న్యూఢిల్లీ: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించనవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగులకు టోల్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నారా అని బీజేపీ ఎంపీ రమేశ్ బిదురీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. ఇకపై దివ్యాంగులకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను ఎత్తివేసినట్లు ఈ సందర్భంగా గడ్కరీ గుర్తు చేశారు. యూజర్ ఫ్రెండ్లీ ఉండే రీతిలో దివ్యాంగులకు వాహనాలను డిజైన్ చేయాలంటూ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment