
సాక్షి, జైపూర్(చెన్నూర్): మానసిక వికలాంగుడిపై ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మండలంలోని ఇందారంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడైన యువకుడిపై అదే గ్రామానికి చెందిన చెందిన గడ్డం నందు, కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహ్మద్ సాధిక్, బొగె రాయలింగు కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వేంధిపులకు గురిచేస్తున్నారు. మోటార్‌సైకిల్‌పై రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా హింసించి ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవారు. సదరు యువకుడు అనారోగ్యానికి గురి కావడంతో విషయం బయటపడింది. యువకుడి తల్లిదండ్రులు శనివారం జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
బాలికకు యువకుడి లైంగిక వేధింపులు
సోన్: మండలంలోని సిద్ధులకుంట గ్రామానికి చెందిన బాలికను ఇదే గ్రామానికి చెందిన తిరుమల భోజన్న(23) కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పగా గతంలో యువకుడిని మందలించారు. మళ్లీ శనివారం వేధింపులకు గురి చేయడంతో తల్లికి చెప్పింది. దీంతో గ్రామస్తులు భోజన్నను పట్టుకుని చితకబాదారు. డయల్100కు సమాచారం అందించగా ఎస్సై ఆసీఫ్ గ్రామానికి చేరుకుని భోజన్నను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment