'యశ్‌' బర్త్‌డే స్పెషల్‌.. 'టాక్సిక్‌' నుంచి అదిరిపోయే వీడియో | Rocking Star Yash Birthday Peek Video From Toxic Movie Out Now | Sakshi
Sakshi News home page

'యశ్‌' బర్త్‌డే స్పెషల్‌.. 'టాక్సిక్‌' నుంచి అదిరిపోయే వీడియో

Published Wed, Jan 8 2025 11:11 AM | Last Updated on Wed, Jan 8 2025 12:22 PM

 Rocking Star Yash Birthday Peek Video From Toxic Movie Out Now

కన్నడ స్టార్‌ హీరో యశ్‌ (Yash) నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’ (Toxic Movie). కేజీఎఫ్‌ సిరీస్‌ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్‌ తాజాగా యశ్‌ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను పంచుకుంది. 

గీతూ మోహన్‌దాస్‌ (Geetu Mohandas) దర్శకత్వంలో వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు.  పవర్‌ఫుల్‌ అండ్‌ ఎమోషనల్‌ కథతో ‘టాక్సిక్‌’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్‌లో స్టార్‌ నటీనటులు నటించననున్నారు అని యూనిట్‌ పేర్కొంది. 

(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)

ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన  కేజీఎఫ్ చిత్రంతో యశ్‌ పాన్‌ ఇండియా రేంజ్‌ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కేజీఎఫ్‌-2తో ఆయన మార్కెట్‌ పెరిగింది. ఈ చిత్రాలతో విపరీతమైన పాపులారిటీ దక్కడం వల్ల తన తర్వాతి సినిమా ఏ స్థాయిలో ఉండాలి అనే అంశంలో కాస్త టైమ్‌ తీసుకున్నాడు. అందుకే 2022 నుంచి ఆయన మరో సినిమా చేయలేదు. తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో టాక్సిక్‌ స్టోరీ నచ్చడం ఆపై నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో టాక్సిక్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

రిలీజ్ ఎప్పుడు..?
టాక్సిక్ సినిమాను వాస్తవంగా  ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా షూటింగ్‌ పనులు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్‌ ఉన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కానీ, తాజాగా రిలీజ్‌ అయిన వీడియోలో సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో మేకర్స్‌ ప్రకటించలేదు. ఈ ఏడాది ముగింపు నెల డిసెంబర్‌ నెలలో టాక్సిక్‌ విడుదల కావచ్చని తెలుస్తోంది.

టాక్సిక్‌లో బాలీవుడ్‌ బ్యూటీ
ఈ చిత్రంలో కరీనా కపూర్‌ ( Kareena Kapoor ) ఓ హీరోయిన్‌గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్‌ పాత్ర కాదని, యశ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్‌ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం గతంలో శ్రుతి హాసన్ , సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. యశ్‌కు సిస్టర్‌ పాత్రలో కరీనా కనిపిస్తారా..? యశ్‌తో కియారా జోడీ కడతారా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

రామాయణంలో యశ్‌
నితీష్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్‌’ చిత్రంలో రావణుడిగా యశ్‌ నటించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నమిత్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మాతలుగా ఉన్నారు. యశ్‌కు మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్‌పై ‘టాక్సిక్‌’ చిత్రాన్ని  కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్‌ చేతులు కలిపారు. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. 

రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి  'రామాయణ' పేరుతో సినిమా రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement