శభాష్ నరసింహా.. | physically challenged person narasimha attends navodaya exam | Sakshi
Sakshi News home page

శభాష్ నరసింహా..

Published Sun, Feb 9 2014 10:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

శభాష్ నరసింహా..

శభాష్ నరసింహా..

ధర్మవరం: శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ   పాఠశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు చెన్నేకొత్తపల్లికి చెందిన వికలాంగ విద్యార్థి నరసింహా హాజరయ్యాడు. ఇతనికి పుట్టుకతోనే చేతులు లేవు. చదువు మీద శ్రద్ధతో కాలితో రాయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తుండటంతో టీచర్లు అతన్ని నవోదయ ప్రవేశపరీక్ష రాయమని సలహా ఇచ్చారు. ఈ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ కాలితో పరీక్ష రాస్తున్న నరసింహను చూసి అభినందించారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement