పోలీసులు మళ్లీ కొడతారన్న భయంతో ఓ వికలాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూపాడు బంగ్లా మండలం పి.లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది.
కర్నూలు (జూపాడు బంగ్లా) : పోలీసులు మళ్లీ కొడతారన్న భయంతో ఓ వికలాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూపాడు బంగ్లా మండలం పి.లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దపుల్లన్న ఇటీవల నాటుసారా విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ విషయం మీద ఆదివారం స్టేషన్‌లో పుల్లన్నను పోలీసులు బాగా చితకబాదారు. మరుసటి రోజు స్టేషన్ రావాలని చెప్పి ఆరోజు వదిలిపెట్టారు.
సోమవారం మళ్లీ కొడతారనే భయంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ స్పృహ కోల్పోగా మందు తాగి వచ్చాడని బయటపడేశారు. పుల్లన్న పురుగుల మందు తాగాడనే విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే కన్నుమూశాడు.