతులు.. కొబ్బరి నీళ్లు తాగినా కూడా దాన్ని బయటకు కక్కేశాను. రెండు రోజులు ఏమీ తినలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే పొటాషియం చాలా తక్కువగా ఉంది. సరిగా తినాలని చెప్పారు. నిజానికి చాలామంది నాకు డబ్బు పిచ్చి అనుకుంటారు. ఫుడ్ కూడా తినకుండా డబ్బు వెంట పరుగెడుతుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలాకాలం తర్వాత వరుస ప్రాజెక్టులు వస్తుండటంతో కొత్త ఉత్సాహంతో వాటిని చేసుకుంటూ పోయాను. నా ఫోకస్ డబ్బు మీద కాకుండా పని మీదే ఉంది. ఈ క్రమంలో సరైన ఫుడ్ తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశాను. ఈ విషయంలో అమ్మ, సోదరుడు నన్ను పదేపదే తిట్టేవారు. నాకు నచ్చినవి పట్టుకొచ్చినా వాటివైపు కన్నెత్తి చూసేదాన్నే కాదు. చెప్పాలంటే నాకు ఆకలిగా ఉన్నా కూడా ఏమీ తినకపోయేదాన్ని. అదే నాకున్న అత్యంత చెడ్డ లక్షణం. రానురానూ నా శరీరంలో మాగ్నీషియం, పొటాషియం, సోడియం లెవల్స్ పడిపోవడంతో నా పరిస్థితి కొంత సీరియస్‌గా మారింది. ముందునుంచే కరెక్ట్‌గా తిని ఉండుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా అనుకున్నా. షూటింగ్‌కు వెళ్లి ఆలస్యంగా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా బెడ్రూమ్కు వెళ్లి పడుకునేదాన్ని. ఏ సాయంత్రానికో లేచేదాన్ని. అప్పుడు కూడా బద్ధకంతో కేవలం నీళ్లు తాగి మళ్లీ నిద్రపోయేదాన్ని. ఇది తరచూ రిపీట్ అవడంతో హాస్పిటల్లో 10 రోజులు ఉండాల్సింది. కొన్నేళ్లుగా నిర్లక్ష్యంగా ఉన్న నేను ఇప్పుడు రోజుకు మూడు సార్లు తింటున్నాను. కాబట్టి అందరికీ అనుభవంతో చెప్తున్నా.. సమయానికి తినడం అలవాటు చేసుకోండి' అని చెప్పుకొచ్చింది సుబి సురేశ్. ఇది చూసిన నెటిజన్లు మీ నిర్లక్ష్యంతో ప్రాణాలే పోగొట్టుకునారు అని కామెంట్లు చేస్తున్నారు. -
కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల మేరకు.. మధురానగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న 27 ఏళ్ల యువతి ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తుంది. కళాశాలలో ఆమెతో కలిసి చదువుకున్న క్లాస్మేట్ కూకట్పల్లి నివాసి కె.సామ్రాట్ ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించాలని వెంట పడటంతో అందుకు నిరాకరించగా స్నేహితుల్లా ఉందామని నమ్మించాడు. ఓసారి తన కారులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించగా తిరిగి హాస్టల్ వద్ద విడిచివెళ్లాడు. యువతిపై కోపం పెంచుకున్న సామ్రాట్ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. కోరిక తీర్చకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమపేరుతో టీవీ యాంకర్‌కు దగ్గర.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, హోటల్‌కు తీసుకెళ్లి..
సాక్షి, చెన్నై: ఓ టీవీ యాంకర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన ఓ యువకుడికి పది సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ ఈరోడ్ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు.. ఈరోడ్‌కు చెందిన 26 ఏళ్ల యువతి లోకల్ టీవీలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఈరోడ్ ముత్తంపాలయానికి చెందిన రాహుల్ (29)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. 2018 కోవైలో ఓ ప్రోగ్రాంకి వెళ్లిన సమయంలో హోటల్‌కు తీసుకెళ్లిన రాహుల్ తనను వివాహం చేసుకుంటానని చెప్పి బలాత్కారం చేశాడని, అలాగే తన వద్ద 750 గ్రాముల సవర్ల బంగారు నగలు మోసం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆగస్టులో ఈరోడ్ మహిళాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో రాహుల్ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు ఇచ్చారు. చదవండి: (పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..) -
బీజేపీ నేత సోనాలి ఫోగట్ హఠాన్మరణం
ఛండీగఢ్: టీవీ యాంకర్, బీజేపీ నేత సోనాలి ఫోగట్(43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి గుండె పోటుతో అక్కడే కన్నుమూసినట్లు సమాచారం. 2006లో టీవీ యాంకర్‌గా, టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనాలి ఫోగట్.. రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరారు. టిక్ టాక్ ద్వారా ఆమె పాపులారిటీ మరింత పుంజుకుంది. దీంతో బీజేపీ ఆమెను స్టార్ క్యాంపెయినర్‌గా మార్చేసుకుంది. సోషల్ మీడియాలో సోనాలికి ఫాలోయింగ్ ఎక్కువే. 2019 హర్యానా ఎన్నికల్లో ఆమె అదాంపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. అయితే.. అనూహ్యంగా కిందటి నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిష్ణోయ్.. బీజేపీలో చేరారు. పోయినవారం సోనాలి ఫోగట్‌తో బిష్ణోయ్ భేటీ కావడంతో.. అదాంపూర్ ఉపఎన్నికలో సోనాలినే అభ్యర్థిగా నిలబడతారనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆమె కన్నుమూయడం గమనార్హం. సోనాలి ఫోగట్ భర్త 2016లో హిస్సార్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. 2020లో ఓ అధికారిని చెప్పుతో కొట్టి ఆమె వివాదంలో నిలిచారు. ఇదీ చదవండి: చంటిబిడ్డతో ఫుడ్ డెలివరీ.. ఆ తల్లికి అంతా ఫిదా -
విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్
యంగ్ హీరో విశ్వక్సేన్- టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్‌కి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదాన్ని వాడటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి యాంకర్ దేవి నాగవల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విశ్వక్ సేన్ ప్రవర్తన బాగాలేదు. కశ్చితంగా చర్యలు ఉంటాయి. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తా.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ ఊరుకోరు. ఆయన సారీ చెప్పిన పద్దతి కూడా సరిగా లేదు.ఈ విషయాన్ని మా అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం' అని పేర్కొన్నారు. -
విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ చేసిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియోతో విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్, చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్. అయితే ఈ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్‌ను స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఒక పురుషుడి కన్నా పవర్‌ఫుల్‌గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఆ యాంకర్‌ను ట్యాగ్ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో (హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 @Devi_Nagavalli is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022 -
‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
Argument Between TV Anchor And Hero Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో(హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు తాజాగా ఈ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్ హీరో విశ్వక్ సేన్, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటని, హీరో మెంటల్ స్టేటస్‌పై ప్రశ్నించింది యాంకర్. ఈ నేపథ్యంలో విశ్వక్‌ను డిప్రెషన్ పర్సన్, పాగల్ శ్రీను వంటి పదాలు వాడారు. దీంతో విశ్వక్ యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. ‘నేను డిప్రెషన్‌కి వెళ్లిపోయానని మీరు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అలా ఏ డాక్టర్ చెప్పాడో అతడి నెంబర్ ఇవ్వండి నేను మట్లాడుతాను. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు’ అన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. అలాగే ‘నాకు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. డిప్రెషన్ పర్సన్, పాగల్ శీను అని అనడం సరికాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో యాంకర్ విశ్వక్ సేన్‌ను నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోమ్మంటూ గట్టిగా అరించింది. దీంతో యాంకర్‌పై విశ్వక్ విరుచుకుపడుతు అభ్యంతరకర(ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ప్రముఖ యాంకర్, ఫొటోలు వైరల్
ప్రముఖ యాంకర్, నటుడు సైరస్ సహుకర్ ఓ ఇంటివాడయ్యాడు. ప్రియురాలు వైశాలి మాలహరను పెళ్లాడాడు. శుక్రవారం నాడు (ఏప్రిల్ 15న) మహారాష్ట్రలోని అలీబాగ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో పాటు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. కాగా సైరస్ సహుకర్ బుల్లితెరమీద ప్రసారమయ్యే పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎమ్‌టీవీ బాక్రా గాగ్, చిల్ అవుట్, స్పెల్లింగ్ బీ, ఇండియా గాట్ టాలెంట్ సహా తదితర కార్యక్రమాలకు హోస్టింగ్ చేశాడు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన మౌండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ముఖ్య పాత్రలో నటించాడు. అలాగే కౌన్ బనేగి షిఖర్వాతి, పాట్లక్ వంటి షోలలనూ పాల్గొన్నాడు. సినిమాల విషయానికి వస్తే అతడు ఢిల్లీ 6, ఐషా, రంగ్ దే బసంతి, ఖుబ్సూరత్ సహా పలు చిత్రాల్లో నటించాడు. ఆయన చివరిసారిగా అప్‌స్టార్ట్స్ మూవీలో కనిపించాడు. View this post on Instagram A post shared by 𝙎𝙖𝙢𝙞𝙧 𝙆𝙤𝙘𝙝𝙝𝙖𝙧 (@samirkochhar) View this post on Instagram A post shared by 𝙎𝙖𝙢𝙞𝙧 𝙆𝙤𝙘𝙝𝙝𝙖𝙧 (@samirkochhar) చదవండి: బాలీవుడ్‌కు 'కేజీఎఫ్ 2' ఒక హారర్ మూవీ: రామ్ గోపాల్ వర్మ 'డబ్బు మెషీన్గానే చూశారు'.. పూనమ్ పాండే ఎమోషనల్ -
ఆ ముగ్గురి వల్లే ఇంత బాధ అనుభవిస్తున్నాం: వర్ష ఎమోషనల్
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి లోనైంది. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్ చేసింది. 'దయచేసి అందరినీ వేడుకుంటున్నాను.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా, సఫర్ అవ్వకుండా ఉంటారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది' అని వర్ష పేర్కొంది. -
తాళిబొట్టుతో షాకిచ్చిన వర్ష: పెళ్లికి రెడీ అయిందా?
టీవీ యాంకర్ వర్ష... తన అందచందాలతో షోలో సందడి చేసే ఆమె అడపాదడపా సీరియళ్లలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే! యాంకరింగ్, నటన రెండింటిలోనూ రాణిస్తున్న ఈ భామ ఫొటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. దీంతో ఆ ఉంగరం వెనుక ఏదో దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది. దీంతో వర్ష పెళ్లిపీటలెక్కబోతుందహో.. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చాటింపు వేసి మరీ చెప్తున్నారు. చేతికి ఉంగరం ఉంది కాబట్టి ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఖరారు చేస్తున్నారు. కానీ వర్ష మెడలో మూడు ముళ్లు పడితే ఇమ్మాన్యుయేల్ ఏమైపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే వర్ష పెళ్లి చేసుకోబోతుందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే! చదవండి: విజయ్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ -
ఘనంగా టీవీ యాంకర్ పెళ్లి
మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్కు చెందిన అరవింద్‌తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు) మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్, మనియన్ పిల్ల రాజు, శ్రీకుమార్, దర్శకులు కమల్, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్‌గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్: బుల్లితెర స్టార్లతో ప్రదీప్ డ్యాన్స్) View this post on Instagram A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal) -
యాంకర్లతో రాసలీలలు?
సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. హోటల్స్, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్ హౌస్‌లలో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సప్‌లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు వార్ని పంపిస్తూ రెండు చేతూలా ఆర్జిస్తున్నారు. గంటలు.. రోజుల తరబడి కూడా బుకింగ్‌లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకో వచ్చు. కొన్ని హోటల్స్ అందుకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో దర్జాగా ఈ వ్యాపారం సాగుతోంది. అందుకోసం ఈ హోటల్లో కొన్ని రూమ్‌లను రిజిస్ట్రర్ చేయకుండా అన్‌రిజిస్ట్రర్ కోటాలో వదిలివేస్తారు. ఈ హోటల్లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్ చేసుకుంటే హోటల్లో రూమ్ కూడా ఫ్రీగా ఇస్తుంటారని వినికిడి. (జూబ్లీహిల్స్ వ్యభిచార గృహంపై దాడి) గంటకు రూ.3వేలు నుంచి.. గంటకు రూ.3వేల నుంచి 5వేలు, ఒక రాత్రికి రూ.5 నుంచి 10 వేల వరకు బుకింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం. ఇక హౌసింగ్ బోర్డు కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. ఇక నగర శివారుల్లో ఇండిపెండెంట్ హౌసుల్లో కూడా ఈ తరహా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి నగరంలో రుచిమరిగిన విటులకు వారి ఫొటోలను పంపి వారి కోరికలు తీరుస్తున్నారు. నగరంలో యువతనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ మధ్య ఓ చానల్లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. యాంకర్లతో రాసలీలలు? టీవీల్లో చిన్న చితకా పాత్రల్లో నటించిన నటులు, యాంకర్లను బుక్ చేసుకుని నగరానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక హోటల్స్‌లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడు తమకు కావాల్సిన చోటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్‌లో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొన్న యాంకర్లలో ఒకర్ని సంబరాల రాంబాబు ఇటీవలే నగరానికి తీసుకొచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో నాలుగురోజుల పాటు ఉంచి ఎంజాయి చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ యాంకర్ ఉన్న మాట వాస్తవమేనని, రోజు ఎవరో కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లే వారని వారెవరని తమకు తెలియదని ఆ హోటల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో జరిగే ఈ హైటెక్ వ్యభిచారం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఉన్న వారు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
యోగా వీడియోలో నగ్నంగా టీవీ యాంకర్!
న్యూయార్క్: ప్రముఖ టీవీ యాంకర్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తమ్ముడు క్రిస్ క్యూమోకు చేదు అనుభవం ఎదురైంది. తన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యోగా వీడియోలో అతను నగ్నంగా కనిపించాడు. న్యూయార్క్‌లోని హాంప్టన్ మాన్షన్ గార్డెన్లో క్రిస్ భార్య క్రిస్టినా గ్రీవెన్ క్యుమో యోగా చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో క్రిస్ గార్డెన్‌లోకి నగ్నంగా వచ్చి అటువైపు తిరిగి నిలబడ్డాడు. దీన్ని గమనించని అతని భార్య ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా పోస్ట్ చేసింది. దీంతో ఒక్క క్షణం బిత్తరపోయిన నెటిజన్లు 'నగ్నంగా నిల్చుని ఉంది యాంకర్ క్రిస్ కదూ..' అంటూ అతడిని గుర్తుపట్టడం మొదలుపెట్టారు. (అధ్యక్షుడితో వీడియో కాన్ఫరెన్స్: నగ్నంగా ప్రత్యక్షం) వెంటనే నాలుక్కరుచుకున్న సదరు మహిళ ఆ వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆ వీడియోను స్క్రీన్షాట్లు తీసి పెట్టుకున్న నెటిజన్లు క్రిస్ ఫొటోలను తిరిగి పోస్ట్ చేయడంతో 49 ఏళ్ల యాంకర్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా వుండగా క్రిస్ క్యుమోకు మార్చి 31న కరోనా పాజిటివ్ అని తేలింది. లాక్డౌన్ పుణ్యాన గతంలోనూ ఇలాంటి వింత సంఘటనలు వెలుగుచూశాయి. ఓ రిపోర్టర్ హెయిర్ కట్స్ కోసం చెప్తుండగా ఆ వీడియోలో ఆమె భర్త బట్టలు లేకుండా ప్రత్యక్షమయ్యాడు. గత నెలలో బ్రెజిల్ అధ్యక్షుడు సహా పలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవగా అందులో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించాడు. దీంతో వెంటనే అతడిని సమావేశం నుంచి తొలగించారు. (పుట్టగానే ఆ బిడ్డ చేసిన పనికి డాక్టర్లే షాక్) -
టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని, నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా అని పోలీసులు తెలిపారు. -
బాలికలతో బాడీ మాసాజ్.. టీవీ యాంకర్‌పై కేసు
సాక్షి, కృష్ణా : ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. శిశు సంక్షేమ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికల్ని పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. దీనిలో భాగంగానే నగరంలోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికల్ని పనికి కుదిర్చింది. అయితే సెలవులు ముగిసినప్పటికీ.. బాలికలు చైల్డ్ కేర్‌కి తిరిగిరాకపోవడంతో సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. అనంతరం బాలికల మిస్సింగ్‌పై దర్యాప్తు చేయగా.. హైదరాబాద్‌లో టీవీ యాంకర్ ఇంట్లో వెట్టిచాకరి చేస్తున్నట్టు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల్ని కమిటీ సభ్యులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇంటి పనితో పాటు బాడీ మసాజ్ లాంటి పనులను సైతం వారితో చేయించుకుంటున్నట్లు బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేశారు. మైనర్లని పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరిత్యా నేరంమని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకుని.. వివరాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్
సాక్షి, అన్నానగర్: చెన్నైలో టీవీ యాంకర్ ఇంట్లో కుక్కర్ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెలివిజన్‌లో సూపర్ హిట్స్ అనే కార్యక్రమానికి యాంకర్ చేసి ప్రసిద్ధి గాంచిన మణిమేఘలై 2017 నటన మాస్టర్ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఒంటరిగానే నివసిస్తూ వస్తోంది. ఈ స్థితిలో మణిమేఘలై ఇంట్లో వంట చేసేతను రాకపోవడం వల్ల కుక్కర్లో మణిమేఘలై వంట చేసింది. కుక్కర్ విజిల్ రాకుండా కొద్ది సేపటికే పేలిపోయింది. చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. దీనిని మణిమేఘలై ఫొటో తీసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేశారు. కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. చదవండి: ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి? View this post on Instagram Ellam correcta panniyum indha cooker edhuku vedichuthu nu enaku ipo therinjaaganum ☝️ Enna paatha indha cooker ku epdi therithu 🤷♀️ namaku varadha oru vishayatha ini try eh panna kudathu 😕 Kitta nindrundha enna ayirukum 🤯 Athum ivlo kashtathula help pannama video edukara indha Hussain maari aala vachutu onnum panna mudiyathu 🚶♀️ Atleast 1 year ku cooking pakkam pogavey kudathu 🐒 Veedu fulla clean panra kashtam kuda paravaala 🙃 without makeup la indha hussain paiya video record pannadhudhan manavaruthama iruku 😛 @mehussain_7 A post shared by Mani Megalai (@iammanimegalai) on Feb 18, 2020 at 3:57am PST -
టీవీ యాంకర్ అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘జాగీ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. జాగీ మృతిచెందిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. జాగీ ఎలా మృతి చెందారనే అంశంపై సరైన సమాచారం రాబట్టలేకపోయామ’ని పోలీసులు తెలిపారు. కాగా, 38 ఏళ్ల జాగీ ఓ టీవీ చానల్లో వంటల పోగ్రామ్ నిర్వహిస్తున్నారు. బ్యూటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె గాయనిగా, మంచి వక్తగా గుర్తింపు పొందారు. -
సత్తుపల్లి: తెలంగాణ యాసతో మంగ్లీ
సాక్షి, సత్తుపల్లిటౌన్/సత్తుపల్లిరూరల్: రేలా.. రేలా.. రేలారే.. తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా.. ఇలా పాటలు ఆలపిస్తూ తెలంగాణ యాసతో టీవీ యాంకర్ మంగ్లీ ఉర్రూతలూగించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముందుగా యాంకరింగ్ చేయాల్సి ఉంది. కాని ట్రాఫిక్ జామ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన అనంతరం తళుక్కుమని స్టేజీ ఎక్కి.. అందరిని హలో.. హలో.. అక్కలు.. తమ్ముళ్లు.. అన్నలు.. సారీ.. లేటైంది.. అంటూ పలకరించారు. తెలంగాణ యాసతో అలరించింది. ఇంతలోనే జనం చేరుకోవటం.. స్టేజీ పైన కూడా నిండిపోవటంతో అసహనానికి లోనైంది. అనంతం పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవితో కలిసి ప్రచారం చేశారు. -
28 నుంచి బుల్లితెరపై..
సినిమా: ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి రెడీ అవుతోంది. ఆమె తండ్రి కమలహాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తే, తాజాగా ఆయన తనయ శ్రుతిహాసన్ హలో సాగో అంటూ బుల్లితెర ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్ సంస్థ, మోషన్ కంటెంట్ గ్రూప్‌తో కలిసి వైవ్ హలో సాగో పేరుతో చర్చావేదిక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమానికి సంచలన నటి శ్రుతిహాసన్ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలుగులో నంబర్‌ఒన్ యారీ పేరుతో ప్రసారం అవుతోంది. దానికి నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటుల వ్యక్తిగత విషయాలను వెల్లడించి ప్రేక్షకుల ముందు తమ మరో కోణాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు తెలిపారు. తారలు తమ నిజ జీవితాల్లోని రహస్యాలను ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి శ్రుతిహాసన్ ఈ సందర్భంగా స్పందిస్తూ సాధారణంగా ఎంటర్టెయిన్మెంట్ రంగానికి చెందిన వారు వారి అంతరంగ విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరన్నారు. అయితే ఈ వైవ్ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తారల మరో ముఖాన్ని చూడగలరని చెప్పారు. తారలు నిజాయితీగా చెప్పే విషయాలు, వారి అందమైన జీవిత పయనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్ యాప్‌తో పాటు సన్ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. -
సీనియర్‌ను కోర్టుకీడ్చిన యాంకర్
చెన్నై : మీడియాలోనూ కీచకులు ఉన్నారని బయటపెడుతూ.. సోషల్ మీడియా వేదికగా మీటూ ఉద్యమం రగులుతోంది. న్యూస్రూమ్ల్లో, ఇంటర్వ్యూల్లో తాము ఎదుర్కొన్న భయానకమైన అనుభవాలను మహిళా జర్నలిస్ట్‌లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. బయటికి ఎంతో ప్రముఖంగా, హుందాగా వ్యవహరించే వారు సైతం, ఓ అమ్మాయితో ఇలా ప్రవర్తించారా? అనే రీతిలో మీటూ ఉద్యమం రగులుతోంది. అయితే ఈ మీటూ ఉద్యమం రాకమునుపే అంటే ఓ ఐదేళ్ల ముందే చెన్నైలో ఓ మహిళా జర్నలిస్ట్, ప్రముఖ మీడియా హౌజ్‌లో పనిచేసే తన సీనియర్‌ను కోర్టుకు ఈడ్చింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో, కోర్టులో కేసు దాఖలు చేసింది. ఆర్గనైజేషన్ నుంచి, తన కొలీగ్స్ నుంచి ఇసుమంతైనా సపోర్టు లేనప్పటికీ, ఒకతే ఎన్నోఏళ్లుగా ఆ కీచకుడిపై కోర్టులో యుద్ధం చేస్తోంది. అకిలా తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రముఖ మీడియా హౌజ్ సన్ టీవీలో న్యూస్ యాంకర్‌గా చేరింది. అయితే ఆ ఛానల్లో మాజీ చీఫ్ ఎడిటర్ అయిన వీ రాజ ఆమెను లైంగికంగా సహకరించాలంటూ వేధింపులకు దిగాడు. కానీ ఆమె దానికి ససేమీరా అనడంతో, అకిలతో మరింత క్రూరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. న్యూస్‌రూమ్‌లో వేధించడం, బదిలీ చేస్తానంటూ హెచ్చరించడం, పదే పదే ఉదయం సిఫ్ట్లు వేయడం చేశాడు. ఆ కీచకుడి వేధింపులు వేగలేక అకిలా, ఓ రోజు అతనిపై లైంగిక వేధింపుల కేసు ఫైల్ చేసింది. దీంతో అకిల ఆరోపణలపై సంస్థలోని హెచ్ఆర్ విభాగం కూడా దిగొచ్చి, రాజపై విచారణ ప్రారంభించింది. అయితే అకిలకు ఎవరూ సపోర్టు రాకుండా.. రాజ పకడ్బందీ ప్లాన్ వేశాడు. ఆమె స్నేహితులందరిని ప్రలోభాలకు గురిచేశాడు. దీంతో అకిల ఎవరైతే తన స్నేహితులని భావించిందో, వారందరూ కూడా రాజవైపు వెళ్లిపోయి, ఆమెకు వ్యతిరేకమయ్యారు. రాజపై లైంగిక వేధింపుల కేసు, పరువు నష్టం కేసుతో పాటు, వారిపై కూడా 2014లో పరువు నష్టం కేసు దాఖలు చేసింది అకిల. ప్రస్తుతం ఈ కేసుల విషయంలో అకిలా కోర్టులో పోరాటం చేస్తోంది. ఆ సంస్థలో ఉద్యోగం మానేసినప్పటికీ కూడా, కోర్టులో పోరాటం మాత్రం ఆపలేదు. అయితే రాజ తన తరుఫున ఒక న్యాయవాదిని నియమించుకోగా.. సన్ నెట్వర్క్ కూడా అతని కోసం మరో న్యాయవాదిని నియమించింది. ఎంత మంది న్యాయవాదులు, ఎంత పెద్ద సంస్థ రాజకు మద్దతుగా నిలిచినా.. అకిల ఏ మాత్రం జంకకుండా.. తనను లైంగికంగా వేధించిన అతనిపై సాహోసపేత పోరాటం చేస్తోంది. ప్రెగ్నెన్సీతో కూడా కోర్టుకు వచ్చా... ‘గత ఐదేళ్లుగా ఈ కేసుల విషయంలో పోరాడుతూనే ఉన్నా. న్యాయం బయటికి రాకుండా ఉండేందుకు నిందితుడు కోర్టు ప్రక్రియను జాప్యం చేస్తూ ఉన్నాడు. ఎన్ని సార్లు సైదాపేట్ కోర్టు మెట్లు ఎక్కి, దిగానో లెక్కలేదు. గర్భంతో ఉన్నా రాజపై పోరాటం మాత్రం ఆపలేదు. ఆ తర్వాత నా చిన్నారిని ఎత్తుకుని కూడా కోర్టు ట్రయల్‌కు వచ్చా’ అని అకిలా చెప్పింది. ప్రస్తుతం ఈ కేసులు తుది దశకు వచ్చాయి. మరో మూడు నెలల్లో న్యాయం గెలవబోతుందని అకిల చెప్పింది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల కంటే, తన స్నేహితులు నిందితుడికి మద్దతుగా మారడమే ఎక్కువగా బాధించిందని అకిల అన్నారు. తన కేసులో ఓ మాజీ యాంకర్ తనకు సాక్ష్యంగా నిలిచిందని, తనతో కూడా రాజ అలానే చెడుగా ప్రవర్తించాడని చెప్పిందని తెలిపారు. కోర్టులో తను పోరాడుతున్న సమయంలో, మరికొంత మంది యాంకర్లు కూడా అకిలకు మద్దతుగా నిలిచారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో, తమను రాజ లైంగికంగా సహకరించాలంటూ డిమాండ్ చేశాడని చెప్పారు. వీరు కూడా ప్రస్తుతం వారి ఫిర్యాదులను కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి ఏ మాత్రం భయపడవద్దని, చాలా ధైర్యంగా పోరాడాలని అకిల సూచించింది. ఒకవేళ ఆ ధైర్యం లేకపోతే, అందరి ముందు గట్టిగా నాలుగు చెంప దెబ్బలు కొట్టండని సలహా ఇచ్చింది. మీరు నిశ్శబ్దంగా ఉంటే, వారు మరింత రెచ్చిపోతారని తెలిపింది. మీటూ ఉద్యమం రగులుతున్న ఈ క్రమంలో, ఎవరైనా మహిళ లైంగిక వేధింపులు గురయ్యాయని చెబితే, వాటిని కొట్టి పడేయకుండా.. ఆమె వేదనను అర్థం చేసుకోవాలని కూడా సూచించింది. -
భార్య హత్య కేసులో టీవీ యాంకర్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : భార్య హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టీవీ యాంకర్, నిర్మాత సుహైబ్ ఇలియాసికి ఎట్టకేలకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారగార శిక్షను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుహైబ్ భార్య అంజూ ఇలియాసి 2000లో శరీరంపై కత్తిపోట్లతో అనూమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అదనపు కట్నం కోసం అంజూని వేధించి అతని భర్తే హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశారు. సుమారు 17ఏళ్లపాటు జరిగిన కేసు విచారణ.. 2017 డిసెంబర్లో సుహైబ్‌ను దోషిగా పేర్కొంటూ విచారణ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ తీర్పును గత మార్చిలో అతని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చెప్పట్టిన జస్టిస్ మురళీధర్, వినోద్ గోయల్.. హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు రుజువు చేయలేకపోయారని, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని తీర్పును వెలువరించారు. కాగా క్రైమ్ యాంకర్‌గా సుహైబ్ పలు షోలు నిర్వహించిన పాపులర్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై అతని తరుఫు న్యాయవాదుల హర్షం వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యాంకర్‌కు గాయాలు
-
రోడ్డు ప్రమాదంలో యాంకర్‌కు గాయాలు
సాక్షి, జనగాం : ప్రముఖ ‘స్టార్ మా’ యాంకర్, నటుడు మొహమ్మద్ కయిమ్ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. -
వీక్షకుల కోసం చానళ్ల మధ్య పోటీ
రాయదుర్గం: దేశంలో ప్రస్తుతం 400 కంటే ఎక్కువ చానళ్లు వీక్షకుల కోసం పోటీపడుతున్నాయని ప్రముఖ టీవీ యాంకర్ నగ్మా సహార్ అన్నారు. గచ్చిబౌలిలోని మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్ మీడియా–ఆబ్జెక్టివిటీ అండ్ ప్రీజుడీసెస్ ఆఫ్ టీవీ న్యూస్ యాంకర్స్’ అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నగ్మా మాట్లాడుతూ.. ఆదాయ వనరుల సేకరణ ప్రతికూల వార్తల సేకరణపై ప్రభావం చూపిస్తోందన్నారు. న్యూస్‌రూమ్‌లో అతిథులను పూర్తి స్థాయిలో మాట్లాడనివ్వరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనూ వైస్ చాన్సలర్ డాక్టర్ మహ్మద్ అస్లామ్ పర్వేజ్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డీన్ ప్రొఫెసర్ ఎతేశ్యామ్ ఆహ్మద్‌ఖాన్ మాట్లాడారు. -
న్యూస్ రీడర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : వీ6 చానల్ న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక (36) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. మూసాపేట్‌లోని గూడ్స్‌షెడ్ రోడ్డు శ్రీవీలా అపార్టుమెంట్ రెండో ఫ్లోర్ 204 ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఆమె ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికొస్తూనే అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బ్యాగులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ‘కేవలం నా డిప్రెషన్ వల్ల మాత్రమే చనిపోతున్నాను. నా మెదడు నా శత్రువు’ అని నోట్లో రాసి ఉంది. ఆరు నెలల కిందట భర్త నుంచి రాధిక విడాకులు తీసుకుంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి ఆమె అపార్ట్మెంట్లో నివాసముండేది. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అందుకే దూరంగా ఉన్నా: అనసూయ
సాక్షి, హైదరాబాద్ : ‘రంగస్థలం’ సినిమా విడుదల అనంతరం సోషల్ మీడియాలోకి వస్తానని బుల్లితెర యాంకర్ అనసూయ స్పష్టం చేశారు. సెల్ఫీ అడిగిన ఓ బాలుడి మొబైల్ పగలగొట్టడంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ట్విటర్, ఫేస్ బుక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వెబ్సైట్ ఫేస్బుక్ లైవ్‌లో ఆమె అభిమానులతో ముచ్చటించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తడంతోనే అభిమానులతో ముచ్చిటించాలనుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎప్పుడు వస్తారని, ఎందుకు దూరంగా ఉంటున్నారని అభిమానులు పదేపదే ప్రశ్నించడంతో సమాధానం చెప్పారు. కుటుంబ సభ్యుల కోసమే దూరంగా ఉన్నా.. తన కుటుంబ సభ్యుల కోసమే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఆ ఘటన ( బాలుడి ఫోన్ పగలగొట్టిన) జరిగిన సమయంలో ఓ వర్గం మీడియా నాకు వ్యతిరేకంగా పనిచేసింది. ఆ సమయంలో ఎన్నో సమస్యలున్నా తనపై కథనాలు రాయడం తననెంతో బాధించిందన్నారు. ఇంకొందరైతే నా గురించి ఏమి తెలియకున్నా అసభ్యంగా కామెంట్స్ చేశారని, పాజిటివ్ కన్నా నెగటివ్ కామెంట్స్ ఎక్కువ రావడంతోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తాను ధైర్యవంతురాలినేనని, ఇలాంటి కామెంట్స్‌కు వెనకడుగేసే మనస్థత్వం తనది కాదన్న అనసూయ.. కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం తట్టుకోలేకపోయానన్నారు. తన కొడుకులు కూడా పెద్దవారవుతున్నారని, తల్లితండ్రులు వయసు కూడా పెరుగుతుందని, తనకు ఉన్న ఓపిక వారికి ఉండకపోవచ్చన్నారు. ఈ కారణాలతోనే సోషల్ మీడియాకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. రంగస్థలం సినిమా విడుదల అనంతరం సోషల్ మీడియాలోకి రావాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. మహిళలు ఎంతో ప్రేమను ఇస్తారని, వారికి అంతకన్నా ఎక్కువ ప్రేమను తిరిగివ్వాలని ఈ సందర్భంగా అనసూయ అభిమానులను విజ్ఞప్తి చేశారు. తాను ఇలా రాణించడానికి తన భర్త, తండ్రి ఇచ్చిన మద్దతేనని తెలిపారు. -
దుమారం రేపిన టీవీ యాంకర్ వ్యాఖ్యలు
ఇస్తాంబుల్ : ఓ టీవీ చర్చా వేదికలో రాజకీయ నేతలను ఉద్దేశించి యాంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘సాధారణ పౌరుల ప్రాణాలు తీసే ముందు రాజకీయ నేతలను చంపాలి’ అని వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డాడు. టర్కీ ప్రభుత్వ ఛానెల్ అకిట్ టీవీ యాంకర్ అహ్మత్ కేసర్ తాజాగా ఓ చర్చా కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ప్రధాన-ప్రతిపక్ష నేతలు కొందరు హాజరయ్యారు. ప్రస్తుతం సిరియా నెత్తురోడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర సిరియాపై ఉగ్రస్థావరాల మీద దాడుల కోసం టర్కీ సహకారం అందించటాన్ని నేతలంతా ముక్తకంఠంతో ఏకీభవించారు. అయితే కుర్షిద్ మిలిటెంట్లను మట్టుబెడుతున్నామన్న సాకుతో అక్కడి సాధారణ పౌరులను చంపటం సరికాదన్న కేసర్.. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘అంతలా చంపాల్సి వస్తే సాధారణ పౌరుల కంటే ముందుగా రాజకీయ నేతలను చంపాలి. ఇంత కన్నా దారుణమైన దేశద్రోహులు పార్లమెంట్లో కూర్చున్నారు. లౌకిక వాదం పేరుతో ఇస్లాం సాంప్రదాయలను తుంగలో తొక్కేస్తున్నారు. ముందు వాళ్లను చంపండి’’అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కేసర్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అతన్ని అరెస్ట్ చేసి దేశద్రోహిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అధికార పార్టీల నేతలు సైతం గొంతు కలపటం గమనార్హం. కేసర్పై ఫిర్యాదు అందటంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరో వైపు అతన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. నేరం రుజువైతే టర్కీ చట్టాల ప్రకారం అతనికి మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది. అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదిలా ఉంటే టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. గత వారం తూర్పు ఖరామాన్మరస్ ప్రాంతంలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వేదిక మీదకు ఓ ఆరేళ్ల బాలికను పిలిచారు. మిలిటరీ దుస్తుల్లో ఉన్న ఆ పాపను ‘దేశం కోసం నువ్వు చనిపోతే.. జెండా కప్పి నీకు అమర జీవి బిరుదు ఇస్తాం. అందుకు నువ్వు సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు. అయితే రెసెప్ గద్దించటంతో ఆ పాప ఏడుస్తూ అవునని బదులిచ్చింది. చిన్న పిల్లతో అలాంటి ప్రమాణం చేయించిన అధ్యక్షుల వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. -
టీవీ యాంకర్‌ను వేధించిన యువకులు
లక్నో: ఓ టీవీ యాంకర్‌ను మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వేధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు యాంకర్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేసే దామిని విధులు పూర్తి చేసుకుని అర్థరాత్రి సమయంలో బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఈ తరుణంలో ఆమెను ఇద్దరు ఆకతాయిలు బైక్‌పై వెంబడించారు. రూట్ మార్చి వారి నుంచి తప్పించుకున్న దామిని వారి ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ‘ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఎంజీ రోడ్ భగవాన్ టాకీస్ నుంచి తనను ఇద్దరు వెంబడించారు. తొలుత వెక్కరించడం మెదలు పెట్టిన వారు ఏదో మాట్లాడాలని ప్రయత్నించారు. వారి బైక్ నెంబర్ ప్లేట్‌ను ఫొటో తీయాలని ప్రయత్నించా కానీ అది నకిలీది. నేను వెంటనే రూట్ మార్చి తప్పించుకున్నాను. పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 1090కి ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ రోజు వీరిని వదిలేస్తే రేపు రేప్ చేయడానికి వెనకాడరు. ఇది యూపీ పోలీస్ వ్యవస్థకు షేమ్’ అని ఆవేదన వ్యక్తం చేశారు. గత గురువారం ఆమె ఈ పొస్ట్ను యూపీ డీజీపీ, సీఎం, మహిళల హెల్ప్‌లైన్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిన 1090 సిబ్బందిపై చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేసి మూడురోజుల్లో నిందితులిద్దరిని అరెస్ట్ చేసింది. -
సూర్య హైట్‌పై యాంకర్ల చెత్త కామెంట్స్
గ్యాంగ్ సినిమా సక్సెస్ తో ఆనందంగా ఉన్న సూర్యపై ఓ తమిళ మ్యూజిక్ ఛానల్ యాంకర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకోసం రెడీ అవుతున్న సూర్య తరువాత కె.వి.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే సూర్య సినిమాలో అమితాబ్ నటించటంపై మాట్లాడిన యాంకర్, సూర్య హైట్ గురించి కామెంట్ చేశారు. సింగం సినిమాలో తన కన్నా ఎత్తున్న అనుష్కనే తల పైకెత్తి చూసిన సూర్య, అమితాబ్‌తో నటిస్తే స్టూల్వేసుకోవాల్సి ఉంటుందేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. గ్యాంగ్ సినిమాలోనూ సూర్య హైట్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంది. జాబ్ ఇంటర్య్యూలో విలన్ సూర్య హైట్ గురించి కామెంట్ చేస్తాడు. అయితే సినిమా క్లైమాక్స్‌లో విలన్ తో ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు.. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ముఖ్యమని సమాధానమిస్తాడు. సూర్యపై టీవీ యాంకర్లు చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాలు తీవ్రంగా స్పందింస్తున్నారు. హీరో విశాల్. ‘ఇది హాస్యమా..?? కానే కాదు. నవ్వించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. సూర్య అభిమానులు యాంకర్లు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Funny !! ???? Absolutely not. How unethical in the name of sense of humour. Totally senseless. pic.twitter.com/0e4netQd6s — Vishal (@VishalKOfficial) 18 January 2018 -
పండుగ రోజు పులిహోర.. ఎవరైనా వస్తున్నారా ?
సాక్షి, హైదారాబాద్ : టీవీ వ్యాఖ్యాత సుమ పరిచయం అవసరం లేని పేరు. ప్రతిరోజు పలు టీవీ చానళ్లలో సందడి చేస్తూనే ఉంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరిస్తారు. ఇటీవల సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి సోషల్ మీడియా అభిమానులను ఆనందిపచేస్తుంటారు. ఇక సంక్రాంతి పండుగ రోజు కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. సుమ పులిహోర కలుపుతున్న వీడియోని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోలో సుమ ఏమన్నారంటే.. ‘‘ పులిహోర.. చింతపండుతో పులిహోర చేస్తున్నాను. ఇదిగో చింతపండు గుజ్జు. ఇదిగో పులిహోర (అదే సమయంలో అక్కడికి తన పెంపుడు కుక్క రావడంతో.. ఏయ్.. నువ్ ఇటు రావద్దు అంటారు). ఎవరైనా వస్తున్నారా పులిహోర టేస్ట్ చేయడానికి..’’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
పులిహోర.. చింతపండుతో పులిహోర
-
న్యూఇయర్ : మందుబాబులపై కొరడా
సాక్షి, హైదరాబాద్ : కొత్తసంవత్సరం వేకువజామునే మందుబాబులకు చుక్కలుచూపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేశారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో దొరికిపోయిన ప్రముఖుల్లో టీవీ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. ప్రదీప్‌కు జైలు తప్పదేమో!: నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనీఖీలు చేశారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద ప్రదీప్ కారును పోలీసులు ఆపారు. బ్రీత్ అనలైజ్ చేయగా.. 178 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడికి శిక్ష, వాహనం సీజ్ లాంటి చర్యలుంటాయి. మోతాదు కంటే చాలా ఎక్కువ మద్యం సేవించి, వాహనం నడిపిన ప్రదీప్‌కు సవరించిన నిబంధనలను అనుసరించి భారీ శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే పోలీసులు కేసును ఎలా నమోదుచేస్తారనేది తెలియాల్సిఉంది. వేలకొద్దీ కేసులు : ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లారి వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన నగర పోలీసులు వేలకొద్దీ కేసులు నమోదు చేశారు. సుమారు 1200 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన మందుబాబులు అందరికీ మంగళవారం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో చర్యలు కూడా అంతే తీవ్రంగా తీసుకునేందుకు యత్నిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన యాంకర్ ప్రదీప్ -
ఆపుకోలేకపోయాడు.. సారీ చెప్పేశాడు
-
ఆపుకోలేకపోయాడు.. సారీ చెప్పేశాడు
సాక్షి, వాషింగ్టన్ : ప్రశాంతంగా వార్తలు చదువుతున్న సమయంలో చిన్న అలజడి. తన ఇయర్ ఫోన్లో గుసగుసలు వినిపించటంతో మండిపోయిన యాంకర్‌కి కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకునిపోయింది. అసలేం జరుగుతోంది... అంటూ మొదలుపెట్టిన 8 నిమిషాల తిట్ల దండకం వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఎంఎస్ఎన్బీసీ చానల్ లో 'లాస్ట్ వర్డ్' అనే కార్యక్రమానికి యాంకర్ అయిన లారెన్స్ ఓ డొన్నెల్ ఆగష్టు 28న బులిటెన్ సందర్భంగా చేసిన పని తెగ వైరల్ అవుతోంది. కంట్రోల్ రూమ్‌లో కూర్చున్న వాళ్లెవరో కంట్రోల్ తప్పిపోయారు. మీ సుత్తి మూలంగా వార్తలు ప్రశాంతంగా చదవలేకపోతున్నాను అంటూ రాయటానికి కూడా వీలులేని భాషలో బూతులు తిట్టారు. తన కోపం తగ్గేదాకా కమర్షియల్ బ్రేక్ కొనసాగించాలని అరిచాడు. మైక్ లో ఎవరో అమ్మాయి ఈ షో తరువాత ఏం చేద్దామంటూ కబుర్లు చెబుతోందని, ఆమె కావాలంటే ఇప్పుడే ఆ పని చేసుకోవచ్చని సూచించాడు. 'మీడియేట్' ఈ వీడియోను వెలుగులోకి తీసుకురాగా.. ఆ వీడియో వైరల్ కావడంతో లారెన్స్ తన క్షమాపణలు కోరాడు. సాంకేతిక సమస్యలు వేధించినందుకే తాను అలా ప్రవర్తించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాడు. A better anchorman and a better person would've had a better reaction to technical difficulties. I'm sorry. — Lawrence O'Donnell (@Lawrence) 20 September 2017 -
టీవీ యాంకర్‌కు లైవ్‌లో చేదు అనుభవం
-
టీవీ యాంకర్‌కు లైవ్‌లో చేదు అనుభవం
ఆమె ఒక టీవీ యాంకర్. లైవ్‌లో వార్తలు చదువుతోంది. అంతలో ఆమెకు ఒక షాకింగ్ న్యూస్ అందింది. తప్పనిసరి పరిస్థితుల్లో కన్నీళ్లు ఆపుకుంటూ దాన్ని చదవాల్సి వచ్చింది. ఆ రోజుతో.. ఇంకా మాట్లాడితే ఆ బులెటిన్తోనే ఆ టీవీ చానల్ మూతపడింది. 'చానల్ వన్' అనే ఆ టీవీ చానల్‌ను ఉన్నట్టుండి మూసేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు గెలా అనే ఆ యాంకర్‌కు లైవ్‌లో ఉండగా సమాచారం అందింది. ''ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, పార్లమెంటులో ఓ ప్రకటన చేశారు.. నిజానికి ఈరోజు రాత్రిదే మా చిట్టచివరి న్యూస్ బులెటిన్'' అని ఆమె ప్రేక్షకులకు చెప్పింది. గొంతు వణుకుతుండగా.. ''ఇదే మా చివరి ఎడిషన్. అందువల్ల ఇక ఈ కార్యక్రమంలో వచ్చే మిగిలిన విషయాలకు అర్థంలేదు" అని ఆమె వివరించింది. ఈ రోజుతో చాలామంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని, వాళ్లకు కొత్త ఉద్యోగాలు దొరకాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. 55 సెకండ్ల నిడివి ఉన్న ఈ క్లిప్పింగ్‌ను చానల్ వన్ తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో పబ్లిష్ చేసింది. దాన్ని ఇంతవరకు 3.45 లక్షల మంది చూశారు. 1950 సార్లు షేర్ అయ్యింది. ఆ టీవీ చానల్ ఉద్యోగులకు తమ చానల్‌ను ప్రభుత్వం మూసేస్తుందన్న సమాచారం కొంత ముందు నుంచే ఉంది గానీ.. అప్పటికప్పుడు అంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం తెలియదని బీబీసీ తన కథనంలో తెలిపింది. చిట్టచివరి సారిగా జాతీయగీతం ఆలపించి తమ చానల్ కార్యాలయాన్ని మూసేసి బయటకు వెళ్లిపోయారు. వాళ్లలో చాలామంది ఏడుస్తూ కనిపించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ న్యూస్ చానల్‌ను ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఉన్నట్టుండి మూసేశారు. మీడియాను నియంత్రించేందుకే ఆయనిలా చేశౄరని ప్రతిపక్షాల సభ్యులు, చానల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
రాయలసీమ బిడ్డను అయినప్పటికి ...
మురళీనగర్ : టీవీ యాంకర్ లాస్య మురళీనగర్ సమీపంలోని పట్టాభిరెడ్డితోటలోని వానప్రస్థాశ్రమంలో సందడి చేశారు. జే-చారిటీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పెద్దవారికి ‘పలకరింపు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆశ్రయం పొందుతున్న సుమారు 40మంది వృద్ధులతో ఆమె మాట్లాడారు. హాయ్...నాన్నమ్మలూ....తాతయ్యలూ అంటూ పలకరించగానే బామ్మలు కూడా హాయ్...అంటూ మురిసిపోయారు. ఈసందర్భంగా లాస్య మాట్లాడుతూ తను రాయలసీమ బిడ్డను అయినప్పటికి తెలంగాణా ప్రజల ఆదరణ పొందగలుతున్నానని, ఇది తెలుగు ప్రజల అభిమానానికి సూచిక అని అన్నారు. తల్లిదండ్రులను వదిలేయడం సినిమాల్లో చూశానని... అటువంటి వారు పడుతున్న ఆవేదన స్వయంగా ఇక్కడ చూస్తున్నానని లాస్య పేర్కొన్నారు. నాన్నమ్మ, తాతయ్యల దగ్గర గడిపే అదృష్టం ఈరకంగా నాకు లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువైపోవడం వల్ల స్వార్థం పెరిగిపోతోందని, దీంతో ఇంట్లో పెద్దకు ఆదరణ కరవవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లాలం భాస్కరరావు, జే-చారిటీస్ సీఈఓ డి.రామారావు, యువ దర్శకుడు డి.జగదీష్, వానప్రస్థాశ్రమం నిర్వాహకుడు ఆర్.శ్రీనివాసు, బీజేపీ నాయకులు చిరికి శ్రీనివాసరావు, బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గూగుల్‌లో ఉద్యోగం వదిలివచ్చేశా..
భీమవరం : ‘గుంటూరు టాకీస్’ సినిమా నిర్మాత కిషోర్, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్టు టీవీ యాంకర్, సినీ నటి లాస్య చెప్పారు. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన స్నేహ కిట్టి కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. గూగుల్‌లో ఉద్యోగం చేస్తుండగా బుల్లితెరలో అవకాశం రావడంతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి నటిగా, యాంకర్‌గా స్థిరపడినట్టు తెలిపారు. తాను నటించిన అంకితం, డి జూనియర్స్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, సమ్‌థింగ్ స్పెషల్ వంటి కార్యక్రమాలు తనకెంతో గుర్తింపునిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. యాంకర్స్‌లో ఉదయభాను అంటే తనకు ఇష్టమని లాస్య చెప్పారు. -
గూగుల్‌లో ఉద్యోగం వదిలివచ్చేశా..
భీమవరం : ‘గుంటూరు టాకీస్’ సినిమా నిర్మాత కిషోర్, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్టు టీవీ యాంకర్, సినీ నటి లాస్య చెప్పారు. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన స్నేహ కిట్టి కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. ఇంజినీరింగ్ చదువుతున్న తాను బుల్లితెరకు పరిచయమై ఐదేళ్లు అవుతుందన్నారు. గూగుల్‌లో ఉద్యోగం చేస్తుండగా బుల్లితెరలో అవకాశం రావడంతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి నటిగా, యాంకర్‌గా స్థిరపడినట్టు తెలిపారు. తాను నటించిన అంకితం, డి జూనియర్స్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, సమ్‌థింగ్ స్పెషల్ వంటి కార్యక్రమాలు తనకెంతో గుర్తింపునిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. యాంకర్స్‌లో ఉదయభాను అంటే తనకు ఇష్టమని లాస్య చెప్పారు. -
టీవీ యాంకర్ అదిరే ఫొటోషూట్!
సినిమాల్లో అవకాశాలు లేకపోయినా.. వరుసగా టీవీ ప్రోగ్రామ్‌లు చేస్తూ తనదైన రీతిలో ప్రతిభ చాటుకుంటోంది శ్రీముఖి. ఇప్పుడు ఆమె చేతిలో బోలెడు టీవీ షోలు ఉన్నాయి. బబ్లీగా ఉంటూ పక్కింటి అమ్మాయిలా అనిపిస్తూ కామెడీ పంచులు వేస్తూ టీవీ షోల్లో అదరగొడుతోంది తను. దీనికితోడు అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఇక, శ్రీముఖి సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఉన్న ఆమె అకౌంట్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని మురిపించడానికి ఫొటోలు, డబ్ స్మాష్ వీడియోలు, షోలోని బిట్లను పోస్టు చేస్తూ ఉంటుంది తను. ఇటీవల ఓ అందమైన ఫొటోషూట్‌తో తన అభిమానులను సర్ ప్రైజ్ చేసింది శ్రీముఖి. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫొటోల్లో చాలా అందంగా మతిపోగొట్టే సోయగాలతో అలరించింది ఈ అమ్మడు. ఆ ఫొటోలు మీకోసం.. ఓ లుక్కేయండి! -
కవలలకు జన్మనిచ్చిన ఉదయభాను
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవల పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయభాను కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
యాంకర్ దంపతులపై విదేశీయుడి దాడి
స్నిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చుకదా అంటే దాష్టీకం నిందితుడి రిమాండ్ చిక్కడపల్లి: సిగ్నల్ పడ్డాక వెళ్లొచ్చు కదా... అన్న పాపానికి టీవీ యాంకర్ ఆమె భర్తపై ఓ విదేశీయుడు దాడి చేశాడు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎం.సుదర్శన్ కథనం ప్రకారం... ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లే మార్గంలోని అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ చానల్లో యాంకర్/న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి తన భర్త ముత్యంతో కలిసి బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి చానల్ ఆఫీసుకు వెళ్తోంది. మార్గం మధ్యలో అశోక్‌నగర్ చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకే వాహనంపై వచ్చిన సిరియా దేశస్తుడు సాద్ అబ్దుల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి బైక్‌ను పక్కకు జరపమన్నాడు. రెడ్ సిగ్నల్ ఉంది కదా... కొద్ది సెకన్లు ఆగితే వెళ్లిపోవచ్చు కదా అని అంది. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్ మున్నమ్.. శివజ్యోతి చెంపపై కొట్టాడు. ఎందుకు కొడుతున్నావని ఆమె భర్త ప్రశ్నించగా.. ఆయనపై కూడా చెయ్యి చేసుకొని తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అబ్దుల్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు అబ్దుల్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
టీవీ యాంకర్‌పై సిరియా దేశస్థుడి దాడి
చిక్కడపల్లి: ఓ టీవీ యాంకర్, ఆమె భర్తపై సిరియా దేశస్థుడు దాడి చేశాడు. సిగ్నల్ వద్ద బైక్‌ను పక్కకు తీయలేదని ఆగ్రహించిన ఆ విదేశీయుడు ఇద్దరినీ తీవ్రంగా కొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు రిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎం.సుదర్శన్ తెలిపిన వివరాలివీ.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఓ ఛానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న శివజ్యోతి, ఆమె భర్త ముత్యం బైక్‌పై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఇందిరాపార్క్ మీదుగా తమ ఆఫీసుకు వెళ్తున్నారు. ఈ సమయంలో అశోక్‌నగర్ సిగ్నల్ వద్ద సిగ్నల్ పడటంతో ఆగారు. వెనుకనే ఉన్న సిరియా దేశస్థుడు సాద్ అబ్దల్ మున్నమ్ అబ్‌ఫాయప్(25) యాంకర్ శివజ్యోతి ద్విచక్ర వాహనాన్ని పక్కకు జరపమన్నాడు. సిగ్నల్ పడింది కదా కొద్ది సెకన్లలో వెళ్లిపోవచ్చు కొద్దిగా వెయిట్ చేయమని కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన సాద్ అబ్దల్ మున్నమ్ అబ్‌ఫాయప్ శివజ్యోతి చెంపపై కొట్టాడు. భర్త ముత్యం అడ్డుకోగా అతనిపై కూడా చెయ్యి చేసుకుని తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దల్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
టీవీ యాంకర్‌ను తిడుతూ 2వేల కాల్స్
మహిషాసుర జయంతి జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించిన టీవీ యాంకర్‌ను తిడుతూ ఏకంగా 2వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్కడ ఏషియానెట్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ అయిన సింధు సూర్యకుమార్ ఫిబ్రవరి 26న ఈ షో నిర్వహించారు. అప్పటి నుంచి ఆమెను తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధుపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా జనం రెచ్చిపోయారు. ఆమె ఫేస్బుక్ పేజీలో తీవ్రవ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబరు కూడా పోస్ట్ చేసి, ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని చెప్పారు. అప్పటి నుంచి ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరకు విసిగిపోయిన సింధు.. పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమెకు ఫోన్లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్లంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని తిరువనంతపురం పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. అయితే.. దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత వీవీ రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దాన్ని దేశద్రోహం అని ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. హిందూదేవతను సెక్స్‌వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని ఖండించారు. -
అల్లరి పిల్లని..
చలాకీతనానికి మారు పేరు అశ్విని శర్మ. టీవీ యాంకర్‌గా పరిచయమై.. సినిమాల్లోనూ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ అమ్మాయి క్లాసికల్ సింగర్ కూడా. ఎంత రెబల్‌గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ గాళ్ అయిన అశ్విని... క్రిటిక్సే తనవెల్ విషర్స్ అంటోంది. నేను అండమాన్‌లో పుట్టాను. డాడీ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్‌వైఫ్. అక్కకు పెళ్లైపోయింది. ఒక పాప కూడా. నేను ఫిఫ్త్ క్లాసులో ఉన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యింది. నాకు ఊహ తెలిసిందిక్కడే. అప్పటి నుంచి మేం ఉంటున్నది సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోనే. ప్లస్‌టూ వరకు కేంద్రీయ విద్యాలయలో చదివాను. నిఫ్ట్, హామ్స్టెక్లో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను. చిన్నప్పటి నుంచి నేను బాగా అల్లరి. అనర్గళంగా మాట్లాడేదాన్ని. అదే నన్ను యాంకరింగ్ వైపు వచ్చేలా చేసింది. లిట్రల్లీ నేను టామ్‌బాయ్‌ని. ఆడుకునేటప్పుడు అబ్బాయిలను చితక్కొట్టేదాన్ని. స్కూల్‌కు డుమ్మా కొట్టి, ఫ్రెండ్స్‌తో కూడా మాన్పించి ఇంటి డాబాపైకి చేరి... టిఫిన్‌బాక్సులు తింటూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ తరువాత అమ్మతో దెబ్బలు తప్పేవి కాదనుకోండి! బై గాడ్స్ గ్రేస్... నేను స్టడీస్‌లోనూ ముందుండేదాన్ని. హైపర్ యాక్టివ్ కావడంతో.. అన్ని ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసేదాన్ని. రెండుసార్లు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. రీసెంట్గా 108 నిమిషాల్లో నవగ్రహ కీర్తనలు పూర్తి చేశాను. టైం దొరికినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. మా తాతవాళ్లు... శ్రీపాద ఫ్యామిలీ. అలా బ్లడ్‌లోనే మ్యూజిక్ ఉంది. అందుకే సింగింగ్ నాకు అబ్బింది. ప్రస్తుతం వీణలో డిగ్రీ చేస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు వీణ వాయిస్తూ టైంపాస్ చేస్తాను. ఫ్రెండ్స్‌తో ఉంటే మాత్రం షాపింగ్‌కి ఫ్రీకవుట్ అవుతాను. ఎప్పుడూ డల్‌గా ఉండను. నాకు ఆరోగ్యం బాగాలేదని నేను చెబితే తప్ప... ఎవరూ గుర్తు పట్టలేరు. అంత యాక్టివ్ అన్నమాట. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎక్కడ ఫంక్షన్‌కు వెళ్లినా బడబడా ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. అలా ఓసారి ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు చలాకీగా ఉన్న నన్ను చూసి జెమిని కిరణ్‌గారు, రాఘవేందర్రావుగారు ‘ఈ అమ్మాయి చాలా యాక్టివ్‌గా ఉందే’ అని బుల్లితెరవైపు తీసుకొచ్చారు. మొదటిసారిగా జెమినిలో ‘నీ కోసం’ ప్రోగ్రాంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. అది మొదలు.. అన్ని ఛానల్స్‌లో రకరకాల ప్రోగ్రామ్స్ చేశాను. ‘అభిమాని’, ‘ైధె ర్యం’, ‘ఛత్రపతి’, ‘పల్లకిలో పెళ్లికూతురు’,‘కొడుకు’.. ఇలా చాలా సినిమాల్లో చేస్తూ వచ్చాను. పదమూడేళ్లనుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఈ ప్రయాణంలో మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. సినిమాల్లోకి రాకుండా ఉంటే... ఏ ఎయిర్ హోస్టెసో, ఫ్యాషన్ డిజైనరో అయి ఉండేదాన్ని. నేను ఖురాన్ చదువుతాను. చర్చికి, గుడికీ వెళ్తాను. అన్ని మతాలనూ గౌరవిస్తాను. అది మా నాన్న నుంచి నేర్చుకున్నది. నాకు ఎక్కువగా జనాలతో ఉండటం ఇష్టం. వర్క్‌హాలిక్‌ని. విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకుంటాను. నా క్రిటిక్సే నా వెల్ విషర్స్ అనుకుంటాను. ఐయామ్ వెరీ థాంక్ఫుల్ టు దెమ్. ‘షా గౌస్’ చాయ్... చిన్నప్పుడు నేను, మా అక్క, మా కజిన్స్ తెల్లవారుజామునే లేచి సికింద్రాబాద్ ‘బ్లూ సీ’ హోటల్లో చాయ్ తాగేవాళ్లం. ఇప్పుడు ప్యారడైజ్‌కి వెళ్లి మరీ వెజ్ తినేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అనుకోవచ్చు. ఇంకా టోలిచౌకిలో ‘షా గౌస్’ కేఫ్‌లో ఇరానీ చాయ్ అంటే ఇష్టం. ఇప్పటికీ వీలుచేసుకుని మరీ.. అప్పుడప్పుడు వెళ్లి తాగుతుంటాను. ఇమ్లిబన్ దగ్గర ఉన్న గోశాలలో మూడు గోవులను అడాప్ట్ చేసుకున్నా. వాటి ఫీడింగ్, మెయింటెనెన్స్ చూసుకుంటాను. పూజలు చేయడానికీ టైమ్ స్పెండ్ చేస్తాను. శిరీష చల్లపల్లి -
అనసూయకు సరికొత్త ప్రమోషన్!!
టీవీలో రియాల్టీ షో పుణ్యమాని మంచి పేరు కొట్టేసిన బుల్లితెర స్టార్ అనసూయ.. కొత్త ప్రమోషన్ కొట్టేసింది. వాస్తవానికి ఈ ప్రమోషన్ ఆమెకు ఎప్పుడో వచ్చేసినా.. తానే నిరాకరించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ ప్రమోషన్ స్వీకరించేందుకు సిద్ధమైంది. అవును.. అనసూయ హీరోయిన్ అయ్యింది. జబర్దస్త్ షోతో జబర్దస్త్‌గా పేరుపొందిన అనసూయ న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయకు హీరోయిన్గా నటించే అవకాశాలు వస్తున్నాయి. బుల్లితెర, ఆడియో ఫంక్షన్లలో ఎక్కడ చూసినా అనసూయ హవానే కనిపిస్తోంది. సినిమాల ఆడియో విడుదల కార్యక్రమాలు, విజయోత్సవాలు.. ఇలా పలు కార్యక్రమాల్లో ఆమె తెగ కనిపిస్తోంది. ఇలాంటి అనసూయకు వెండితెరపై మెరిసే అవకాశం కొన్నాళ్ల క్రితమే వచ్చింది. కానీ ఆమె అనేక కారణాల వల్ల నటించడానికి ఒప్పుకోలేదు. అత్తారింటికి దారేది, రేసుగుర్రం చిత్రాల్లో ఆఫర్లు వచ్చినా మిస్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి కూడా వెనుకాడిన అనసూయ ఇప్పుడు ఎవరి సరసన చేస్తోందన్న విషయం అందరికీ ఆసక్తికరమే. అడవి శేష్ హీరోగా రవికాంత్ దర్శకత్వంలో రానున్న చిత్రానికి ఈ బ్యూటీ ఓకే చెప్పేసింది. స్ర్కిప్ట్ బాగా నచ్చడంతో అంగీకరించాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపింది. ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కాకపోతే ఈ మధ్య కాస్త లావైన అనసూయ వర్కవుట్లు గట్రా చేసి ఏమైనా తగ్గుతుందో.. మరీ అలాగే బొద్దుగుమ్మలాగే నటిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని టాలీవుడ్ టాక్. -
ప్రత్యేక గీతాల్లో నటించను: శ్యామల
ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని టీవీ వ్యాఖ్యాత, నటి శ్యామల అన్నారు. బెస్ట్ యాంకర్ల జాబితాలో తన పేరు ఉండాలన్న కోరికను ఆమె వ్యక్తపరిచారు. లౌక్యం, ఒక లైలా కోసం సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అయితే సినిమాల కోసం టీవీ షోలు వదులుకోబోనని స్పష్టం చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసే అవకాశం వచ్చిన వార్తలపై శ్యామల స్పందించారు. ప్రస్తుతం ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర కావాలన్నదే తన లక్ష్యమన్నారు. కర్ణాటకకు చెందిన శ్యామల తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. అయితే దీనికోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని చెప్పారు. చిన్నప్పుడు పరిషత్ నాటకాల్లో నటించానని వెల్లడించారు. ఓ తెలుగు నాటకంలో ఉత్తమ బాలనటిగా అవార్డు కూడా అందుకున్నానని కూడా తెలిపారు. అభిషేకం, లయ, హ్యేపీ డేస్ సీరియల్స్ లో నటించిన శ్యామలకు 18 ఏళ్ల వయసులో పెళ్లైంది. భర్త, అత్తింటివారు అండగా నిలవడం వల్లే కెరీర్ ఆటంకం లేకుండా ముందుకుసాగుతోందని తెలిపారు. -
ఆ ఛాన్స్ వస్తే వదులుకోను: అనసూయ
మా మహాలక్ష్మి, తడాఖా, కిర్రాక్ వంటి టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనసూయ మరో కొత్త అవతారం ఎత్తబోతోంది. సింగర్ గా ప్రేక్షకులను అలరించాలని ఆమె ఉవ్విళ్లూరుతోంది. ఓ ఫిచర్ సినిమాలో నటించేందుకు సిద్దమైన అనసూయ పాట పాడాలన్న తన కోరికను బయటపెట్టింది. అంతేకాదు తన కోరిక త్వరలోనే తీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తనకున్న ఇష్టాల్లో పాట పాడడం ఒకటని వెల్లడించింది. పాట పాడే అవకాశం ఇవ్వాలని పలువురు సంగీత దర్శకులను కూడా ఆమె సంప్రదించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బృందంతో కలిసి ఇటీవల ఆమె అమెరికాలో పర్యటించింది. ఈ బృందం అమెరికాలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది. తనకు పాట పాడే అవకాశం వస్తే వదులుకోబోనని అనసూయ చెప్పింది. ఎవరో ఒకరు తనకు తప్పకుండా ఛాన్స్ ఇస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. -
వెలుగుచూస్తున్నహర్షవర్ధన్ గ్యాంగ్ ఆగడాలు
-
యాంకర్ హర్షవర్దన్ ముఠా అరాచకాలు
-
టీవీ యాంకర్‌ను మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
సంజీవరెడ్డినగర్: ఓ తెలుగు టీవీ చానల్ యాంకర్‌ను ప్రేమించి మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాకినాడ ఉప్పాడ జంక్షన్‌కు చెందిన మల్లికార్జున్ అలియాస్ అర్జున్ ఇదే ప్రాంతానికి చెందిన అనుశ్రీలు ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. 2009లో నగరానికి వచ్చిన వీరు బోరబండ జనతానగర్‌లో కలిసి ఉంటున్నారు. అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, అనుశ్రీ ఓ చానెల్లో యాంకర్. కొంతకాలంగా అనుశ్రీ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుండగా..అర్జున్ సరియైన సమాధానమివ్వకుండా దాటేవేస్తూ వస్తున్నాడు. కాగా శనివారం తెల్లవారుజామున విశాఖపట్టణంలోని మర్రిపాలెంలో మరో యువతితో వివాహం జరగబోతుండగా..నగర పోలీసులు,అనుశ్రీ వెళ్లి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఓ ఇంట్లో దాక్కున్న ఆయన్ను పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. పోలీసుస్టేషన్‌కొచ్చి తనను పెళ్లి చేసుకోవాలని అనుశ్రీ ఎంత ప్రాధేయపడినా నిరాకరించడంతో పోలీసులు మల్లికార్జున్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడిపై టీవీ యాంకర్ ఫిర్యాదు
హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ప్రియుడిపై ఓ టీవీ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని సహజీవనం కూడా సాగించి చివరకు ముఖం చాటేశాడని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివసిస్తున్న టీవీ యాంకర్ అనుశ్రీ, అర్జున్ అనే యువకుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి సహజీవనం సాగించారు. పెళ్లిచేసుకుంటానని అనుశ్రీకి చెబుతూ వచ్చిన అర్జున్ ఉన్నట్టుండి మాయమయ్యాడు. విశాఖపట్నంలో అతడు శనివారం వేరొక యువతిని పెళ్లాడబోతున్నట్టు తెలుసుకున్న అనుశ్రీ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపనున్నామని ఎస్సై తెలిపారు. -
విడాకులు మంజూరు కాగానే అమృతతో పెళ్లి: దిగ్విజయ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లాగా తాను పిరికివాడిని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అందుకే టీవీ జర్నలిస్టు అమృతారాయ్‌తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని... ధైర్యంగా బహిరంగ పరిచినట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కోగలని వెల్లడించారు. అమృతారాయ్‌కు కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. నరేంద్ర మోడీ చట్టాలను ఉల్లంఘించే వ్యక్తిగా దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా అభివర్ణించారు. అందుకు పోలింగ్ రోజున ఎన్నికల కోడ్‌ను మోడీ ఉల్లంఘించారని దిగ్విజయ్ సోదాహరణగా వివరించారు. పార్లమెంట్లో ఫుడ్ సెక్యూరిటీ బిల్లును కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకించాయని.... అయితే అవే కార్పొరేట్ సంస్థలు మోడీని సమర్థిస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ... 10 ఏళ్లలో తమ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక వృద్ధిరేటు సాధ్యమైందని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. మేడే సందర్భంగా గురువారం హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఐఎన్ టీయుసీ జెండా ఎగరవేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా అమృతారాయ్ తో వివాహం ఎప్పుడు అంటూ విలేకర్ల అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్ పై విధంగా సమాధానం చెప్పారు. -
రాజకీయులకు, యాంకరమ్మలకు లింకేమిటి?
రాజకీయ నాయకులకు టీవీ యాంకర్లకు మధ్య సాన్నిహిత్యం కొత్త కాదు. గతంలోనూ పలువురు రాజకీయ నాయకులు టీవీ యాంకర్లకు మధ్య సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చాయి. చాలా సందర్భాల్లో నాయకులు వీటిని ఖండించారు. కానీ గుసగుసలు మాత్రం ఆగలేదు.కొన్ని ఫేమస్ పొలిటికల్ 'అఫైర్లు' ఇవి శశిథరూర్ - మెహర్ తరార్ - తిరువనంతపురం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కి పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ కి మధ్య సంబంధాలున్నాయని థరూర్ భార్య సునందా పుష్కర్ ఆరోపించారు. ఆమె అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయితే అటు శశి, ఇటు మెహర్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఉమర్ అబ్దుల్లా - నిధి రజ్దాన్ - జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తన భార్యకు విడాకులు ఇవ్వడంతో ఆయనకు , టీవీ యాంకర్ రజ్దాన్ కి మధ్య సంబంధాలున్నాయని, ఆ కారణం వల్లనే ఆయన విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు. సుబోధ్ కాంతి సహాయ్ - రేఖా సహాయ్ - పలు సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఉన్న సుబోధ్ కాంత్ సహాయ్ టీవీ, థియేటర్ సెలబ్రిటీ రేఖా సహాయ్ ను వివాహం చేసుకున్నారు. అమరీందర్ సింగ్ - ఆరూసా ఆలమ్ - పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ కి పాకిస్తానీ జర్నలిస్టు అరూసా ఆలమ్ కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 2004 లో ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆలమ్ పరిచయం అయింది. అప్పట్నుంచి పంజాబీ రాజకీయాల్లో అంతా కమాన్ గుసగుసే....చివరికి ఆమె పంజాబ్ వచ్చి చండీగఢ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ నాకు అమరీందర్ కి స్నేహం తప్ప మరేమీ లేదని ప్రకటించాల్సి వచ్చింది. -
దిగ్విజయ్ కి రెండో పెళ్లి!
ఎన్నికల వేళ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇమేజిని దెబ్బతీసే చిత్రాలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేయడం కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. టీవీ యాంకర్ అమృతారాయ్ తో ఆయనకున్న 'సాన్నిహిత్యాన్ని' ఎత్తి చూపే ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే దిగ్విజయ్ సింగ్ 'అవును ... నిజమే... నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను' అని అంగీకరించేసి పెద్ద కాంట్రవర్సీకి చిన్న ఫుల్ స్టాప్ పెట్టి సరిపుచ్చారు. నాకు అమృతారాయ్ కి సాన్నిహిత్యం ఉంది. ఆమె ప్రస్తుతం భర్తతో విడాకులు తీసుకోబోతుంది. అది జరిగాక నేను ఆమెను వివాహం చేసుకుంటాను' అని దిగ్విజయ్ ట్విట్టర్ లో ప్రకటించారు. అమృతారాయ్ కూడా ఇదే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పుట్టిన కాంట్రవర్సీకి దిగ్విజయ్ సోషల్ మీడియాలోనే ఫుల్ స్టాప్ పలికారు. తమాషా ఏమిటంటే ఇటీవలే నరేంద్ర మోదీ వైవాహిక స్థాయి విషయంలో దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తన భార్యకు న్యాయమైన హక్కును కల్పించలేని మోడీకి వోటేయకండి. ఆయన్ని మహిళలు ఎలా నమ్మగలరు?' అని ఆయన విమర్శించారు. దిగ్విజయ్ భార్య ఆశాసింగ్ గతేడాది క్యాన్సర్ తో మరణించారు.