Devaraj
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. దేవరాజ్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో నటుడు దేవరాజ్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన గిరిజనుల నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. అతని కుమారుడిగా బాలీవుడ్ నటుడు లావి పజ్నీ నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజైన ఈ పోస్టర్లపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. Introducing #Devaraj in the #Kannappa🏹 hailing from the Nilipala Hills, Mundadu and @iamlavipajni as his son #Bebbuli is ready to unleash a new wave of strength and fierce spirit 🔥#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar… pic.twitter.com/viVdUCKEny— Kannappa The Movie (@kannappamovie) August 5, 2024 -
సీనియర్ నటుడి కుమారుడు హీరోగా కొత్త చిత్రం!
ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్‌పై మొదటి చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా.. దేవరాజ్ కెమరా స్విఛ్ ఆన్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. 'సినిమా అంటే చాలా ప్యాషన్ ఉండాలి. హరి క్రియేషన్స్ బ్యానర్‌ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. దేవరాజు ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ల అబ్బాయి ప్రణం దేవరాజ్ ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. శంకర్ చాలా ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్‌కు ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ పరిసర తెరకెక్కించనున్నాం' అని తెలిపారు. హీరో ప్రణం మాట్లాడుతూ.. 'ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి' అని కోరారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
అనుమానాలు వీడని అంబేడ్కర్ మరణం
బాబా సాహెబ్ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 1956, అక్టోబర్ 14న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనుక,వారంతా బౌద్ధులు గనుక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగ పూర్‌ను ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. అంతే గాని, నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనుక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే,ఆ తర్వాత 52 రోజులకే (డిసెంబర్ 6) అంబేడ్కర్ కన్ను మూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందనీ, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరో పణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొన్న వర్గాలు గానీ ఆధారాలు, వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మన సుల్లో సజీవంగా ఉన్నాయి. ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్. పెరియార్ తన వార్తా పత్రిక ‘విడుదలై’లో ఇలా రాశారు. ‘డాక్టర్ అంబే డ్కర్ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేడ్కర్ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే – గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేడ్కర్ మరణాకి కూడా కారకులని! అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆ రోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ‘తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని’ స్వయానా అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేడ్కర్ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేడ్కర్ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయింది. ‘తన తండ్రిది సహజ మరణం కాదనీ, హత్య అనీ – దోషులెవరో తేల్చాలనీ – అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ నాటి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ మరణం తర్వాత పదకొండవ రోజున, ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నాటి ప్రధాని, రాష్ట్ర పతులకు లిఖితపూర్వక నివేదికలు, విన్నపాలు అంద జేశారు. అంబేడ్కర్ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. నాటి ప్రధాని నెహ్రూ స్పందించి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల ముందుపెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడినట్ట య్యేది కదా! ఢిల్లీ పోలీస్ ఐజీ ఇచ్చిన వివరణను మాత్రం 1957 నవంబర్ 27 నాడు – అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌తో పార్లమెంట్లో ఒక ప్రకటనగా ఇప్పించారు. ‘అంబేడ్కర్ మరణం సహజమైందని’– ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు ఆనాడే భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. ఆనాటి నుండి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్త కాలు ప్రచురింప బడుతూనే ఉన్నాయి. అసహనం, అసంతృప్తి ఏదోరకంగా బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మధ్యే 2021 జనవరి 26 నాడు నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు – అంబేడ్కర్ ఎలా చని పోయారో తేటతెల్లం చేయాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నా రంటే... ఆ తేదీన అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక! వారి పాత్ర లేకపోతే జనం వెళ్ళి వారి కార్యాలయం ముందు ఎందుకు నిరసన ప్రదర్శనలిస్తారూ? అర్థం చేసుకోవా ల్సిన విషయం! నెహ్రూజీ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోష లిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అప్పుడు వీరి ఆటలు అంతగా సాగలేదు. అయినా, వారి లక్ష్యసాధనకు వారు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం! అంబేడ్కర్‌ది సహజ మరణమా? లేక హత్యా అనేది ఆరోజుల్లో బయటికి రాలేదు. 67 ఏళ్ళ తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు బయటికి వస్తుందన్న నమ్మకం లేదు గానీ – గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి తెలియజేయడం అవసరం అనిపించింది. అయితే,బాబా సాహెబ్ అర్ధంతరంగా వదిలేసిన కర్తవ్యాలనూ, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధననూ ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండా ల్సిందే! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్‌లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
'ఆయన విలన్‌గానే ఫేమస్.. కానీ ఆ విషయం కొద్దిమందికే తెలుసు'
నటుడు దేవరాజ్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగులో ఆయనను గుర్తు పట్టని వారు ఉండరు. దాదాపు 38 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. తెలుగులో భరతనారి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. వెండితెరపై విలన్‌గా కనిపించిన దేవరాజ్.. కన్నడ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపుగా 200 పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపించారు. ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్పీ పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవరాజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేవరాజ్ మాట్లాడుతూ.. 'నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చా. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ పాలవ్యాపారం చేస్తూ పెంచింది. నేను చదివేటప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అప్పుడు ఓ కంపెనీలో జాబ్‌లో చేరా. జాబ్ చేస్తుండగానే సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కావాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి. అప్పుడు సినిమాల్లో పరిస్థితులు వేరు. నా భార్య చంద్రలేఖ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అలా ఓ సినిమాకు హీరోయిన్ను చూడడానికి వెళ్లా. ఆ రోజు చంద్రలేఖను చూడగానే నచ్చేసింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి జరిగాయి. కూడా నా చిన్న కుమారుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక సినిమా చేశాడు. అందుకే పెద్దోడు కూడా సినిమాల్లోకి వచ్చాడు. అప్పట్లో కన్నడలో ఎందుకు మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే కాంతార, కేజీఎఫ్ సినిమాలతో ఆ పరిస్థితి మారిపోయింది. ఆ విషయంలో నాకు గర్వంగా ఉంది. టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్‌కు వాళ్ల తాత టాలెంట్ వచ్చింది. అల్లు అర్జున్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. దేవరాజ్ ఇంటిని చూస్తే అచ్చం ఒక కోటలాగే ఉంటుంది. ఆయనకు మైసూర్లోనూ సినిమా ఇండస్ట్రీలో ఆయన అందుకున్న అవార్డులను, ఫ్యామిలీ ఫోటోలు వారి ఇంట్లో అద్భుతంగా అలంకరించారు. కన్నడ నటి చంద్రలేఖను వివాహం చేసుకున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం దేవరాజ్ తనయుడు ప్రణమ్ హీరోగా నటిస్తున్నారు. సాయి శివం జంపాన దర్శకత్వంసో వైరం సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో మోనాల్ హీరోయిన్. యువాన్స్ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు. -
హీరోగా నటుడు దేవరాజ్ తనయుడు.. వైరం టీజర్ చూశారా?
నటుడు దేవరాజ్ తనయుడు ప్రణమ్ దేవరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోనాల్ హీరోయిన్. యువాన్స్ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు. నటులు దేవరాజ్, చంద్ర దేవరాజ్ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, నటులు బెనర్జీ, కాశీ విశ్వనాథ్ ‘వైరం’ టీజర్‌ను విడుదల చేశారు. దేవరాజ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించారు. హీరోగా వస్తున్న నా కుమారుడు ప్రణమ్ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు జె. మల్లికార్జున. ‘‘ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు సాయి శివన్ జంపాన. ఈ చిత్రానికి సహనిర్మాత: శీలం త్రివిక్రమ్ రావు, అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సామల భాస్కర్. What you have seen in the teaser was just a glimpse only, the movie will be 100 times more than the glimpse. -Hero @PranamDevaraj Speech at #Vairam Teaser Launch Event✨ ▶️https://t.co/wNlndVpfgL@Saishivan3 @GarudaRaam @ActorBhadram @monal_jagtani @ShatruActor @MaddipatiVinnu… https://t.co/BEfTd7Qets pic.twitter.com/pUHSLrqEpB — YouWe Media (@MediaYouwe) March 17, 2023 -
పూట గడవని స్థితి, చచ్చిపోవాలనుంది: ఏడ్చేసిన సినిమాటోగ్రాఫర్
సినిమాను అద్భుతంగా తీయడానికి కెమెరామన్స్ ఎంతగానో కష్టపడుతారు. తెర వెనక వారి జీవితాల్లోనూ అంతే కష్టం దాగుటుంది. అందుకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి. దేవరాజ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు. ఛాలెంజ్ రాముడు, లాయర్ విశ్వనాథ్, పులి-బెబ్బులి, ఖైదీ కాళిదాస్, భలే తమ్ముడు, సింహ గర్జన.. ఇలా దాదాపు 300 సినిమాలకు పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేసుకుంటూ పోయిన ఆయన ప్రస్తుతం దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. 'నా తండ్రి శ్రీధర్ పెద్ద కెమెరామన్. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పని చేశారు. నేనీ వృత్తిలోకి రాకూడదనుకున్నాను. కానీ ఆయన మరణంతో ఇంట్లో 12 మందిని పోషించాల్సిన బాధ్యత నామీద పడింది. తప్పని పరిస్థితిలో సినిమాటోగ్రాఫర్‌గా మారాను. కష్టపడి పని చేశా.. పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను. ఎంతోమందికి సాయం చేసిన నేను ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో సాయం కోసం అర్థిస్తున్నాను. పూట గడవడం కూడా కష్టమవుతోంది. నా స్నేహితుడు రజనీకాంత్ నెలకు రూ.5000 పంపిస్తాడు. మురళీ మోహన్ టాబ్లెట్ల కోసం మూడు వేలు పంపిస్తాడు. సినిమాల్లో జయప్రద, ప్రభ, విజయశాంతి.. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులను సినిమాలకు రికమెండ్ చేశాను. కానీ వారెవరూ సాయానికి ముందుకు రావడం లేదు. ఇంటి అద్దె రూ.8 వేలు. అది కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నాకు ఆపరేషన్ చేయాలంటే ఏడు లక్షల దాకా అవుతుంది. నాకంత స్థోమత లేదు. ఎందుకు బతికున్నానో తెలీదు, చచ్చిపోవాలనుంది' అంటూ కన్నీటిపర్యంతమయ్యారు దేవరాజ్. చదవండి: అందుకే మెడలో మంగళసూత్రం ధరిస్తా: సింగర్ -
శ్రావణి కేసు: కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో నిందితులైన దేవరాజ్, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణి 2012లో టీవీల్లో పనిచేయాలని హైదరాబాద్‌కి వచ్చింది. 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిర్మాత అశోక్ రెడ్డి పరిచయం అయ్యారు. 2019లో దేవరాజ్ రెడ్డి పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటామని వేధించారు. అదే క్రమంలో దేవరాజ్‌తో దూరంగా ఉండలాని సాయికృష్ణ పలు సందర్భాల్లో శ్రావణితో గొడవ పడ్డాడు. (శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత) దేవరాజ్‌తో చనువుగా ఉండటం నచ్చని శ్రావణి తల్లి తండ్రులు, సాయి అతనితో మాట్లాడకూడదని వేధించారు. శ్రావణిని సాయి, ఆమె తల్లిదండ్రులు కొట్టారని దేవరాజ్ చెప్పాడు. అనేక సార్లు సాయి తన దగ్గర ఉన్న ఫోటోలతో శ్రావణిని బెదిరించాడు. అయితే దేవరాజ్ కూడా పెళ్లి చేసుకుంటనని చెప్పి మోసం చేసాడు. అంతకుముందే దేవరాజ్‌పై శ్రావణి కేస్ పెట్టింది. కాగా శ్రావణికి వేరే వాళ్లతో సంబంధాలు ఉండటంతో దేవరాజ్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఏ1గా సాయి కృష్ణారెడ్డి, ఏ2 అశోక్ రెడ్డి, ఏ3 దేవరాజ్ రెడ్డిలుగా గుర్తించాం. వీరిలో ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డిలను అరెస్టు చేశాం. ఆర్ఎక్స్-100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. అతనిని అరెస్ట్ చేయాల్సి ఉంది' అని డీసీపీ తెలిపారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) -
శ్రావణి కేసు: పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ల నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కోవిడ్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్ అరెస్ట్) మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది. ఇక శని, ఆదివారాల్లో కొనసాగిన విచారణలో నిందితులు కీలక అంశాలను రాబట్టారు. దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపులకు పాల్పడటం మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేవరాజ్, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్) -
మరో ట్విస్ట్: దేవరాజ్ తల్లికి శ్రావణి ఫోన్
సాక్షి, హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే దేవరాజ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు, ఆదివారం శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుడు సాయిని కూడా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రావణి, దేవరాజ్ తల్లి సత్యవతికి కాల్చేసిన ఓ ఆడియో లీకైంది. దీనిలో శ్రావణి-సత్యవతి పలు కీలక అంశాలపై చర్చించారు. దేవరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమైన, అతనితో తన వివాహం జరిపించాలని సత్యవతిని శ్రావణి వేడుకుంది. అంతేకాకుండా కట్నకానుకలతో పాటు పెళ్లి ఖర్చంతా తానే బరిస్తానని కూడా చెప్పింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దేవరాజ్‌పై పెట్టిన కేసు గురించి సత్యవతి ప్రశ్నించింది. మొదట కేసును ఉపసంహించుకోవాలని ఆమె శ్రావణిని కోరింది. (‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’) దానికి సరే అన్న శ్రావణి మీరు ఓకే అంటే కేసు విత్‌డ్రా చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటామని చెప్పింది. తాము ఇద్దం వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటామని సత్యవతిని బతిమిలాడింది. అయితే పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలక కానుంది. కాగా ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ వచ్చిన శ్రావణి కుటుంబ సభ్యులు, సాయిలను ఎస్ఆర్నగర్ పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు వీరిద్దరి వేధింపుల మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. (గువ్వల్ని మింగుతున్న గద్దలు). , కొనసాగుతున్న కీలక విచారణ శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఆదివారం సాయి పోలీసులు ముందు విచారణకు హాజరైయ్యాడు. దేవరాజు, సాయి కృష్ణను ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్న నేపథ్యంలో నేటి విచారనే కీలకం కానుంది. కేసు విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న కేసు నుండి తప్పించు కొనేందుకే దేవరాజ్ మరోసారి శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. మరోవైపు సాయి వేధింపులు వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వాదిస్తున్నాడు. అయితే ఇద్దరిని విచారిస్తున్న నేపథ్యంలో కేసు నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
శ్రావణి : రోజుకో మలుపు.. గంటకో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు.. కానీ కేసు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడిని అని చెప్పుకున్న సాయి మెడకు ఉచ్చు బిగుస్తోంది. దేవరాజ్ అందించిన సాక్ష్యాలు కేసును కీలక దశకు తీసుకువెళ్లింది. సాయి, అశోక్ రెడ్డిల విచారణ తరువాత కేసులో అరెస్ట్ పర్వం కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు సినిమాలా ఉంది శ్రావణి కేసు. మూడు రోజులుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో ట్విస్ట్ లమీద ట్విస్టులు బయటపడుతున్నాయి. మొదటి రెండు రోజులు దేవరాజ్ చుట్టూ తిరిగితే ముచ్చటగా మూడో రోజు సాయి వైపు మళ్లింది. పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవరాజ్ ఈ కేసులో పోలీసులకు చాలా కీలకమైన సాక్ష్యాలు అందించాడు. హోటల్ లో గొడవ జరిగిన రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా శ్రావణిపై సాయి దాడి చేసిన సీసీ ఫుటేజ్ బయటపడింది. ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్లో శ్రావణిని దేవరాజ్‌ను కలిసేందుకు రాగా.. అక్కడే ఉన్న సాయి శ్రావణిపై దాడికి పాల్పడ్డాడు. అయితే శ్రావణి ఆత్మహత్య కేసులో ఈ సీసీ ఫుటేజ్ కీలకం కానుంది. ప్రస్తుతం విచారణలో భాగంగా పోలీసులు ఆ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య కు ముందు రోజు శ్రావణి సాయి ల మధ్య జరిగిన వివాదం కూడా విచారణలో కీలకం కానుంది. మరోవైపు సాయి, దేవ్ రాజ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటికొచ్చింది. ఆ ఆడియోలో శ్రావణి కోసం వీరిద్దరు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు, సాయి కలిసి శ్రావణి బెదిరిస్తున్న సమయంలో దేవరాజ్ ఆ ఆడియోను రికార్డు చేశాడు. (ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..) సాయి, దేవ్ రాజ్ మధ్య సంభాషణ దేవ్ రాజ్.. సాయి నీ వళ్లే ఈ సమస్యలన్నీ శ్రావణికి నేను కావాలి ఇది ఫైనల్ నువ్ శ్రావణిని సపోర్ట్ చేసేవాడివైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు కామ్ గా ఉన్న ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కేలా చేశావ్ శ్రావణికి నేను కావాలి ఇది ఫైనల్ నువ్ శ్రావణిని సపోర్ట్ చేసేవాడివైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు సాయి : ఐదేళ్లుగా నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటే నువ్ ఇప్పుడు వచ్చావు ఆ అమ్మాయి నన్ను కూడా ప్రేమించింది దేవ్ రాజ్ : ఇప్పుడే ఆ అమ్మాయిని అడుగు ఎవరిని లవ్ చేస్తుందో?? శ్రావణి నువ్ ఎవరిని లవ్ చేస్తున్నావ్?? నన్ను లవ్ చేస్తున్నావా లేదా?? శ్రావణి : చేస్తున్న దేవ్ రాజ్ : సాయి నువ్ ఇప్పటికైనా మధ్యలో ఉండి డ్రామా చేయకు ఇప్పటికైనా ఆ అమ్నాయి కి ఎవరు కావాలంటే వారికే ఇచ్చి చేయండి గొడవలు అవసరం లేదు.. సైలెంట్ గా ఉండు.. శ్రావణి ఇష్టప్రకారం జరగని శ్రావణి తమ్ముడు శివ్‌తో దేవ్ రాజ్ ఇప్పటికైనా మీ శ్రావణికి ఏం కావాలో అది చెయ్యు సాయి కుట్రల వల్ల ఇదంతా జరుగుతుంది నువ్వు మీ అక్క తీసుకుని రా.. మీ అక్క మనసులో ఏం ఉందో నిరుపిస్తా.. మిమ్మల్ని ఎవరు చెడగొడుతున్నారో నిరూపిస్తా.. అయితే శ్రీ కన్య హోటల్ కి వెళ్లిన పోలీసులు సిసి ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో దేవరాజ్ పై దాడి, శ్రావణిపై చేయి చేసుకున్న వ్యవహారం స్పష్టంగా ఉంది. అంతేకాదు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి తో సహజీవనం కోసం సాయి శ్రావణిని విఫరితంగా వేధించినట్లు తెలిసింది. అందుకే అడ్డుగా ఉన్న దేవరాజ్ ని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేశాడు సాయి అని తెలుస్తోంది. శ్రావణి దేవరాజ్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సాయి ఒక ఆడియో టేప్ బయట పెట్టాడు. అయితే ఆ వేధింపుల వ్యవహారంలోనే దేవరాజ్ ని గతంలో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సాయి బయట పెట్టిన ఆడియో పాతదిగ గుర్తించారు. కేసు తరువాత కూడా శ్రావణి దేవరాజ్ ని ప్రేమిస్తూనే ఉంది. టిక్ టాక్ ద్వారా దేవరాజ్ బర్త్ డే రోజు శ్రావణి ప్రపోజ్ చేసింది. వీరి కలయిక నచ్చక సాయి శ్రావణిని వేధించినట్లు దర్యాప్తులో తేలింది. నలుగురిలో కొట్టడం, ఈ విషయం ఇంట్లో చెప్పి గొడవలు రేకెత్తించడంతో శ్రావణి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సాయి ని, నిర్మాత అశోక్ రెడ్డి ని కూడా విచారిస్తే అసలు సూత్రధారులు ఎవరు అని తేలిపోతుంది. మూడు రోజుల దర్యాప్తులో హోటల్ లో సాయి దాడి, ఇంట్లో వారి గొడవే కారణమని కేసు ఓ కొలిక్కి వచ్చింది. సాయి, అలాగే శ్రావణి ఆత్మహత్య జరిగిన రోజు సాయి దేవ్ రాజ్ శ్రావణి కోసం గొడవపడిన ఆడియో సైతం బయటపడింది. దీంట్లో శ్రావణి దేవ్ రాజ్ ను ప్రేమిస్తున్నట్లు సాయి ఎదుటే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఉజ్వల భవిష్యత్తుతో కొనసాగాల్సిన శ్రావణి జీవితం చివరకు విషాదంగా మిగిలింది. సాయి దేవ రాజుల మధ్య నలిగిపోయి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కేసులో ప్రధానంగా శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి ఒత్తిడి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు దేవరాజ్ పోలీసులకిచ్చిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేసులో ఇంకా సాయిని అలాగే నిర్మాత అశోక్ రెడ్డి ని శ్రావణి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించాల్సి ఉంది. ఈ విచారణ అనంతరం ఈ కేసులో అసలు నేరస్తుడిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. -
ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో గంటకో ఆస్తకరమైన విషయం వెలుగులోకి వస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు, పోలీసుల దర్యాప్తు ద్వారా తాజాగా మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. ఓ వైపు సాయి, మరోవైపు దేవరాజుతో ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. తొలుత శ్రావణి సాయితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే దేవరాజు పరిచయం కావడంతో సాయిని పక్కకు పెట్టే ప్రయత్నం చేసింది. దేవరాజు పరిచయం అయినా కొద్దీ రోజులకే పీకల్లోతు ప్రేమలో శ్రావణి మునిగిపోయింది. ఈ విషయం కాస్తా ఇంట్లో వారికి తెలియడంతో గొడవలు ప్రారంభం అయ్యేయి. అయినా ఎవరికీ తెలియకుండా దేవరాజును కలిసేది. ఈ క్రమంలోనే ఓ రోజు కుటుంబ సభ్యులు, సాయి, శ్రావణికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవలో దేవరాజుపై ఉన్న ప్రేమను కుటుంబ సభ్యులకు వ్యక్తపరిచింది. (శ్రావణి ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు) ఓ వైపు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పటికీ మరో వైపు ఏమి తెలియనట్టుగా దేవరాజుకు కాల్ చేసి జరుగుతున్న గొడవను వినిపించింది. అయితే దేవరాజు తెలివిగా జరుగుతున్న గొడవను ఓ వైపు ఫోన్లో వింటూనే మరోవైపు కాల్ రికార్డ్ చేశాడు. సుమారు అరగంట జరిగిన గొడవను రికార్డ్ చేసి తన ఫోన్లో ఉంచుకున్నాడు. అయితే ఈ గొడవ జరిగిన తరువాత ఏం అయ్యిందో తెలీదు కానీ దేవరాజుకు ఫోన్ చేసిన శ్రావణి తన చావుకు సాయి కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం దేవరాజును అదుపులోకి తీసుకోవడంతో ఆడియో మీడియాకు లీక్ అయింది. ఈ ఆడియో ప్రకారం.. తనను సాయి ఎందుకు కొట్టాల్సి వచ్చిందని తల్లిని శ్రావణి నిలదీసింది. రెస్టారెంట్లో అందరి ముందు కొట్టడం ఎంతవరకు సరైనదని నిలదీసింది. అయితే సాయి బాధితురాలిని ఎందుకు కొట్టాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరితో ప్రమాయణమే శ్రావణి కొంప ముంచిందా అనే అనుమానం కూడా కలుగుతోంది. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్) -
అతనికి ఉద్యోగమివ్వండి
కడప స్పోర్ట్స్: కడప నగరానికి చెందిన పి. దేవరాజ్ దీనస్థితిపై ‘జాలి వద్దు.. జాబు కావాలి’ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ వికలాంగ క్రీడాకారుడి వివరాలను సేకరించి.. ఆయన డేటాను ఏపీ ఔవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో అప్లోడ్ చేసి ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఉపాధికల్పనాధికారికి ఆదేశాలు జారీ చేశారు. తో జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం. దీప్తి ‘సాక్షి’ నెట్వర్క్ ద్వారా దేవరాజ్ వివరాలను తెప్పించుకోవడంతో పాటు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఆయన అనంతపురంలో నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఉన్న నేపథ్యంలో బుధ లేదా గురువారాల్లో వచ్చి కార్యాలయంలో కలవాలని దేవరాజ్‌ను కోరారు. ఆయన మ్యాచ్ అనంతరం కడపకు బయలుదేరి రానున్నట్లు ఆయన ‘సాక్షి’ తెలిపారు. తన దీనగాథ జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం పట్ల సాక్షికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
బ్యాట్ పట్టిన చేతితో దోశలు వేస్తున్నాడు
తిరుపాపులి దేవరాజ్... దివ్యాంగుల క్రికెట్లో ఈయన పేరు తెలియని వారుండరు.. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూరాణిస్తున్నాడు.. జీవనపోరాటంలో విజయం సాధించలేక.. నమ్ముకున్న కుటుంబాన్ని పోషించుకునేందుకు బ్యాట్ పట్టిన చేతితో దోశలు.. బౌలింగ్ వేసిన చేత్తో వడలు వేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు.. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సాయమందించాలని వేడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎందరో అధికారుల చుట్టూ తిరిగానని.. నన్ను చూసి జాలిపడి..డబ్బులిచ్చి పంపేయత్నం చేస్తున్నారే తప్ప.. కుటుంబపోషణకు అవసరమైన ఉద్యోగమిచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదంటున్నాడు.. ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు. కడప స్పోర్ట్స్ : కడప నగరం రామాంజనేయపురానికి చెందిన తిరుపాపులి దేవరాజ్‌కు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. 2–3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే పాము కాటేసింది.. ఆ సమయంలో నాటు వైద్యం చేశారు. ఇది వికటించడంతో ఎడమకాలు చచ్చుబడింది. ఫలితంగా అవిటిగా మారాడు... తోటి వారందరూ ఆడుకోవడం చూసిన తనకు ఇష్టమైన క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కొందరు నువ్వు కుంటివాడివి.. క్రికెట్‌కు పనికిరావని అన్నారు.. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఆడటం ప్రారంభించాడు. 1993–94 సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నప్పుడు వికలాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాడు. ఎంపికలకు వెళ్లాడు. ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఏపీ జట్టుకు ఎంపికయ్యాడు. రాజస్తాన్‌లో నిర్వహించిన జాతీయస్థాయి వికలాంగుల క్రికెట్‌లోరాణించడంతో పాటు బెస్ట్ బౌలర్‌గా అవార్డు పొందాడు. అప్పటి నుంచి ప్రారంభమైన దేవరాజ్ ప్రస్థానం ఎందరో వికలాంగ క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచింది. శివకోటి లాంటి వారు జిల్లా నుంచి జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించడానికి స్ఫూర్తయింది.ఈయనతో పాటు మరికొందరు కలిసి దివ్యాంగుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపుకోసం శ్రమించారు. ఇప్పటి వరకు దీనికి బీసీసీఐ గుర్తింపు లభించనప్పటికీ దివ్యాంగుల క్రికెట్‌ను రానున్న రోజుల్లో బీసీసీఐలో విలీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా వీరి సంఘానికి చేయూతనిచ్చే దిశగా చర్యలు చేపట్టింది. 40 సంవత్సరాలు వయసు కలిగిన ఈయన ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో నిర్వహించనున్న నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈయన ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆయన అనంతపురం పయనమయ్యాడు. పొట్టకూటి కోసం.. బీసీసీఐ గుర్తింపు వికలాంగుల క్రికెట్‌కు లేకపోవడంతో ఈయనకు ఎన్నో అవార్డులు, సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ అవేవీ స్పోర్ట్స్‌కోటా పరిధిలోకి రావు. అదే ఇతనికి శాపంగా మారింది. పదో తరగతి వరకు చదివిన ఏదైనా చిరుద్యోగమైనా కల్పించాలని గతంలో ఎందరో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాడు. వారు ఈయన పరిస్థితిని చూసి జాలి పడి తాత్కాలికంగా ఎంతో సాయం చేసి తర్వాత చూద్దామని పంపించారే తప్ప కుటుంబపోషణకు శాశ్వత ఆధారమయ్యే ఉద్యోగ అవకాశం కల్పించలేదు. దీంతో పాటు ఇతని తల్లికి కూడా వైకల్యం ఉంది. కుటుంబపోషణ కూడా దేవరాజ్‌పైనే పడింది. భార్య, ఇద్దరు పిల్లలు తోడయ్యారు. పోషణ మరింత భారమైంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఓ వైపు సంసారాన్ని మరోవైపు నెట్టుకొచ్చేందుకు దోశల కొట్టును నడపుతున్నాడు. దోశలు, వడలు వేసుకుంటూ వచ్చిన దాంట్లో పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సారూ.. నేను పదోతరగతి పాసయ్యను. వైకల్యం ఉన్నప్పటికీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ప్రతిభ కనబరిచా. అర్హతకు తగిన చిన్న ఉద్యోగమైనా ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని ఎన్నో మార్లు అధికారుల చుట్టూ తిరిగాను. జాలి చూపించి.. ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. బతుకు తెరువు కోసం దోశలు వేసుకుంటున్నాను. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరుద్యోగమైనా ఇప్పించి న్యాయం చేయాలి. – పి. దేవరాజ్, క్రికెటర్, కడప -
సౌదీలో ప్రమాదం..సిరిసిల్ల యువకుడి మృతి
కోనరావుపేట(రాజన్నసిరిసిల్ల): గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కులేరు దేవరాజు(35) 20 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడి బల్దియా కంపెనీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ ఉదయం విధులకు వెళ్తుండగా సల్వా ప్రాంతంలో వాహనం ఢీకొట్టింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, తోటివారు కుటుంబీకుల ఆలస్యంగా సమాచారాన్ని అందించారు. దేవరాజు మృతదేహాన్ని ఇంటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు వారికి హామీ ఇచ్చారు. మృతునికి భార్య స్వప్న, ఏడాదిన్నర కుమారుడు, తండ్రి రాజయ్య ఉన్నారు.