ఆదోని అర్బన్: పట్టణంలోని పూలబజార్‌లో నివాసముంటున్న శైలజ (22) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల క్రితం విక్టోరియాపేటకు చెందిన కృష్ణ కుమార్తె శైలజ, శక్తిగుడి ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
నాగరాజు ఓ ప్రయివేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండగా, శైలజ లేడీస్ కార్నర్‌లో పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కుమార్తె మౌనిక ఉంది. భర్త ప్రతిరోజూ భార్యపై అనుమానం పడడం, లేడీస్ కార్నర్‌లో పనిచేయగా వచ్చిన డబ్బు తనకే ఇవ్వాలని వేధించేవాడు.
దీంతో శైలజ మనస్తాపానికి గురై సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కాపేపటికి గమనించిన కుటుంబసుభ్యులు కిందకు దింపి ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment