physically challenged person
-
దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్‌ను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు పెన్షన్ రూ.1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి ప్రభుత్వం పెంచింది. ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులు నెలకు రూ.4016 పెన్షన్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల 20వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. పెన్షన్ పెంచుతూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా -
మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి
తణుకు అర్బన్(ప.గో. జిల్లా): 2024 ఎన్నికల్లో మళ్లీ జగనన్న ప్రభుత్వమే విజయం సాధించాలనే లక్ష్యంతో బైక్ యాత్ర చేస్తున్నానని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగుడు మాడెం అప్పారావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామానికి చెందిన అప్పారావు ఈనెల 4న ఇచ్చాపురం నుంచి విజయవాడకు బైక్ యాత్ర ప్రారంభించారు. శుక్రవారం తణుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన బైక్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆర్థికసాయం అందచేశారు. కార్యక్రమంలో కె.ఇల్లింద్రపర్రు సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి నాగార్జున, వైఎస్సార్సీపీ పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. -
ఫలించిన అంధుడి పదేళ్ల పోరాటం..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) చొరవతో మధ్యలో నిలిచిపోయిన డైట్ విద్యను కొనసాగించేందుకు ఓ అంధుడికి అవకాశం లభించింది. సీటును పునరుద్ధరిస్తూ విద్యాశాఖ శుక్రవారం నివేదికను సమర్పించడంతో పదేళ్ల పోరాట నిరీక్షణకు తెరపడింది. కడపలోని అల్మాస్ పేటకు చెందిన బి.రామాంజనేయులు కుమారుడు బి.కిరణ్‌కుమార్ అంధుడు. 2012లో డైట్ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించడంతో నెల్లూరు ప్రభుత్వ డైట్ కళాశాలలో సీటు వచ్చింది. తెలుగు మీడియంలో సోషల్ స్టడీస్ మెథడాలజీ డీఈడీ కోర్సులో చేరాడు. కొద్దిరోజులకే నెల్లూరు రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరిగిపోవడంతో ఐదారు నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాస్త కోలుకున్న తరువాత కాలేజీకి వెళ్లగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో సీటు నిలిపివేసినట్లు ప్రిన్సిపాల్, ఇతర అధికారులు చెప్పారు. ఒకపక్క ఆరోగ్యం బాగోలేకపోవడం, మరో పక్క సీటు రద్దు కావడంతో ఆందోళన చెందాడు. పూర్తిగా కోలుకున్నాక ఎలాగైనా డీఈడీ పూర్తి చేయాలని తలచి న్యాయం కోసం 2019లో ఉమ్మడి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. ఆ సమయంలో ఏపీ కేసులను విచారణకు తీసుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఈఏడాది ఫిబ్రవరిలో హెచ్ఆర్సీ కర్నూలు తరలివచ్చిన తరువాత మరోసారి ఫిర్యాదు చేశాడు. అయితే పోస్టులో పంపడంతో విచారణకు రాలేదు. చదవండి: (సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..?) చివరగా అదే ఏడాది ఏప్రిల్ 8న నేరుగా కమిషన్‌ను ఆశ్రయించడంతో ప్రత్యేక కేసుగా పరిగణించి చైర్మన్ మంధాత సీతారామమూర్తి నేతృత్వంలోని బెంచ్ కిరణ్‌కుమార్ చదువుకోవడానికి ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని నెల్లూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు నోటీçులు జారీ చేసింది. అందుకు విద్యాశాఖ అధికారులు స్పందించి మొదటి ఏడాది డీఈడీ కాలేజీలో కొనసాగిస్తామని శుక్రవారం కమిషన్ చైర్మన్‌కు నివేదిక సమర్పించారు. దీంతో కిరణ్‌కుమార్ చదువుకోవాలన్న ఆశ, జిజ్ఞాస, పట్టుదలను చైర్మన్ అభినందించారు. విద్యాశాఖాధికారులు కూడా బాగా స్పందించి విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పించడంతో అభినందనలు తెలిపి కేసును మూసి వేసినట్లు కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గారం తారక నరసింహకుమార్ తెలిపారు. -
మీరు బాగుండాలయ్యా.. ఆనంద్ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా
Anand Mahindra Neo Bolt : మాటలు చెప్పడమే కాదు చేతల్లో కూడా చేసి చూపించడంలో ముందుంటారు ఆనంద్ మహీంద్రా. అస్సాంకి చెందిన ఓ బాలుడు ఇంటి దగ్గర వస్తువులతో ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేస్తే.. అతన్ని చేరదీశాడు. హైదరాబాద్‌లోని ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీలో చేర్చి ఉన్నత విద్య అందిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు అండగా ఉంటూ వేలాది మంది దివ్యాంగులకు ఆసరాగా నిలబడేందుకు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమకాలిన అంశాలపై రెగ్యులర్‌గా స్పందించే ఆనంద్ మహీంద్రా మరో మంచి కార్యక్రమానికి నాంది పలికారు. దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న యంత్రాన్ని తయారు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులను అభినందించారు. అంతేకాదు వారు నెలకొల్పిన స్టార్టప్‌కు ఆర్థికంగా అండదండలు అందిస్తానంటూ స్వయంగా ముందుకు వచ్చారు. అనుకోకుండా వీల్ చైయిర్లో ప్రయాణిస్తున్న దివ్యాంగుడికి సంబంధించిన వీడియో ఆనంద్ మహీంద్రాకి కనిపించింది. వెంటనే ఆ వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఈ వీడియోలో ఉన్నది ఎవరో, అదెక్కడో తెలియదు కానీ, అందులో ఉన్న యంత్రం దివ్యాంగులకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్లకు నేను సహాయం చేస్తానంటూ పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారానే రీట్వీట్లు, షేరింగుల ద్వారా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన హామీ చెన్నైలో ఉన్న ఐఐటీ మద్రాసు విద్యార్థులకు చేరింది. ఎందుకంటే ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన వీడియో కనిపించే మెషిన్ రూపొందించింది వారే కాబట్టి. దివ్యాంగులు ప్రయాణించేందుకు వీలుగా అతి తక్కువ ఖర్చుతో నియో ఫ్లై, నియో బోల్డ్ అనే రెండు మెషిన్లు వారు రూపొందించారు. వీటి సాయంతో దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. మొత్తంగా సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో చెన్నై స్టూడెంట్లతో ముంబైలో ఆనంద్ మహీంద్రాల మధ్య కాంటాక్టు ఏర్పడింది. చెన్నై నుంచి ముంబై చేరుకుని వారు ప్రత్యేక డెమో ఇచ్చారు. The entrepreneurs behind this device are young IIT Madras Grads. Their company-NeoMotion-is dedicated to providing greater mobility to those with disabilities. (Yes, this term is now preferred to ‘differently abled.’) They reached out to me after this tweet. (1/2) pic.twitter.com/UZqe1ONvTc — anand mahindra (@anandmahindra) November 20, 2021 నియో మోషన్ ఐఐటీ మద్రాసు విద్యార్థులు తాము రూపొందించిన మెషిన్లతో నియో మోషన్ అనే స్టార్టప్‌ను స్థాపించారు. దీని ద్వారా దివ్యాంగులకు అతి తక్కువ ధరకే నియో ఫ్లై, నియో బోల్ట్ మెషిన్లు అమ్ముతున్నారు. నియో బోల్ట్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. సమతలంగా ఉన్న రోడ్డుతో పాటు ఎగుడుదిగుడు రోడ్లలోనూ ఈ నియోబోల్ట్ ప్రయాణిస్తుంది. వీటికి షాక్‌అబ్‌జర్వర్లు ఉండటం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లుగా ఉంది. ప్రతీ ఏటా మూడు లక్షలు మన దేశంలో ప్రతీ ఏడు దివ్యాంగులు ఉపయోగించుకునే మెషిన్లు 3 లక్షల వరకు అమ్ముడవుతున్నాయి. ఇందులో 2.5 లక్షల మెషిన్లు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఒక్కో మెషిన్ ధర నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యన ఉంటోంది. కానీ ఐఐటీ మద్రాస్ విద్యార్థులు అందిస్తోన్న నియో బోల్ట్ రూ.94,900లకే ప్రస్తుతం అందిస్తున్నారు. వారి జీవితాల్లో కదలిక ఆనంద్ మహీంద్రా లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ తన వంతు బాధ్యతగా ఈ స్టార్టప్‌కు సహకారం అందిస్తానంటూ ప్రకటించారు. మహీంద్రా గ్రూపు నుంచి సహాయం అందింతే నియోబోల్ట్ ధర మరింతగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రయాణ సాధానాలు లేక ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దివ్యాంగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తనంతట తానుగా ఆర్థికంగా అండగా ఉంటానంటూ ప్రకటించిన ఆనంద్ మహీంద్రాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీ నిర్ణయం గ్రేట్ సార్.. మీరు బాగుండాలి సార్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: ఐరన్ మ్యాన్ కలను నిజం చేసిన ఆనంద్ మహీంద్రా -
మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి
సాక్షి, జైపూర్(చెన్నూర్): మానసిక వికలాంగుడిపై ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మండలంలోని ఇందారంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడైన యువకుడిపై అదే గ్రామానికి చెందిన చెందిన గడ్డం నందు, కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహ్మద్ సాధిక్, బొగె రాయలింగు కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వేంధిపులకు గురిచేస్తున్నారు. మోటార్‌సైకిల్‌పై రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా హింసించి ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవారు. సదరు యువకుడు అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది. యువకుడి తల్లిదండ్రులు శనివారం జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. బాలికకు యువకుడి లైంగిక వేధింపులు సోన్: మండలంలోని సిద్ధులకుంట గ్రామానికి చెందిన బాలికను ఇదే గ్రామానికి చెందిన తిరుమల భోజన్న(23) కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పగా గతంలో యువకుడిని మందలించారు. మళ్లీ శనివారం వేధింపులకు గురి చేయడంతో తల్లికి చెప్పింది. దీంతో గ్రామస్తులు భోజన్నను పట్టుకుని చితకబాదారు. డయల్100కు సమాచారం అందించగా ఎస్సై ఆసీఫ్ గ్రామానికి చేరుకుని భోజన్నను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
AP Special: సానుభూతి వద్దు... సమాజంలో గౌరవం కావాలి
సమాజంలో మాకు తగిన గౌరవం కావాలి.. ఉద్యోగసానుభూతి వద్దు.. సమాజంలో ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సహకాలు ఇవ్వాలి.. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ పథకాలతో పూట గడుపుకుంటున్న శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అంటున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ‘మరోక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ అని వీరికి పేర్లు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైన వైకల్యం కలిగి ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లయితే.. అలాంటి వ్యక్తిని అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నిర్ధారిస్తారు. అంధత్వం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఎందరో దివ్యాంగులు వివిధ రంగాల్లో రాణిస్తూ మరి కొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన సి.ఆర్.వి. ప్రభాకర్ విద్యారంగంలో సాధించిన తాను సాధించిన విజయానలకు అంగవైకల్యం ఏ మాత్రం ఆటంకం కాదని నిరూపించాడు. ఈయన తండ్రి సి. వెంకటేశ్వర శర్మ, తల్లి విద్యావతి. తండ్రి సి.వెంకటేశ్వర శర్మ.. టీటీడీలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డు అయ్యారు. ఈ దంపతులకు ప్రభాకర్ రెండవ సంతానం. ప్రభాకర్.. గత 22 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చిన సమస్యను ఎప్పుడూ లోపంగా పరిగణించలేదు. కేవలం వీల్‌చైర్‌కే ఇతని జీవితం పరిమితమైనప్పటికీ ఎంతో కృషితో ఉన్నత చదువులు చదివారు. ఇటివల సీఏ(చార్టెర్డ్ అకౌంటెంట్) కోర్సును పూర్తిచేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఆత్మగౌరవంతో మరికొందరికి స్ఫూర్తి అవుతానని అభిప్రాయ పడ్డారు. అదే విధంగా.. వ్యాపార రంగంలో ప్రోత్సాహలు ఇవ్వాలని అన్నారు. మనదేశంలో అంగవైకల్య సమస్యకు సరైన మందులు, సర్జరీ సౌకర్యాలు లేవని అన్నారు. అమెరికా వంటి దేశంలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అయితే, రూ.15 కోట్ల ఖర్చు చేసిన అది తాత్కలిక వైద్యమే అన్నారు. తాను ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశానని అన్నారు. ఓ వ్యాపార సంస్థ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది తన జీవిత లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మరిన్నిసబ్సిడీతో కూడిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభాకర్ కోరాడు. తిరుత్తణి దేవ పెయింటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పూట గడుపుతున్నాం.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ప్రాథమిక వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నామని తిరుత్తణి దేవ అనే పెయింట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత 17 సంవత్సరాలుగా పెయింట్ చేస్తూ బతుకున్నానని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మఒడి, వికలాంగ పింఛను,వైఎస్సార్ ఆసరా, భరోసా వంటి పథకాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఆశయం గొప్పదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చిరు వ్యాపారాలు ప్రారంభించాలని , అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యాయని వాపోయాడు. బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని తెలిపారు. తనలాంటి దివ్యాంగులకు ఎలాంటి సిఫారసు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని పెయింటర్ తిరుత్తణి దేవ కోరుతున్నాడు. -
సాక్షి ఎఫెక్ట్: చిన్నయ్య కుటుంబానికి భరోసా
సాక్షి, నెన్నెల(ఆదిలాబాద్): మండలంలోని ఖర్జీ జంగాల్‌పేటలో విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేతిని కోల్పోయి మంచానికే పరిమితమైన పంగిడి చిన్నయ్య అనే వ్యవసాయ కూలీ దీనస్థితిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈనెల 12న ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచూరితమైన కథనాన్ని బెల్లంపల్లికి చెందిన ఎన్ఆర్ఐ, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ తోడ వెంకటకృష్ణారెడ్డి ట్విట్టర్లో పోస్టు చేయగా.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ కార్యాలయం నుంచి నెన్నెల కోవిడ్ వలంటీర్ బృందం వ్యవస్థాపకుడు, ఉపాధ్యాయుడు జలంపల్లి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి, కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొద్దిపాటి స్థలాన్ని అమ్మి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసి చిన్నయ్య వైద్యం చేసుకున్న ఫలితం లేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని ఇల్లు అంతంత మాత్రంగానే ఉందని శ్రీనివాస్ వివరించారు. వైద్యఖర్చులకు సంబంధించిన బిల్లులు తీసుకుని హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని కేటీఆర్ కార్యాలయానికి వచ్చి నేరుగా ఇవ్వాలని వారు కోరారు. మూడు నెలల్లో సీఎం సహాయ నిధి కింద పూర్తి డబ్బులు అందేలా చూస్తామన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ కమిటీ జిల్లా అధికారి సత్తయ్య సోమవారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. నెలకు సరిపడా సరుకులను అందజేశారు. విద్యాపరంగా పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ ద్వారా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించేందుకు నివేదికలు సిద్ధం చేసి పంపించనున్నట్లు బెల్లంపల్లి విద్యుత్ డీఈ రావుల శ్రీధర్ తెలిపారు. ఒప్పంద కార్మికురాలిగా ఉపాధి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని బాధితుడి భార్య ముత్తక్క వేడుకుంటోంది. స్పందించిన దాతలు.. పంగిడి చిన్నయ్య కుటుంబానికి గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్‌గౌడ్ రూ.5 వేలు, నెన్నెల కోవిడ్ వలంటీర్స్ బృందం తరఫున రూ.2 వేల ఆర్థికసాయం అందజేశారు. చదవండి: TS: ఎగుమతులతోనే రైతు ఆదాయం రెట్టింపు -
పుట్టు మూగ, చెవిటి దివ్యాంగుడు.. అయినా అందని పింఛన్
సాక్షి, మరిపెడ (వరంగల్): చిన్నగూడూరు మండలం విస్సంపల్లి గ్రామానికి చెందిన కోల నర్సయ్యకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉంది. ఇతడికి జూన్ 7, 2011లో జీవితకాలం సదరం సర్టిఫికెట్ జారీ చేసిన గత ప్రభుత్వ హయాంలో నెల నెలా రూ.200 పింఛన్ డబ్బులు అంజేశారు. ఈ క్రమంలో దివ్యాంగుడి తల్లిదండ్రులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వివాహం కాని ఇతడి బాగోగులు చూసుకునేవారు కరువయ్యారు. దీంతో ఊరూరు తిరుగుతూ బంధువుల ఇళ్లల్లో కొద్ది రోజుల పాటు తలదాచుకుంటూ వచ్చాడు. దివ్యాంగుడు నర్సయ్య గ్రామంలో లేని కారణంగా ఇతడికి వచ్చే పింఛన్‌ను అధికారులు కొట్టివేశారు. బంధువులు కూడా సాకలేమనడంతో 6 సంవత్సరాల క్రితం తిరిగి స్వగ్రామమైన విస్సంపల్లి చేరుకున్నాడు. నా అనేవారు లేక పోవడంతో కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా బతికీడుస్తున్నాడు. అప్పటి నుంచి తన దగ్గర ఉన్న జీవిత కాలం దివ్యాంగుడి సర్టిఫికెట్ పట్టుకొని అధికారులు, పాలకుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఎవరూ కనికరం చూపలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దివ్యాంగులకు గుడ్‌న్యూస్: నో టోల్ ఫీజు
న్యూఢిల్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించనవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగులకు టోల్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నారా అని బీజేపీ ఎంపీ రమేశ్ బిదురీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. ఇకపై దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను ఎత్తివేసినట్లు ఈ సందర్భంగా గడ్కరీ గుర్తు చేశారు. యూజర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగులకు వాహనాలను డిజైన్ చేయాలంటూ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
‘నేనుండగానే నా బిడ్డ కన్నుమూయాలి’
సాక్షి, ప్రకాశం: కడుపున పుట్టిన బిడ్డలు అందరిలా అల్లరి చేస్తూ చదువుకొని ప్రయోజకులైతే కన్నవారికి ఆనందం. అలా కాకుండా తమ కళ్లముందే కదల్లేకుండా ఉంటే వారి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దుస్థితే ఓ తల్లికి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18 ఏళ్లుగా దివ్యాంగుడైన తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ కుమిలిపోతోంది. ఇతనికి రెండు కాళ్లు, చేతులు వంకరగా పుట్టడమే కాకుండా మెడ సక్రమంగా నిలబడదు. దీంతో పుట్టింది మొదలు సపర్యలు చేసుకుంటూ ఆవేదన చెందుతోంది. మండలంలోని పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన దామెర్ల మునీశ్వరమ్మ స్వగ్రామం మార్కాపురం మండలం పిడుదునరవ. 19 ఏళ్ల క్రితం పొదలకుంటపల్లె గ్రామాని చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రంగయ్యకు ఇచ్చి వివాహాం చేశారు. అయితే తొలి కాన్పులోనే దివ్యాంగుడైన చిన్నరంగయ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టిన బిడ్డ మృతి చెందాడు. తదనంతరం మరో ఇద్దరు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ఈ పరిస్థితుల్లో 5 ఏళ్ల క్రితం తన భర్త రంగయ్య నెమ్ము, షుగరు వంటి వ్యాధులతో మంచం పట్టాడు. అసలే పుట్టెడు దుఃఖంతో ఉన్న మునీశ్వరమ్మకు భర్త అనారోగ్య పరిస్థితి గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది. కుటుంబ పోషణతో పాటు భర్త, కుమారుడి భారం కూడా పడటంతో గిద్దలూరు పట్టణంలో అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా టీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తోందీమె. (పట్టుదలే ఐపీఎస్‌ను చేసింది: ప్రతాప్ శివకిషోర్) ‘ఎంతో కష్టపడి టీ అమ్ముకుంటే రోజుకు రూ.200 వస్తాయయ్యా. నేనేజన్మలో పాపం చేశానో ఏమో కష్టాలన్నీ నాకే వచ్చాయి. నేను బతికున్నప్పుడే నా బిడ్డ కన్నుమూయాలి. నేను ముందుగా చనిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? నేనున్నంత కాలం నా కొడుకును బాగా చూసుకుంటాను. అయితే మా పిల్లాడికి పింఛను రావడంలేదు. అధికారులకు మొరపెట్టుకుంటే ఒంగోలు వెళ్లి సదరన్ క్యాంప్ నుంచి సర్టిఫికేటు తెమ్మంటున్నారు. మా పిల్లోడు మంచం దిగలేడు. అట్టాగే తినిపిస్తూ.. నీళ్లు పోస్తూ.. బట్టలు మార్చుకుంటూ చూసుకుంటున్నా. ఒంగోలుకెళ్లాలంటే ఆటో మాట్లాడుకోని బస్టాండుకెళ్లాలి. అయితే వాడు బస్సెక్కలేడు. ఏదైనా కారు మాట్లాడుకోవాలంటే డబ్బులు తేలేము. అధికారులే మనస్సు చేసుకుని నాబిడ్డకు పింఛన్ వచ్చేలా చూడాలి’ అని వేడుకుంది. ఈ విషయమై ఎంపీడీఓ ఆకుల రంగనాయకులుని వివరణ కోరగా కరోనా ప్రభావం వల్ల నియోజకవర్గం కేంద్రంలో సదరన్ క్యాంప్ నిర్వహించలేకపోతున్నామన్నారు. క్యాంప్ నిర్వహించిన సమయంలో గ్రామ కార్యదర్శి, వలంటీర్ ద్వారా వికలాంగుడైన చిన్నరంగయ్యను తీసుకువచ్చి సర్టిఫికెట్ ఇప్పించి పింఛన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. -
కన్నీటితో కడుపు నింపలేక..
మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది. సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం చే,తుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది. ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్న ట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా, స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రా వడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్‌ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
అతనికి ఉద్యోగమివ్వండి
కడప స్పోర్ట్స్: కడప నగరానికి చెందిన పి. దేవరాజ్ దీనస్థితిపై ‘జాలి వద్దు.. జాబు కావాలి’ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ వికలాంగ క్రీడాకారుడి వివరాలను సేకరించి.. ఆయన డేటాను ఏపీ ఔవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో అప్లోడ్ చేసి ఉద్యోగం కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఉపాధికల్పనాధికారికి ఆదేశాలు జారీ చేశారు. తో జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం. దీప్తి ‘సాక్షి’ నెట్వర్క్ ద్వారా దేవరాజ్ వివరాలను తెప్పించుకోవడంతో పాటు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ఆయన అనంతపురంలో నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఉన్న నేపథ్యంలో బుధ లేదా గురువారాల్లో వచ్చి కార్యాలయంలో కలవాలని దేవరాజ్‌ను కోరారు. ఆయన మ్యాచ్ అనంతరం కడపకు బయలుదేరి రానున్నట్లు ఆయన ‘సాక్షి’ తెలిపారు. తన దీనగాథ జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం పట్ల సాక్షికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
చలనమే..సంచలనమై!
అడుగులు కదపలేని స్థితి నుంచి ఆయన గురించి గర్వంగా అడిగి తెలుసుకునే స్థాయికి ఎదిగారాయన. కాళ్లలో చలనం లేని స్థితి నుంచి సంచలనం సృష్టించేంత ఎత్తులో నిలబడ్డారాయన. చంద్రబోస్ ఒక పాటలో చెప్పినట్టు పిడికిలి బిగించి చేతిరాత మార్చుకున్నారు. చెమట్లు చిందించి నుదుటి గీత రాసుకున్నారు. అంతులేని పట్టుదలతో ఆదర్శప్రాయంగా మారారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదనే వాక్యానికి రుజువుగా నిలిచారు. ఇచ్ఛాపురంలో పుట్టి తెలంగాణకు ఆటలో ప్రాతినిథ్యం వహించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన తులసయ్య గురించి సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం కుగ్రామం తులసిగాం గ్రామానికి చెందిన పండూరు జోగయ్య, దాలమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన తులసయ్య 18 నెలల వరకు అందరి పిల్లల్లానే ఉండేవాడు. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. విధి వక్రీకరించింది. జ్వరం బారిన పడిన తులసయ్యకు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే బీద కుటుంబం, ఆపై కొడుక్కి పెద్ద కష్టం రావడంతో వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. తులసయ్య ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ధర్మపురం ఉన్నత పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తొలి విజయాన్ని అందుకున్నారు. తోటి స్నేహితులు, అన్నదమ్ముల సాయంతో ఇచ్ఛాపురం జ్ఙానభారతిలో ఇంటర్, శ్రీకాకుళంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత విద్య చదవాలన్న కోరిక ఉన్నప్పటికీ తనవారి గురించి ఆలోచించి హైదరాబాద్‌లో ఓ చానెల్లో వెబ్ రిపోర్టర్‌గా చేరాడు. అనుకోని అవకాశం.. పాఠశాలలో తోటి స్నేహితులతో క్రీడలపై ఆసక్తిని కనబర్చే తులసయ్యకు అనుకోని అవకాశం ముంగిట చేరింది. ఓ రోజు తులసయ్య ఆఫీసుకు వెళ్తుండగా అదే దారిలో చంద్రశేఖర్ అనే దివ్యాంగుడు పరిచయమయ్యాడు. తాను వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆటగాడినని, ఆసక్తి ఉంటే తనతో రమ్మంటూ ఆహ్వానం పలికాడు. ఆటలపై మక్కువ ఉన్న తులసయ్య తన సత్తాను నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించాడు. తెలంగాణా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పద్మతో పాటు కోచ్ సొహయిల్ ఖాన్లు తులసయ్యలో ఉన్న ప్రతిభను గుర్తించారు. సుమారు నెలన్నర రోజుల పాటు శిక్షణ పొందిన తులసయ్య అనతి కాలంలోనే వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు చెన్నై ఈరోడ్‌లో జరిగిన 5వ జాతీయ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూన్ 24 నుండి 29 వరకు చంఢీఘర్ రాష్ట్రం మొహాలీలో జరిగిన 6వ జాతీయ వీల్ చైర్ బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్లో పాల్గొని మళ్లీ నాల్గో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తులసయ్య ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికై బహుమతులు కైవసం చేసుకున్నాడు. మొక్కవోని దీక్షతో కష్టబడితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు తులసయ్య. ప్రభుత్వం ప్రోత్సహిస్తే... నాకు ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్, అథ్లెటిక్స్ కూడా ఆడుతాను. కానీ నాకు అంత ఖరీదైన వీల్‌చైర్ లేదు. ఈ ఏడాది డిసెంబర్లో దివ్యాంగులకు రంజీ క్రికెట్ పోటీలు ఉన్నాయి. అందులో ఆడి సత్తా నిరూపించుకోవాలని ఉంది. ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని క్రీడల్లో రాణించాలని ఉంది. ప్రస్తుతం నేను తెలంగాణ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను. అవకాశం వస్తే శ్రీకాకుళం జిల్లాలో నా పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని ఉంది. – పి.తులసయ్య, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు -
ర్యాంపులకు నిధులేవి..
సాక్షి, నేలకొండపల్లి: ఓటు హక్కు కలిగిన ప్రతీ దివ్యాంగుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు లను ఏర్పాటు చేస్తున్నారు. వీల్చైర్లలో తీసుకొచ్చి, తీసుకెళ్లటానికి రవాణా సౌకర్యం కల్పించనున్నది. డీజెబుల్ ఫ్రెండ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. అయితే ర్యాంపుల ఏర్పాటుకు నిధుల కొరత వెం టాడుతోంది. పంచాయతీల్లో నిధులు లేక అందినకాడికాల్లా అప్పులు తెచ్చి ర్యాంపులు నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 28,553 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 5630 మంది, మధిర 6055 మంది, వైరా 4679, సత్తుపల్లిలో 5289 మంది, పాలేరులో 6900 మంది ఉన్నారు. వీరిలో నడవలేని వారు, చెవిటి వారు, మాట రాని వారిని గుర్తించారు. అటువంటి వారి ని ఇంటి వద్ద నుంచి పోలింగ్ కేంద్రం వరకు, ఓటేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి ఇంటి వరకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. వీల్ చైర్లను వికలాంగుల సంక్షేమ శాఖ, వైద్యారోగ్యశాఖల నుంచి సేకరిస్తున్నారు. దివ్యాంగులు ఓటు వేశాక ఇంటికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్ లేకుండా ఓటు వేసేందుకు ప్రత్యేక వసతులు, పోలింగ్ కేంద్రానికి రాకపోకలు సులువుగా ఉండేలా వీల్చైర్లను సిద్ధం చేసింది. అంధ ఓటర్లు ఎన్నికల గుర్తును గుర్తించేందుకు బ్రెయిలీ సహాయకులు, వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాంపుల ఏర్పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ నిధులు వినియోగించి నిర్మించాలి. పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిధు లు రాగానే అందించే ఏర్పాట్లు చేస్తారు. ముందు గా దివ్యాంగుల ప్రయోజనాల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి. –బి.రవికుమార్,ఎంపీడీఓ, నేలకొండపల్లి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పోలింగ్ కేం ద్రాల్లో ర్యాంపులు, వీల్చైర్లు అందుబాటులోకి తెస్తున్నాం. వీటిన్నంటిని జిల్లా నోడల్ అధికారి ఏర్పాట్లు చేస్తారు. అయితే అన్ని మండలాల ఎంపీడీఓ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తారు.దివ్యాంగులు ఇంటి నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా వాహనాలు సమకూరుస్తున్నాం. –దశరథ్, పాలేరు రిటర్నింగ్ అధికారి వసతులు కల్పించాలి దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించు కునేలా ఎన్నిల సంఘం చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవి ఆచరణలో చూపా లి. ఓటుకు కోసం ఎలా తీసుకెళ్లాతారో అలాగే ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని వల్ల దివ్యాంగులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. –బట్టపోతుల ప్రకాషం, వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి, నేలకొండపల్లి -
దివ్యాంగుడి ‘హోదా’ పోరు..
భోగాపురం : మండల కేంద్రంలోని మారుతీ వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామిశెట్టి చిన్నారావు ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన మూడు చక్రాల సైకిల్ సీటు వెనుక ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కూడిన బోర్డు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే కలిగే ప్రయోజనాలను జనానికి వివరిస్తున్నారు. హోదాకోసం పోరుబాట సాగించాలంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. ఎండతో నీకెందుకీ బాధ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్ర ప్రజలు పడే ఇబ్బంది ముందు తను పడుతున్న కష్టం ఎక్కువేమీ కాదని సమాధానం చెప్తున్నారు. హోదా సాధించేందుకు కృషిచేసే నాయకులు అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన సాగించిన హోదా పోరుకు అంతా మెచ్చుకుంటున్నారు. -
దివ్యమైన సిరి
సామర్లకోట: జిల్లాలోని సామర్లకోటలో ఉన్న సిరి మానసిక దివ్యాంగుల కేంద్రం ప్రేమాలయంగా ఖ్యాతినార్జించింది. సుమారు 200 మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆర్థికంగా వృద్ధి చెందడానికి వృత్తి శిక్షణ ఇస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు నిర్వాహకులు. గోపీదేవి అనే సాధారణ మహిళ 1994లో పెద్దాపురం రోడ్డు బడేలమ్మ చెరువు ఎదురుగా మానసిక దివ్యాంగుల సేవా సంస్థ ‘సిరి’ని స్థాపించారు. అనేక మంది సూచనల మేరకు ఈ సంస్థ సేవలు విస్తృతం చేసే లక్ష్యంతో పెద్దాపురం మండలం ఆనూరులోనూ, ప్రత్తిపాడులోనూ శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద మహిళలకు ఉచితంగా విద్య, వసతి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ వెలుగుల్లో తానూ ప్రకాశిస్తూ తన జీవితానికి అర్థం పరమార్థం సేవలోనే అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గోపీదేవి. ఆమె చేస్తున్న సేవలు గుర్తించి అనేక మంది తమ తమ పుట్టిన రోజు వేడుకలను ఈ కేంద్రంలో విద్యార్థుల మధ్య జరుపుకొంటున్నారు. నిరుపేద మానసిక వికలాంగులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నదీ ఆమె మాటల్లోనే.. ‘ శ్రీకాకుళంలో బీఏ పట్టా తీసుకున్న అనంతరం మానసిక వికలాంగులకు సేవ చేయాలనే కోరికతో మెంటల్ రిటార్డేషన్లో డిప్లమో చేశాను. నా ఉత్సాహం గమనించిన మా నాన్న దాశెట్టి సూర్య కుమార్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో మా తాతయ్య అప్పలరాజు స్వస్థలమైన సామర్లకోటలో మానసిక దివ్యాంగుల సేవాసంస్థ ‘సిరి’ని స్థాపించాను. మానసిక దివ్వాంగులకు ప్రేమ, ఆదరణతోపాటు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో చెన్నైలో ఉండే తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతో, ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. 2000 సంవత్సరంలో తమ సంస్థ ‘సిరి’కి ప్రభుత్వ గుర్తింపు లభించింది. దీంతో మరింత ఉత్సాహంతో మతిస్థిమితం లేని బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శారీ పెయింటింగ్, సర్ఫ్ తయారీ, రీడింగ్, రైటింగ్, ప్రవర్తన సర్దుబాటు, వృత్తి విద్యలలో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నాం. సంస్థలో నిర్వహిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సార్లు ‘బెస్ట్ సోషల్ వర్కర్’ పురస్కారాలను ప్రదానం చేసింది. కేవలం అవార్డుల కోసం కాకుండా మానసిక పరిపక్వతలేని 5–15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు పై విభాగాల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తున్నాం. దాతల ద్వారా సేకరించిన విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ మొత్తం మీద వచ్చే వడ్డీతో పిల్లలకు జీవితకాలం భోజన వసతి కల్పిస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది విద్యార్థులు సిరి మానసిక సంస్థలో శిక్షణ పొందుతున్నారు. వీరికి 40మంది సుశిక్షితులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. 15 ఏళ్లు పైబడిన మతి స్థిమితం లేని మహిళలకు భవిష్యత్‌లో ఆసరాగా ఉండేందుకు షెల్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రేమకు, ఆప్యాయతలకు నోచుకోని నిరుపేద మానసిక వికలాంగులకు చేయూత ఇవ్వడం ద్వారా స్వయంగా ఆ భగవంతుడికే సేవ చేసినట్లు భావించి దాతలు సహృదయంతో స్పందించి ఆర్థికంగా మరింత సహకారం అందించాలని కోరుతున్నాను.’ -
అంధత్వం అడ్డురాలేదు...
పుట్టుకతో అంధురాలైనప్పటికీ.. ఏనాడు ఆమె కుంగిపోలేదు.. చూపున్న వారితో పోటీపడి చదివింది.. ప్రభుత్వ కొలువు సాధించింది.. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యంతో తన కాళ్లపై తాను నిలబడింది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. దండేపల్లి(మంచిర్యాల) : దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన వొజ్జెల అంజయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు శ్రీనివాస్, కూతురు మమత. మమతకు పుట్టుకతోనే అంధత్వం ఉంది. కూతురు అంధురాలని తల్లిదండ్రులు తరచూ బాధపడేవారు. ఒక్కగానొక్క కూతురు ఇలా అంధురాలిగా పుట్టడం తమ దురదృష్టం అని అందరితో చెప్పుకుంటుండేవారు. అలా కొన్ని రోజులు మమత దిగులు చెందింది. కానీ దిగులుపడితే చేసేదేం లేదని.. ఏదైనా సాధిస్తే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మమత సంకల్పించుకుంది. బాధను దిగమింగుకుని కష్టపడి చదివా.. మమత తన అంధత్వంలో చిన్నప్పటినుంచి ఎదుర్కొన్న కష్టాలు ఆమె మాటల్లోనే.. నేను అంధురాలిని కావడంతో సమాజం మాత్రం నన్ను తోటి మనుషుల్లా కాకుండా హేళనగా చూసేవారు. ఈ విషయం నన్ను కొంత బాధకు గురి చేసింది. చిన్నతనంలో నాతోటి వారంతా ఆడుకుంటుంటే. నాకు కళ్లుంటే నేను కూడా ఆడుకునే దాన్ని అని మనసులో బాధపడేదాన్ని. దేవుడు నన్ను చిన్న చూపు చూశాడని అనుకుని బాధను దిగమింగుకున్నా. అయితే నాకు ఆరేడేళ్ల వయస్సులో మా తల్లిదండ్రులు నన్ను స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. రోజూ నన్ను బడిలో దింపి వచ్చేవారు. బడిలో నా తోటి విద్యార్థులు కూడా నన్ను హేళనగా చూసేవారు. వారలా చేయడంతో చదువుకుని ఉద్యోగం సాధించాలనే కసి నాలో పెరిగింది. ఉపాధ్యాయుడు చెబితే నాతోటి విద్యార్థులు చదువుకునేది, రాసుకునేది. కానీ నేను చదవలేక, రాయలేక కేవలం విని అందరితో పాటు నేనూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదాన్ని. చదువులో నా ఆసక్తిని మా ఊరికి చెందిన శేఖర్సార్ గుర్తించాడు. ఇలాంటి వారికి కరీంగర్‌లో అం«ధుల పాఠశాల ఉంది. వీరికి ప్రత్యేక లిపి ఉంటుంది. అందులో చేర్పిస్తే బాగుంటుంది. అని మా తల్లిదండ్రులకు సూచించాడు. తల్లిదండ్రుల్లో ధైర్యం నింపి.. అంధుల పాఠశాలలో నన్ను చేర్పించేందుకు మా అమ్మా, నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే చూపు లేక పోవడంతో ఇంటి వద్ద అయితేనే తాము చూసుకుంటామని, ఎక్కడో చదివిస్తే, ఎట్లా ఉంటావో బిడ్డా వద్దు ఇంటికాడనే ఉండాలని అన్నారు. అయినప్పటికీ అక్కడ చదవాలని నాలో కోరిక పెరిగింది. అమ్మానాన్నను ఒప్పించాను. వాళ్లు నన్ను కరీంనగర్ అంధుల పాఠశాలలో చేర్పించారు. 1నుంచి 10 వరకు కరీంనగర్లో చదువుకుని పాసయ్యాను. ఆతర్వాత హైదరాబాద్ అంధుల కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. ఏడాదిన్నర క్రితం వికలాంగుల కోటాలో మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాను. దీంతో నా జీవిత ఆశయం నెరవేర్చుకున్నా. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నా. ప్రభుత్వం గుర్తించాలి.. ప్రభుత్వం పింఛన్ ఇచ్చి సరిపెట్ట్టకుండా ప్రత్యేకంగా దివ్యా ంగులను గుర్తిం చాలి. చదువు, ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ఎక్కువగా కల్పించి ప్రోత్సహించాలి. జిల్లాకో అంధుల పాఠశాల నెలకొల్పాలి. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులను నేను కోరేదేంటంటే. దివ్యాంగులు ఏం చదువుతారు లే అని ఇంటి వద్ద ఉంచుకోకూడదు. దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే చదువుతో పాటు అన్నింటా రాణిస్తారు. ఉద్యోగాలు కూడా సాధిస్తారు. తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించి దివ్యాంగులను చదివించాలి. నాన్నే నాకు తోడుగా.. చదువంతా అంధుల పాఠశాల, కళాశాలలో పూర్తి కావడంతో ప్రస్తుతం ఉద్యోగంలో మాత్రం నాన్న అంజయ్య నాకు తోడుగా ఉంటున్నాడు. నేనిప్పుడు మందమర్రిలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు నాన్న తోడుగా ఉండి వంట చేసి పెడుతున్నాడు. రోజూ ఆఫీసుకు తీసుకెళ్లి తీసుకొస్తాడు. ఆఫీసులో కూడా నా తోటి ఉద్యోగులు నన్ను వారితో సమానంగా చూసుకుంటారు. నాకు ఇబ్బందితో కూడిన పనులు చెప్పరు. విధుల్లో నాకు అందరూ సహకరిస్తుంటారు. నేనీస్థాయిలో ఉండడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ రుణ పడి ఉంటాను. -
పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో..
కర్నూలు (జూపాడు బంగ్లా) : పోలీసులు మళ్లీ కొడతారన్న భయంతో ఓ వికలాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూపాడు బంగ్లా మండలం పి.లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దపుల్లన్న ఇటీవల నాటుసారా విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ విషయం మీద ఆదివారం స్టేషన్లో పుల్లన్నను పోలీసులు బాగా చితకబాదారు. మరుసటి రోజు స్టేషన్ రావాలని చెప్పి ఆరోజు వదిలిపెట్టారు. సోమవారం మళ్లీ కొడతారనే భయంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ స్పృహ కోల్పోగా మందు తాగి వచ్చాడని బయటపడేశారు. పుల్లన్న పురుగుల మందు తాగాడనే విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే కన్నుమూశాడు. -
శభాష్ నరసింహా..
ధర్మవరం: శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు చెన్నేకొత్తపల్లికి చెందిన వికలాంగ విద్యార్థి నరసింహా హాజరయ్యాడు. ఇతనికి పుట్టుకతోనే చేతులు లేవు. చదువు మీద శ్రద్ధతో కాలితో రాయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తుండటంతో టీచర్లు అతన్ని నవోదయ ప్రవేశపరీక్ష రాయమని సలహా ఇచ్చారు. ఈ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ కాలితో పరీక్ష రాస్తున్న నరసింహను చూసి అభినందించారు.