నటుడు దేవరాజ్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగులో ఆయనను గుర్తు పట్టని వారు ఉండరు. దాదాపు 38 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. తెలుగులో భరతనారి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. వెండితెరపై విలన్‌గా కనిపించిన దేవరాజ్.. కన్నడ సినిమాల్లో హీరోగా కూడా నటించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపుగా 200 పైగా సినిమాల్లో నటించారు.
తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపించారు. ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్పీ పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవరాజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దేవరాజ్ మాట్లాడుతూ.. 'నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చా. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ పాలవ్యాపారం చేస్తూ పెంచింది. నేను చదివేటప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అప్పుడు ఓ కంపెనీలో జాబ్‌లో చేరా. జాబ్ చేస్తుండగానే సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఈ ఫీల్డ్‌లో సక్సెస్ కావాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి. అప్పుడు సినిమాల్లో పరిస్థితులు వేరు. నా భార్య చంద్రలేఖ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అలా ఓ సినిమాకు హీరోయిన్‌ను చూడడానికి వెళ్లా. ఆ రోజు చంద్రలేఖను చూడగానే నచ్చేసింది. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి జరిగాయి. కూడా నా చిన్న కుమారుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక సినిమా చేశాడు. అందుకే పెద్దోడు కూడా సినిమాల్లోకి వచ్చాడు. అప్పట్లో కన్నడలో ఎందుకు మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే కాంతార, కేజీఎఫ్ సినిమాలతో ఆ పరిస్థితి మారిపోయింది. ఆ విషయంలో నాకు గర్వంగా ఉంది. టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు వాళ్ల తాత టాలెంట్ వచ్చింది. అల్లు అర్జున్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చారు.
కాగా.. దేవరాజ్ ఇంటిని చూస్తే అచ్చం ఒక కోటలాగే ఉంటుంది. ఆయనకు మైసూర్‌లోనూ సినిమా ఇండస్ట్రీలో ఆయన అందుకున్న అవార్డులను, ఫ్యామిలీ ఫోటోలు వారి ఇంట్లో అద్భుతంగా అలంకరించారు. కన్నడ నటి చంద్రలేఖను వివాహం చేసుకున్నారు. దేవరాజ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం దేవరాజ్ తనయుడు ప్రణమ్ హీరోగా నటిస్తున్నారు. సాయి శివం జంపాన దర్శకత్వంసో వైరం సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో మోనాల్ హీరోయిన్. యువాన్స్ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment