sr nagar police station
-
ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతి గొంతు కోసిన సురేష్
-
7 కోట్ల బంగారంతో కార్ డ్రైవర్ పరార్
-
వైఎస్ షర్మిలను విడుదల చేయాలంటూ YSRTP కార్యకర్తల ఆందోళన
-
కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు
సాక్షి, అమీర్‌పేట: కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి..
-
భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ..
సాక్షి, హైదరాబాద్: ఓ భర్త కోసం ఇద్దరు పెళ్లాలు గొడవ పడటం చాలా చూశాం. కానీ ఓ భార్య కోసం ఇద్దరు భర్తలు తగువులాడుకోవడం ఎక్కడైనా చూశారా.. తాజాగా హైదరాబాద్‌లో ముద్దుల భార్య కోసం ఇద్దరు భర్తలు ఎంతకైనా తెగించేందుకు సిద్దమయ్యారు. ఆమెను దక్కించుకునేందుకు పోరాడుతూ.. రోడ్డు మీదకు వచ్చి మరీ కొట్లాడుకున్నారు. చివరకు ఈ ఇద్దరు భర్తల ముద్దుల పెళ్లాం పంచాయితీ మీడియా ముందుకు చేరింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన శశికాంత్‌కు మొదటి భార్య చనిపోవడంతో ఆమె సోదరి దుర్గకు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నాళ్లు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఇటీవల ఫేస్బుక్లో సత్య ప్రసాద్ అనే వ్యక్తితో దుర్గకు పరిచయం ఏర్పడింది. వీరి ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అనంతరం ప్రియుడిని పెళ్లి చేసుకొని అతనితోనే ఉంటుంది. అయితే భార్య కనిపించడం లేదని మొదటి భర్త శశికాంత్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో దుర్గ- సత్య ప్రసాద్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసులు సత్యప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే తాను దుర్గను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, గతంలో ఆమెకు పెళ్లైన విషయం తెలియదని సత్యప్రసాద్ పోలీసులకు తెలిపాడు. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? దీంతో పోలీసులు దుర్గను కూడా విచారించాలనుకోగా.. మూడు నెలల కిందట కనిపించకుండా పోయి మహిళ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. ఆమె మాట్లాడుతూ.. తనకు శశికాంత్‌తో పెళ్లి జరగలేదని సత్యప్రసాద్‌నే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తనకు పిల్లలు లేరంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేగాక భర్తతో కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి దుర్గ మొదటి భర్తతోపాటు పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ వచ్చారు. దుర్గను ఇంటికి రమ్మని అడిగారు. అయితే వాళ్లేవరో తనకు తెలియదంటూ దుర్గ తిట్టిపోసింది. మీడియా ముందే ఆమె ఇద్దరు భర్తలు దుర్గ తనదంటే తనదేనని వాగ్వాదానికి దిగారు. చివరికి. ప్రియుడు సత్య ప్రసాద్తోనే ఉంటానని దుర్గ తేల్చి చెప్పింది. ఇక ఈ కేసును పరిష్కరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. చదవండి: బండి సంజయ్‌కు రిమాండ్.. కరీంనగర్ జైలుకు తరలింపు -
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ రోడ్లో ఏడుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఖుల్నా జిల్లాలోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్ కోలిబా, నహిదా ఖుసుర్దాస్ కోలిబా, కాచి ముషారఫ్ సర్దార్లతో పాటు మరి కొందరు యువతులను అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగ్లాదేశ్ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీలు, నకిలీ ఆధార్ కార్డులు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం) వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని భవానీపూర్‌కు చెందిన కౌసుర్దాస్ నూర్ మహ్మద్, అతని భార్య నహిదా ఖుసుర్దాస్ కోలిబాలు కొన్నేళ్ల క్రితం అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించారు. కొంతకాలం పాటు ముంబైలో గడిపి.. ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చారు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తరలించే ఏజెంట్ అతియార్ మొండల్, వ్యభిచార నిర్వాహకుడు కాచి ముషారఫ్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. చదవండి: (మాదకద్రవ్యాల స్వర్గధామంగా ముంబై?) బంగ్లాదేశ్‌లో పని మనిషులుగా ఉన్న కొందరు యువతులకు అతియార్ మొండాల్ ఇండియాలో మంచి పని, జీతం ఇప్పిస్తాననని మాయమాటలు చెప్పి సనత్‌నగర్‌కు తీసుకొచ్చాడు. ఇక్కడ గ్యాంగ్‌తో కలిసి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ కమిషనర్ డీసీపీ (ఓఎస్డీ) పీ రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే నాగేశ్వర్ రావు, ఎస్ఐ కే శ్రీకాంత్, బీ పరమేశ్వర్, బీ అశోక్ రెడ్డి, జీ శివానందం నిందితులను పట్టుకున్నారు. -
శ్యామ్ కె.నాయుడుతో ప్రాణహాని: నటి శ్రీసుధ
సాక్షి, హైదరాబాద్: సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు శుక్రవారం కంప్లైంట్ రాసిచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులో దాఖలు చేశారని, శ్యామ్ కె.నాయుడును ఇంత వరకు అసలు అరెస్టు కూడా చేయలేదని రెండోసారి తన ఫిర్యాదులో శ్రీసుధ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి.. శ్యామ్ కె.నాయుడిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని బెదిరించారని ఆమె వాపోయారు. గత ఏడాది ఆగస్టు 5న మాదాపూర్‌లోని చిన్నా నివాసానికి తనను పిలిపించి శ్యామ్ కె.నాయుడు, చిన్నా, సాయిరాం మాగంటి తదితరులు బెదిరించడంతోపాటు దూషించారని, శారీరక దాడికి పాల్పడ్డారని తెలిపారు. సినీ పరిశ్రమలో కొనసాగాలంటే తప్పనిసరిగా రాజీ కుదుర్చుకోవాలని, విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. తాను భయంతో అప్పటి నుంచి ముందుకు రాలేదని, ప్రస్తుతం తనకు శ్యామ్ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో ప్రాణహాని ఉన్నందున మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీసుధ తన ఫిర్యాదులో పేర్కొన్న చిన్నా నివాసం మాదాపూర్‌లో ఉండటంతో ఎఆర్‌నగర్ పోలీసులు శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి తదితరులపై జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. ఈ కేసును మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో కరోనా సెకండ్ వేవ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో హైదరాబాద్‌లో సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య సల్పంగా నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నలుగురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. గత జూన్ నెలలో వచ్చిన వారికి మరోసారి పాజిటివ్ రావడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు గ్రేటర్ ఎలక్షన్లలో భాగంగా డ్యూటీలు చేసిన ఎస్ఐలకు, కానిస్టేబుళ్లు, సిబ్బందికి రెండోసారి కోవిడ్ రావడంతో ఆందోళన కలిగిస్తుంది. (చదవండి: 2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది) -
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
-
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై సుమోటో కింద పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది. ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ 505 కింద కేసు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దారుసలాం, పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చివేత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ... ‘ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తాం: సంజయ్) -
ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో గంటకో ఆస్తకరమైన విషయం వెలుగులోకి వస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు, పోలీసుల దర్యాప్తు ద్వారా తాజాగా మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. ఓ వైపు సాయి, మరోవైపు దేవరాజుతో ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. తొలుత శ్రావణి సాయితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే దేవరాజు పరిచయం కావడంతో సాయిని పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. దేవరాజు పరిచయం అయినా కొద్దీ రోజులకే పీకల్లోతు ప్రేమలో శ్రావణి మునిగిపోయింది. ఈ విషయం కాస్తా ఇంట్లో వారికి తెలియడంతో గొడవలు ప్రారంభం అయ్యేయి. అయినా ఎవరికీ తెలియకుండా దేవరాజును కలిసేది. ఈ క్రమంలోనే ఓ రోజు కుటుంబ సభ్యులు, సాయి, శ్రావణికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవలో దేవరాజుపై ఉన్న ప్రేమను కుటుంబ సభ్యులకు వ్యక్తపరిచింది. (శ్రావణి ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు) ఓ వైపు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పటికీ మరో వైపు ఏమి తెలియనట్టుగా దేవరాజుకు కాల్ చేసి జరుగుతున్న గొడవను వినిపించింది. అయితే దేవరాజు తెలివిగా జరుగుతున్న గొడవను ఓ వైపు ఫోన్లో వింటూనే మరోవైపు కాల్ రికార్డ్ చేశాడు. సుమారు అరగంట జరిగిన గొడవను రికార్డ్ చేసి తన ఫోన్లో ఉంచుకున్నాడు. అయితే ఈ గొడవ జరిగిన తరువాత ఏం అయ్యిందో తెలీదు కానీ దేవరాజుకు ఫోన్ చేసిన శ్రావణి తన చావుకు సాయి కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం దేవరాజును అదుపులోకి తీసుకోవడంతో ఆడియో మీడియాకు లీక్ అయింది. ఈ ఆడియో ప్రకారం.. తనను సాయి ఎందుకు కొట్టాల్సి వచ్చిందని తల్లిని శ్రావణి నిలదీసింది. రెస్టారెంట్లో అందరి ముందు కొట్టడం ఎంతవరకు సరైనదని నిలదీసింది. అయితే సాయి బాధితురాలిని ఎందుకు కొట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరితో ప్రమాయణమే శ్రావణి కొంప ముంచిందా అనే అనుమానం కూడా కలుగుతోంది. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్) -
స్వలింగ సంపర్కం.. బ్యాంక్ అధికారి నిర్వాకం
సాక్షి, అమీర్‌పేట(హైదరాబాద్) : స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ ఓ బ్యాంకు అధికారి ఆన్లైన్లో విటుడ్ని బుక్ చేసుకుని న్యూసెన్సు చేశాడు. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు.. వనస్థలిపురం ఆంధ్రాబ్యాంక్ శాఖలో పనిచేసే ఉన్నతాధికారి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. ఆన్లైన్లో చాటింగ్ చేసి ఎస్ఆర్నగర్ సమీపంలోని బస్తీకి చెందిన విటుడ్ని 5 వేలకు బుక్ చేసుకున్నాడు. (చదవండి: కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..) విటుడ్ని కలిసేందుకు ఆ అధికారి ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 3 గంటల సమయంలో బస్తీకి వచ్చాడు. ఓ ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న విటుడి వద్దకు వెళ్లాడు. అతడు వికలాంగుడు కావడంతో నిర్ఘాంతపోయిన బ్యాంకు అధికారి వెనుతిరిగాడు. అయితే డబ్బు ఇవ్వాల్సిందేనని వికలాంగుడు పట్టుబట్టడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దది కావడం, ఇదే సమయంలో మంచినీటి సరఫరా జరుగుతుండంతో నీళ్లు పట్టుకునేందుకు బయటికి వచ్చిన మహిళలు దొంగేమోనని అనుమానించి అధికారిని పట్టుకున్నారు. 100కు డయల్ చేయడంతో పెట్రోలింగ్ సిబ్బందికి అక్కడకు చేరుకుని బస్తీలో న్యూసెన్సుకు పాల్పడ్డ ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 8వ తేదీన బ్యాంకు అధికారితో పాటు విటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రాచకొండలో నకిలీ డాక్టర్ హల్చల్) -
శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి..
-
శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి..
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి గురించి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవరాజ్ టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని ఎంతోమంది యువతులను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్టుగా టిక్‌టాక్ వీడియోల ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ప్లేబాయ్ అవతారం ఎత్తిన దేవరాజ్ ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా తెలుస్తోంది. (శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు’) అదే మాదిరిగా నటి శ్రావణిని కూడా దేవరాజ్ ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపాడు. అయితే తనతో పాటు మరికొంతమంది యువతులతో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే సమయంలో శ్రావణికి సంబంధించిన వీడియో, ఫోటోలను ఆమెకు చూపించిన దేవరాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన ఫోటోలు, వీడియోలు అతడి మొబైల్లో ఉండటంతో ఆమె కంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవరాజ్ శ్రావణిని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో దేవరాజ్‌పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ శ్రావణి, దేవరాజ్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం ) ఈ కేసు విచారణపై ఎస్సార్ నగర్ సీఐ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ సరెండర్ అయ్యాడని, శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రావణి స్నేహితుడు సాయిని కూడా విచారణ చేస్తామని తెలిపారు. ఈ కేసులో ఆడియోలు, టిక్‌టాక్ వీడియోలు , సీసీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నామన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత అశోక్ రెడ్డిని కూడా విచారణ చేపడతామని తెలిపారు. (నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు) -
నటి శ్రీసుధ అవినీతి ఆరోపణల కేసులో పురోగతి
హైదరాబాద్: సినీ నటి సాయి సుధ, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్పై చేసిన అవినీతి ఆరోపణల కేసులో పురోగతి కనిపిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మధ్యవర్తులను విచారిస్తున్నారు. బాపూనగర్‌లో ఉండే రాజేష్ నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించారు. ఇదే కేసులో మరో ప్రముఖ మధ్యవర్తిని కూడా విచారించనున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది. ఇదే కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ తనవద్ద నుంచి లంచం తీసుకున్నట్లు నటి సాయి సుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (సీఐ మురళీకృష్ణపై ఏసీబీకి నటి శ్రీసుధ ఫిర్యాదు) (పెళ్లి పేరుతో మోసం చేశాడు) -
సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణ తన దగ్గర లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)కు ఫిర్యాదు చేశారు. కాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తమ్ముడు శ్యామ్ కే.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నటి సాయి సుధ గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం సీఐ మురళీకృష్ణ తన దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక ఈ కేసులో శ్యామ్ కే నాయుడు తనతో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఆధారాలు సమర్పించారు. (పెళ్లి పేరుతో మోసం చేశాడు) చదవండి: (సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు) -
పౌరసత్వ వివరాలు సేకరించేందుకేమోనని
అమీర్‌పేట: పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చారన్న అనుమానంతో వంట గ్యాస్ విచారణ కోసం వచ్చిన ఓ వ్యక్తిని కొందరు యువకులు చితక్కొట్టారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డలోని ఆదిత్య (హెచ్‌పీ) గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత కొన్ని రోజులుగా గ్యాస్ కనెక్షన్లపై విచారణ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఐదేళ్లు పూర్తయిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కనెక్షన్‌కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌కు చెందిన స్వామి అనే యువకుడు ఉదయం ఎర్రగడ్డ ఫాతిమానగర్‌కు వచ్చాడు. ఓ ఇంట్లోకి వెళ్లి గ్యాస్‌ను పరిశీలించాడు. ఆధార్‌కార్డు చూపించాలని అడగటంతో పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చాడన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఐడీ కార్డు చూపించాలని అడిగారు. స్వామి వద్ద ఉన్న కార్డును చూపించాడు. కార్డుపై ఫోటో అతికించి ఉన్నట్లు కనిపించడంతో మరింత అనుమానం వచ్చి సదరు యువకుడిని కొందరు వ్యక్తులు చితక బాదారు. వారే 100కు డయల్ చేసి అక్కడికి చేరుకున్న పోలీసులకు స్వామిని అప్పగించారు. ఈ సంఘటనకు గల కారణాలపై విచారణ జరిపిన పోలీసులు స్వామి అనే యువకుడు గ్యాస్ కనెక్షన్ల వివరాలు సేకరించేందుకే వచ్చినట్లు నిర్థారించారు. కాగా, గ్యాస్ కనెక్షన్ల విచారణ కోసం నియమించిన వ్యక్తులకు శాశ్వత గుర్తింపు కార్డులు లేని కారణంగా వేరే వ్యక్తుల పేర్లపై ఉన్న ఐడీ కార్డులపై స్వామి ఫొటోను అతికించినట్లు విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్పు, అబేద్ అనే యువకులపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకులు పరారీలో ఉన్నారు. -
ఉల్లిపాయ కోసం గొడవ
హైదరాబాద్: ఉల్లిపాయల కోసం ఆటో డ్రైవర్, పానీ పూరి నిర్వాహకుడి మధ్య జరిగిన వాగ్వివాదం కాస్తా గొడవకు దారితీసింది. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చే సుకుంది. రహమత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న, ఎస్ఆర్నగర్ సమీపం లోని బాపూనగర్‌లో ఉన్న చాట్‌బండార్‌లో పా నీపూరి తిన్నాడు. పానీపూరి తింటూ ఉల్లిపాయ ఎందుకు వేయలేదని వీరన్న ప్రశ్నిం చాడు. ‘ఉల్లిపాయలు వేసేందుకు బిర్యానీకి ఏమైనా ఆర్డర్ ఇచ్చావా’ అంటూ చాట్‌బండార్ నిర్వాహకుడు సర్దార్ పవార్ హేళనగా మాట్లాడాడు. రూ.10 పానీపూరి తిన్న వీరన్న ఉల్లిపాయ వేయనందున డబ్బులు ఇచ్చేది లేదని చెప్పాడు. ఉల్లి ధర పెరిగినందున ఎవరికీ వేయటం లేదని పవార్ బదులిచ్చాడు. పవార్ మాటలు పట్టించుకోకుం డా వీరన్న అక్కడి నుండి వెళ్తుండగా, ఆగ్రహం తో పవార్ వీరన్నపై చేయి చేసుకున్నాడు. దీంతో వీరన్న ఇనుపరాడ్ తీసుకుని పవార్ తల పగుల గొట్టాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య
అమీర్‌పేట: నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటి బయట తాళం వేసి పరారయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అమీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉంటున్నాడు. సోమవారం ఆఫీస్‌కు వెళ్లిన సురేష్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం పనిమనిషి లక్ష్మి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో వెళ్లిపోయింది. సురేష్ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు అతడికి కాల్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. వారు భార్య ఇందిరకు సమాచారం అందించారు. ఆమె కుమార్తెతో కలసి నగరానికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా సురేష్ విగతజీవిగా పడి కనిపించాడు. తల వెనుక, ముఖంపై లోతైన గాయాలు ఉండటాన్ని బట్టి హత్య చేసి.. అనంతరం బయటి నుంచి తాళం వేసి పారిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పోలీసు జాగిలం అపార్ట్‌మెంట్‌పై వరకు వెళ్లి తిరిగి వచ్చింది. శ్రీనివాస్ ఎవరు..? సురేష్ హత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సురేష్ వద్దకు గత 2 నెలల నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కలసి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్ ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. -
మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోస్టేషన్ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఎస్.ఆర్.హోమ్స్‌లో నివసించే హరికాంత్ రెడ్డి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్ వసతి చూసేందుకు ఆదివారంమధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కి అమీర్‌పేట్‌లో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్ మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రోస్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సందర్శించారు. నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... స్టేషన్లను సైతం ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్ కాస్టింగ్ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్లు, వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు. ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అనైతిక సంబంధం, విస్తుగొలిపే విషయాలు
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు యువకుల అనైతిక బంధంతో ...ఓ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. మూడు రోజుల క్రితం ఎస్ఆర్ నగర్‌లోని ఓ హోటల్లో యువకుడి అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని క్రిష్ ఇన్ హోటల్ లాడ్జీలో 4వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొండా శ్రీకాంత్‌రెడ్డి (29) హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయ్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల తన స్వగ్రామానికి వచ్చాడు. గత నెలలో అతడికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని తన స్నేహితుడైన మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం, మూసల్‌పూర్ గ్రామానికి చెందిన డబ్బి నరేశ్‌కు తెలిపాడు. అయితే ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన శ్రీకాంత్‌రెడ్డి, నరేష్ మధ్య అనైతిక సంబంధానికి దారి తీసింది. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య స్వలింగ సంపర్కం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డికి పెళ్లి కుదరటాన్ని నరేశ్ జీర్ణించుకోలేక పోయాడు. నిశ్చితార్థం అనంతరం తిరిగి దుబయ్‌కి బయలుదేరిన శ్రీకాంత్‌రెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరులోని స్వగ్రామం నుంచి నగరానికి వచ్చి నరేశ్‌ను కలుసుకున్నాడు. ఇద్దరు లాడ్జి తీసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ఎందుకు అంగీకరించావని, తనను విడిచి వెళ్లి పోతావా అంటూ నరేశ్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో నరేష్ ఆగ్రహంతో గురువారం మధ్యాహ్న సమయంలో కత్తిలో శ్రీకాంత్‌రెడ్డి గొంతు కోశాడు. అయితే శ్రీకాంత్ మృతి చెందటంతో భయంతో సాయంత్రం నరేశ్ కూడా గొంతు కోసుకోవడంతో రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందడం, నరేష్ అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరడం, ఇద్దరి గొంతులపై కత్తిపోట్లు ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన నరేశ్ శుక్రవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన విషయమై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారుల అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
సీరియల్ నటి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో టీవీ నటి లలిత అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అమీర్‌పేటలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఆమె ఆకస్మికంగా కనపించకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లలితను తీసుకెళ్లినట్టు ఆమె స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లలిత స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం కాగా ఏడాదిగా టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు చానెళ్లలో ప్రసారమయ్యే ప్రేమ, కల్యాణ వైభవం, స్వర్ణ ఖడ్గం అనే సీరియల్స్‌లో నటిస్తోంది. -
పిక్‌పాకెటర్‌పై సూడో పోలీసుల వల
సాక్షి, హైదరాబాద్: అతడో పిక్‌పాకెటర్. బస్సుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు చోరీ చేస్తుంటాడు. ఈ నెల 2న అమీర్‌పేట మైత్రీవనం ఎదురుగా ఉన్న బస్టాప్ ప్రాంతంలో ఉండగా కొంతమంది వచ్చి అతడిని పట్టుకున్నారు. తాము పోలీసులం అని చెప్పి తీసుకెళ్లారు. ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. చివరకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అతడి భార్య నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి విడిచిపెట్టారు. అయితే, తనను తీసుకెళ్లింది పోలీసులు కాదని తెలియడంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధి తుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి సమీప బంధువుతోపాటు పది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన వెంకటయ్య కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డాడు. బస్సుల్లో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీలకు పాల్పడేవాడు. వెంకటయ్యపై పలు పోలీసుస్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. చోరీల ద్వారా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న వెంకటయ్యను చూసి, అతడి సమీప బంధువైన నిజామాబాద్‌కు చెందిన పిట్ల శంకర్‌కు దుర్బుద్ధి పుట్టింది. అతడిని కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా పెద్ద మొత్తం రాబట్టవచ్చంటూ తన స్నేహితులకు చెప్పి పథకం రూపొందించాడు. ఈనెల 2న మైత్రీవనం బస్టాప్ వద్ద ఉన్న వెంకటయ్య వద్దకు తన స్నేహితులను పంపించాడు. తాము పోలీసులమని, కేసు విషయమై విచారణకు రావాలని చెప్పి అతడిని కిడ్నాప్ చేసి, యాదగిరిగుట్టలోని యాదాద్రి గౌడ్ ట్రస్ట్ భవన్ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటరాగేషన్ పేరుతో చిత్ర హింసలకు గురి చేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి హింసించారు. సిగరెట్లు కాల్చి వాతలు కూడా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో శంకర్ బయటకు రాకుండా వెనకాల ఉండి కథ నడిపించాడు. అనంతరం వెంకటయ్య భార్యకు ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇవ్వకుంటే అతడిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తన వద్దనున్న రూ.18 లక్షలతోపాటు 4.5 తులాల బంగారం ఇచ్చేందుకు అంగీకరించింది. కిడ్నాపర్ల సూచన మేరకు భువనగిరికి తీసుకెళ్లి ఓ వ్యక్తికి వాటిని అప్పగించింది. అనంతరం ఈ నెల 4న కిడ్నాపర్లు వెంకటయ్యను విడిచిపెట్టారు. స్నేహితుడికి అనుమానం రావడంతో... ఇంటికి వచ్చిన వెంకటయ్య.. తనను పోలీసులే తీసుకెళ్లారని అనుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. అయితే, ఈనెల 6న వెంకటయ్యను పరామర్శించడానికి వచ్చిన ఓ స్నేహితుడు.. అతడి ఒంటిపై ఉన్న గాయాలు చూసి అనుమానించాడు. పోలీసులు ఇలా చేయరని, ఎక్కడో ఏదో తిరకాసు ఉందని చెప్పాడు. దీంతో వెంకటయ్య ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైత్రీవనం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా కిడ్నాపర్ల కారు నంబర్ గుర్తించారు. దీంతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్లిన పోలీసులు వెంకటయ్య సమీప బంధువు పిట్ల శంకర్ సూత్రధారిగా, అతడి స్నేహితులు పాత్రధారులుగా ఈ కిడ్నాప్ వ్యవహారం సాగినట్లు తెలుసుకున్నారు. శంకర్‌తో పాటు ఇంద్రాల చిరంజీవి, కొల్లి సాయికృష్ణ, రాజారామ్, పిట్ల రవి, అబ్దుల్ హమీద్, పంజాల సాయికృష్ణ, షేక్ అన్వర్, గుర్రం కళ్యాణ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు అజయ్‌కుమార్, మురళీకృష్ణ, బందయ్యలను డీసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. -
‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ !
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో నడి రోడ్డుపై మద్యం మత్తులో పోలీసు అధికారి, మాజీ ఎంపీ తనయులమంటూ ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. దారిన పోయే వారిని అటకాయిస్తూ గొడవకు దిగారు. అమీర్‌పేట కీర్తి అపార్ట్మెంట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్ తాను పనిచేస్తున్న హైటెక్ సిటీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా అడ్డుకొని అగ్గిపెట్టె కావాలని అడగగా... తన వద్ద లేదని చెప్పడంతో దాడి చేశారని తెలిపాడు. ఒకరు తాను ఏసీపీ కుమారుడినని, మరో యువకుడు తాను మాజీ ఎంపీ కొడుకునంటూ కొట్టారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్‌ను అటకాయించిన యువకులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడ కూడా హంగామా చేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోకపోగా ముందుగా వచ్చిన బాధితుడి సెల్ ఫోన్ తీసుకుని అతడిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తరువాత వచ్చిన యువకులని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అశోక్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే రాత్రి జరిగిన సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉండటంతో వాటిని సేకరించిన బాధితుడి స్నేహితులు వాటిని ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రాత్రి రోడ్డుపై గొడవ పడిన వారిలో ఏపీసీ, మాజీ ఎంపీ కుమారులు ఎవరూ లేరని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అది చిన్నపాటి ఘర్షణ కావడంతో అశోక్, రాహుల్ అనే వ్యక్తిపై పెట్టి కేసు నమోదు చేశామన్నారు.