సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో గంటకో ఆస్తకరమైన విషయం వెలుగులోకి వస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు, పోలీసుల దర్యాప్తు ద్వారా తాజాగా మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. ఓ వైపు సాయి, మరోవైపు దేవరాజుతో ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. తొలుత శ్రావణి సాయితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే దేవరాజు పరిచయం కావడంతో సాయిని పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. దేవరాజు పరిచయం అయినా కొద్దీ రోజులకే పీకల్లోతు ప్రేమలో శ్రావణి మునిగిపోయింది. ఈ విషయం కాస్తా ఇంట్లో వారికి తెలియడంతో గొడవలు ప్రారంభం అయ్యేయి. అయినా ఎవరికీ తెలియకుండా దేవరాజును కలిసేది. ఈ క్రమంలోనే ఓ రోజు కుటుంబ సభ్యులు, సాయి, శ్రావణికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవలో దేవరాజుపై ఉన్న ప్రేమను కుటుంబ సభ్యులకు వ్యక్తపరిచింది. (శ్రావణి ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు)
ఓ వైపు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పటికీ మరో వైపు ఏమి తెలియనట్టుగా దేవరాజుకు కాల్ చేసి జరుగుతున్న గొడవను వినిపించింది. అయితే దేవరాజు తెలివిగా జరుగుతున్న గొడవను ఓ వైపు ఫోన్‌లో వింటూనే మరోవైపు కాల్ రికార్డ్ చేశాడు. సుమారు అరగంట జరిగిన గొడవను రికార్డ్ చేసి తన ఫోన్‌లో ఉంచుకున్నాడు. అయితే ఈ గొడవ జరిగిన తరువాత ఏం అయ్యిందో తెలీదు కానీ దేవరాజుకు ఫోన్ చేసిన శ్రావణి తన చావుకు సాయి కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం దేవరాజును అదుపులోకి తీసుకోవడంతో ఆడియో మీడియాకు లీక్ అయింది. ఈ ఆడియో ప్రకారం.. తనను సాయి ఎందుకు కొట్టాల్సి వచ్చిందని తల్లిని శ్రావణి నిలదీసింది. రెస్టారెంట్‌లో అందరి ముందు కొట్టడం ఎంతవరకు సరైనదని నిలదీసింది. అయితే సాయి బాధితురాలిని ఎందుకు కొట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరితో ప్రమాయణమే శ్రావణి కొంప ముంచిందా అనే అనుమానం కూడా కలుగుతోంది. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment