ప్రేమ కోసం ఓ యువకుడు పోలీస్ అవతారమెత్తాడు. సినిమాను తలపించిన ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ : ప్రేమ కోసం ఓ యువకుడు పోలీస్ అవతారమెత్తాడు. సినిమాను తలపించిన ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎంబీఏ చదివిన శ్రీకాంత్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా తాను ఇష్టపడిన అమ్మాయికి నచ్చలేదు. దీంతో పోలీస్ గెటప్‌లో వెళితే, ఆమె ఫ్లాట్ అవుతుందనుకున్నాడు.
అంతే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుపై పోలీసులా పోజిస్తూ ... నెచ్చలి ఎదుట ప్రత్యక్షమైయ్యాడు. పోలీస్ బాస్ అయ్యానంటూ కబుర్లు చెప్పాడు. ఇదంతా ఆమె నమ్మిందో లేదోగానీ .. ఎర్రగడ్డలో ఈ నకిలీ పోలీస్ తతంగాన్ని చూసిన అసలు పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. విషయం ఏంటని ఆరా తీయగా ... అసలు విషయం బయటకొచ్చింది. దాంతో నకిలీ పోలీస్‌ని అరెస్ట్ కేసు నమోదు చేశారు.