
సంచితా పదుకునే, శ్రీరామ్
‘‘రోజాపూలు, ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీరామ్. కొంత విరామం తర్వాత తెలుగులో ఆయన నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. కెమెరామేన్ ఎన్‌వీఆర్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సంచితా పదుకునే కథానాయికగా నటిస్తున్నారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఇటీవల ప్రారంభమైంది. నీలిమ మాట్లాడుతూ– ‘‘లవ్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది.
రెండు పాటలు, పతాక సన్నివేశాలు, పోరాటాలతో పాటు పలు కీలక సన్నివేశాల్ని రెండో షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం. మార్చి 31లోపు టాకీ పూర్తి చేస్తాం. మహావీర్ చక్కటి సంగీతాన్ని అందించారు. నెర్రపల్లి వాసు మంచి కథను సమకూర్చారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా తమకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీరామ్, సంచితా పదుకునే. ‘‘మా చిత్రంలో పాటలు, ఫైట్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. యూత్‌ని ఆకర్షించేలా పాటలుంటాయి’’ అని సహనిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment