ప్రియుడిపై టీవీ యాంకర్ ఫిర్యాదు | tv anchor complain against lover | Sakshi
Sakshi News home page

ప్రియుడిపై టీవీ యాంకర్ ఫిర్యాదు

Published Fri, Jun 20 2014 9:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

tv anchor complain against lover

హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ప్రియుడిపై ఓ టీవీ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని సహజీవనం కూడా సాగించి చివరకు ముఖం చాటేశాడని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...

ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో నివసిస్తున్న టీవీ యాంకర్ అనుశ్రీ, అర్జున్ అనే యువకుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి సహజీవనం సాగించారు. పెళ్లిచేసుకుంటానని అనుశ్రీకి చెబుతూ వచ్చిన అర్జున్ ఉన్నట్టుండి మాయమయ్యాడు. విశాఖపట్నంలో అతడు శనివారం వేరొక యువతిని పెళ్లాడబోతున్నట్టు తెలుసుకున్న అనుశ్రీ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపనున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement