కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు అయ్యారు. పండంటి మగబిడ్డకు హరిప్రియ జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తమ రెండో పెళ్లిరోజు నాడే బాబు జన్మించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని ఆమె తెలిపింది. ఇలాంటి లక్ చాలా అరుదుగా కలిసొస్తుందని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగులో కూడా ఆమె చాలా సినిమాలలో నటించడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కన్నడలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది. నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది.
( ఇదీ చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్ వార్తలపై సిరాజ్ రియాక్షన్)
‘జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది. వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. ఆర్వాత తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్ వంటి చిత్రాల్లో నటించిన ఆయన ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ కోసం పనిచేస్తున్నాడు. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకుని పలు సినిమాలతో రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment