ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్‌ ఖాన్‌ సినిమా | Thurum Khanlu Movie Making Video | Sakshi
Sakshi News home page

ముగ్గురు పల్లెటూరి పిల్లగాండ్ల కథే తురుమ్‌ ఖాన్‌ సినిమా

Published Mon, May 15 2023 3:36 AM | Last Updated on Mon, May 15 2023 7:07 AM

Thurum Khanlu Movie Making Video - Sakshi

నిమ్మల శ్రీరామ్, దేవరాజ్‌ పాలమూర్, అవినాష్‌ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్‌ కామెడీ డ్రామా ఫిల్మ్‌ ‘తురుమ్‌ ఖాన్‌లు’. శివకల్యాణ్‌ దర్శకత్వంలో ఆసిఫ్‌ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్‌ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు.

‘‘తురుమ్‌ ఖాన్‌లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్‌ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్‌. ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, అఖిలేష్‌ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్‌ రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దేవరాజ్‌ పాలమూర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement