సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్‌ను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు పెన్షన్ రూ.1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి ప్రభుత్వం పెంచింది.
ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులు నెలకు రూ.4016 పెన్షన్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల 20వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. పెన్షన్ పెంచుతూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా
Comments
Please login to add a commentAdd a comment