
కడప స్పోర్ట్స్: కడప నగరానికి చెందిన పి. దేవరాజ్ దీనస్థితిపై ‘జాలి వద్దు.. జాబు కావాలి’ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ వికలాంగ క్రీడాకారుడి వివరాలను సేకరించి.. ఆయన డేటాను ఏపీ ఔవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌లో అప్‌లోడ్ చేసి ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఉపాధికల్పనాధికారికి ఆదేశాలు జారీ చేశారు. తో జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం. దీప్తి ‘సాక్షి’ నెట్‌వర్క్ ద్వారా దేవరాజ్ వివరాలను తెప్పించుకోవడంతో పాటు ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన అనంతపురంలో నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉన్న నేపథ్యంలో బుధ లేదా గురువారాల్లో వచ్చి కార్యాలయంలో కలవాలని దేవరాజ్‌ను కోరారు. ఆయన మ్యాచ్ అనంతరం కడపకు బయలుదేరి రానున్నట్లు ఆయన ‘సాక్షి’ తెలిపారు. తన దీనగాథ జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం పట్ల సాక్షికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.