Sanchita Padukone
-
నేను నేనే!
‘‘సినిమాల్లో మనం కాని పాత్రను పోషించడం బావుంటుంది. మన పాత్రనే మనం పోషించడం ఇంకా క్రేజీగా ఉంటుంది’’ అంటున్నారు కన్నడ భామ సంజన. ‘ముత్తుకుమార’ అనే కన్నడ సినిమాలో సంజన తన రియల్ లైఫ్ క్యారెక్టర్లోనే కనిపించనున్నారు. ధనుష్, సంచితా పదుకోన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సంజన కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయం గురించి సంజన మాట్లాడుతూ– ‘‘సక్సెస్ఫుల్ హీరోయిన్ పాత్రలో నేను కనిపిస్తాను. హీరో ఆశయం నెరవేరడానికి నేను సహాయం చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం సంజన ‘స్వర్ణ ఖడ్గం’ అనే టీవీ సీరియల్, ‘ఐవర్’ అనే తమిళ వెబ్ సిరీస్, ‘మాతే మాతే’ అనే కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
మంచి మలుపు
‘‘రోజాపూలు, ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీరామ్. కొంత విరామం తర్వాత తెలుగులో ఆయన నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. కెమెరామేన్ ఎన్వీఆర్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సంచితా పదుకునే కథానాయికగా నటిస్తున్నారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఇటీవల ప్రారంభమైంది. నీలిమ మాట్లాడుతూ– ‘‘లవ్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. రెండు పాటలు, పతాక సన్నివేశాలు, పోరాటాలతో పాటు పలు కీలక సన్నివేశాల్ని రెండో షెడ్యూల్లో చిత్రీకరిస్తాం. మార్చి 31లోపు టాకీ పూర్తి చేస్తాం. మహావీర్ చక్కటి సంగీతాన్ని అందించారు. నెర్రపల్లి వాసు మంచి కథను సమకూర్చారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా తమకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీరామ్, సంచితా పదుకునే. ‘‘మా చిత్రంలో పాటలు, ఫైట్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. యూత్‌ని ఆకర్షించేలా పాటలుంటాయి’’ అని సహనిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ అన్నారు. -
ఏం జరిగింది?
‘‘రోజాపూలు, ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో శ్రీరామ్. కొంత విరామం తర్వాత తెలుగులో ఆయన నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. కన్నడ బ్యూటీ సంచితా పదుకునే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కెమెరామెన్ ఎన్వీఆర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై నీలిమ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను సహ నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ వివరిస్తూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో కొనసాగే సస్పెన్స్ లవ్‌స్టోరీ ఇది. శ్రీరామ్, సంచితా పదుకునే జంట చక్కగా కుదిరింది. అందం, అభినయం కలగలిసిన అచ్చ తెలుగు అమ్మాయిలా సంచిత ఈ చిత్రంలో కనిపిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ చక్కటి పాటలు అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు మంచి కథను సమకూర్చారు. ఇప్పటివరకు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల రెండోవారంలో చివరి షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం. మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
ఏం జరిగింది?
శ్రీరాం, సంచితా పదుకొనే జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అసలేం జరిగింది’. కెమెరామేన్ ఎన్వీఆర్ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఎక్సోడస్ మీడియా బ్యానర్‌పై కె.నీలిమ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శ్రీరాం, డ్యాన్సర్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు. కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ఒక సస్పెన్స్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నందుకు యూనిట్‌కి అభినందలు తెలిపారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న కథాంశాన్ని ఎంచుకుని, ఆకర్షణీయమైన రీతిలో చిత్రీకరించే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కోవలోకే ‘అసలేం జరిగింది’ వస్తుంది’’ అన్నారు. ‘‘తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసి, మే చివరిలోపు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కె.నీలమ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకర్ రెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి, బొమ్మారం గ్రామ సర్పంచి శంకర్, లక్ష్మారెడ్డి, పాస్టర్ ప్రేమ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహావీర్. -
‘రచయిత’ మూవీ రివ్యూ
టైటిల్ : రచయిత జానర్ : పీరియాడిక్ డ్రామా తారాగణం : విద్యాసాగర్ రాజు, సంచితా పదుకొనే, శ్రీధర్ వర్మ సంగీతం : షాన్ రెహమాన్ దర్శకత్వం : విద్యాసాగర్ రాజు నిర్మాత : కళ్యాణ్ దూళిపాల్ల ప్రయోగాత్మక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్ లో తెరకెక్కిన మరో ఆసక్తికర చిత్రం రచయిత. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు. 1954 నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సంచితా పదుకొనే కీలక పాత్రలో నటించారు. పాటల రచయిత చంద్రబోస్, సీనియర్ నటుడు జగపతి బాబులు సపోర్ట్ చేయటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కిన రచయిత ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? ఈ ప్రయోగం ఎంత వరకు ఫలించింది..? కథ : ఆదిత్య వర్మ(విద్యాసాగర్ రాజు) ప్రముఖ కథా రచయిత. ఎన్నో విజయవంతమైన కథలు రాసిన ఆదిత్య వర్మ తన కొత్త కథను భయం నేపథ్యంలో రాయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం జనజీవనానికి దూరంగా ఓ నిర్మానుష్య ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. అదే సమయంలో 13 ఏళ్ల తన ప్రేమను గెలిపించుకునేందుకు పద్మావతి(సంచిత పదుకొనే) తల్లిదండ్రులను కలుస్తాడు. అప్పటికే పద్మావతికి మనోహర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అవుతుంది. కానీ ఓ ప్రమాదంలో మనోహర్ చనిపోవటంతో ఆ విషయాలను ఆదిత్య వర్మకు చెప్పకుండా పద్మావతిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఆమె తల్లిదండ్రులు. ఊరు మారితే ఆమె ఆలోచనలు మారుతాయన్న నమ్మకంతో ఆదిత్య వర్మతో పాటు పంపిస్తారు. పద్మావతి తన గతాన్ని మర్చిపోయి ఆదిత్య వర్మకు దగ్గరయ్యే సమయంలోనే ఆదిత్య వర్మ తన కథ మొదలు పెడతాడు. పద్మావతి జీవితంలో జరిగిన సంఘటనలే ఆదిత్య కథగా రాస్తుండటంతో పద్మావతిలో భయం మొదలవుతుంది. ఆదిత్య వర్మ రాసిన కథ ప్రకారం చనిపోయిన మనోహర్ తనకోసం ఆత్మగా మారాడని భయపడుతుంది. నిజంగానే మనోహర్ దెయ్యంగా మారాడా..? అసలు మనోహర్ ఎలా చనిపోయాడు..? చివరకు ఆదిత్య వర్మ, దీపికలు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా ప్రధానంగా రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కీలకమయిన రచయిత పాత్రలో విద్యాసాగర్ రాజు మంచి నటన కనబరిచాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో కథను ముందుకు నడిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సంచిత పదుకొనే మంచి నటన కనబరించింది. భయానికి, ప్రేమకు మధ్య నలిగిపోయే అమ్మాయి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. 50ల కాలం నాటి అమ్మాయిగా హుందాగా కనిపించి మెప్పించింది. అదే సమయంలో గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీధర్ వర్మ పరవాలేదనిపించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఆదిత్య వర్మ దగ్గర శిష్యరికం చేసేందుకు వచ్చిన నటుడు మాత్రం తన అతితో కాస్త విసిగిస్తాడు. విశ్లేషణ : ఓ రీవేంజ్ డ్రామాకు 1954 నాటి నేపథ్యం తీసుకున్న దర్శకుడు కథనాన్ని ఆసక్తికరంగా నడిపించటంలో విజయం సాధించాడు. ఆ కాలం నాటి పరిస్థితులను, దుస్తులు, వాతావరణం చూపించేందుకు చిత్రయూనిట్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అయితే డిటెయిలింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహిరంచి ఉంటే బాగుండేది. తను చెప్పాలను కున్న విషయాన్ని ప్రేక్షకులకు పోయటిక్‌గా చెప్పాలన్న ఉద్దేశంతో అవసరానికి మించిన డైలాగ్ లు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో పాత్రలు అవసరానికి మించి డైలాగ్ లు చెప్తూ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో నటీనటుల హావభావాలు కూడా 50ల కాలం నాటి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తాయి. గ్రాఫిక్స్ మాత్రం ఆకట్టుకునేలా లేవు. కారు ప్రయాణంలో వచ్చే సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి. షాన్ రెహమాన్ అందించిన స్వరాలతో పాటు చంద్రబోస్ సాహిత్యం బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు, సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా, కథనం పాటలు మైనస్ పాయింట్స్ : కొన్ని సన్నివేశాల్లో విసిగించే డైలాగ్స్ గ్రాఫిక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అన్ని అడ్డంకులను దాటిన రచయిత
‘‘చిన్న సినిమాల విడుదలలో చాలా ఇబ్బందులున్నాయంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. ‘రచయిత’ సినిమా విడుదలకు నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సినిమాని రంజిత్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్లో నైజాంలో రిలీజ్ చేస్తున్నాం. ఇదొక పక్కా తెలుగు సినిమా’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. విద్యాసాగర్ రాజు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రచయిత’. సంచిత పదుకొనే కథానాయిక. కల్యాణ్ ధూళిపాళ్ల నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాత ధూళిపాళ్ల మాట్లాడుతూ– ‘‘సినిమా నిర్మించడం ఒక ఎత్తయితే.. రిలీజ్ చేయడం మరో ఎత్తని ‘రచయిత’ రిలీజ్ విషయంలో నాకు తెలిసింది. మా సినిమా అడ్డంకులను అధిగమించడానికి కృషి చేసిన దామోదరప్రసాద్, రామదాసు, హీరో జగపతిబాబులకు ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎమోషన్ థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఒక అమ్మాయి మనసు లోతు ఎంత ఉంటుందో చూపించాం. చంద్రబోస్ మూడు పాటలకు అద్భుతమైన లిరిక్స్ అందించారు’’ అన్నారు విద్యాసాగర్ రాజు. నిర్మాత ముత్యాల రామదాస్, పాటల రచయిత చంద్రబోస్, సంచిత పదుకొనే తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛమైన ప్రేమకథ
విద్యాసాగర్ రాజు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘రచయిత’. సంచితా పదుకొనే కథానాయిక. కల్యాణ్ ధూలిపల్ల నిర్మించిన ఈ సినిమా ఈనెల 16న విడుదలవుతోంది. ‘‘స్వచ్ఛమైన, అందమైన ప్రేమకథగా రూపొందిన చిత్రమిది. 1950 నేపథ్యంలో కథ సాగుతుంది. వైజాVŠ లో వేసిన భారీ సెట్లో తీసిన కీలక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈనెల 10న ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం’’ అన్నారు కల్యాణ్ ధూలిపల్ల. ఈ చిత్రానికి సంగీతం: షాన్ రెహమాన్, నేపథ్య సంగీతం: జీవన్.బి, కెమెరా: సాయిశ్రీరామ్. ∙సంచిత, విద్యాసాగర్‌రాజు -
భయం తెచ్చిన మార్పు..!
భయానికి భాష లేదు. ఏదొక సిచ్యువేషన్లో ఎవరైనా భయపడాల్సిందే. అలాంటి భయం ఒక మనిషి జీవితాన్ని కంప్లీట్‌గా మార్చి వేసింది. అతనెందుకు భయపడ్డాడు? ఆ భయం అతనిలో తెచ్చిన మార్పు ఏంటి? అన్న విషయాల నేపథ్యంలో ‘రచయిత’ అనే సినిమా రూపొందుతోంది. హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో విద్యాసాగర్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాను దుహర మూవీస్ పతాకంపై కల్యాణ్ ధూలిపల్ల నిర్మించారు. సంచితా పదుకొనె కథానాయిక. సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. త్వరలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. నిర్మాత కల్యాణ్ ధూలిపల్ల మాట్లాడుతూ–‘‘1950 బ్యాక్‌డ్రాప్‌లో సాగే థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ చిత్రమిది. పీరియాడికల్ మూవీ కావడంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాతో డైరెక్టర్ కమ్ హీరో విద్యాసాగర్ రాజు ప్రేక్షకులను మెప్పిస్తాడు. మా సినిమాకి ఒక స్టార్ నటుడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఒక సినిమాకి బ్రాండ్షిప్ చేయడం అనేది ఇదే మొదటిసారి’’ అన్నారు. శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ, ముణిచంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: షాన్ రెహమాన్, కెమెరా: సాయి శ్రీరామ్. -
నేను అమాయకురాలిని
అబ్బో నేను అమాయకురాలిని అంటున్నారు వర్ధమాన హీరోయిన్ సంచిత పదుకొనే. తెలుగు, తమిళ, కన్నడ భాష చిత్రాల్లో బుడిబుడి అడుగులు దాటుకుని వడి వడి అడుగులకు చేరుకుంటున్నారు సంచిత పదుకొనే. తొలి చిత్రంతోనే కెరీర్ బ్రేక్ రావడం సినీ ప్రయాణం ఆమెకు సులువుగా మారింది. అంతేకాదు పొరుగు భాషల్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం చేసింది. మూడు భాషల్లో కలిపి చేసింది ఆరు సినిమాలే అయినా ఆశించిన దానికంటే ఎక్కువగానే గుర్తింపు తెచ్చుకున్నారు సంచిత. మాతృభాష కన్నడంపై మమకారంతోపాటు తమిళంపై తరగని ప్రేమ, తెలుగుదనంపై తీయనైన తపన ఉందంటున్నారు సాక్షితో సంచిత పదుకొనే. దక్షిణాది భాషలన్నింటిలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆకాంక్ష. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడంతో మూడు దక్షిణాది భాషల్లో నటించాను. మలయాళం ఒక్కటే మిగిలి ఉంది. నటిగా నా కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి విశ్లేషించుకుంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. బెంగళూరులో నివాసం ఉంటూ హైదరాబాద్‌లో షూటింగులకు హాజరుకావడం కష్టం కాబట్టి నా మకాంను శాండల్‌వుడ్ నుంచి టాలివుడ్‌కు మార్చుకుంటున్నాను. త్వరలో హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నాను. తెలుగు చిత్రసీమలో నా అభిమాన హీరోహీరోయిన్లు ఎవరంటే ప్రభాస్, అనుష్క అనే చెబుతాను. అనుష్క నటించిన కాదు...కాదు జీవించిన అరుంధతి సినిమాలోని పాత్రలాంటిది చేయాలని ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో నటిగా సత్తా చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గట్స్ ఉన్న పాత్రలంటే మరీ ఇష్టం. ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రాల్లో చూడామణి సినిమాలో హార్రర్ పాత్ర పోషిస్తున్నాను. నటనకు అవకాశం ఉన్న పాత్ర వచ్చింది. కన్నడం మాతృభాషతోపాటు తమిళం, తెలుగు సినిమాల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకునేందుకు కృషి చేస్తున్నాను. నటన, నాట్యంలో శిక్షణ తీసుకోలేదు, అమాయక విద్యార్థినిగా ఉన్న నేను అసలు నటిని ఎలా అయ్యాను అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నాలోని నటిని వెలికితీసి ప్రేక్షకులు మెచ్చేలా నన్ను తీర్చిదిద్దిన దర్శకులకు, అవకాశాలు ఇచ్చిన నిర్మాతలకు, నా హీరోలకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చెన్నై : మాది కర్ణాటక రాష్ట్రం మంగళూరు. మా ఫ్యామిలీలో ఎవ్వరూ సినిమా రంగంలో లేరు. నాకు కూడా సినిమా నటిని అవ్వాలనే కోరికా ఉండేది కాదు. విద్యార్థిగా కూడా నేను చాలా అమాయకురాలిని. నేనేంటో, నా చదువేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. పెద్ద చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని కలలు కనేదాన్ని. ‘మ్యాన్ ప్రపోజల్..గాడ్ డిస్పోజల్’ అన్నట్లుగా (మనిషి ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తాడు) దైవం నన్ను సినిమా నటిగా దీవించాడు. అందుకే సినిమా అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ప్లస్‌టూ చదువుకుంటున్న సమయంలో అంటే 2009లో నీలకంఠ అనే మా మామ నా మిత్రుడు సినిమా తీస్తున్నాడు, నీవు చేయాలి అన్నాడు. అయ్యో నేరుగా సినిమాల్లోకే నాకు నటన ఏమీ తెలియదు అని నిరాకరించా. మొదట్లో ఎవ్వరికీ తెలియదు, క్రమేణా అందరూ నేర్చుకుంటారు అని నచ్చజెప్పి ఒప్పించాడు. అలా నా జీవితంలో తొలి తెరంగేట్రం కన్నడ సినిమా రావణతో మొదలైంది. తమిళ మాతృక కాదల్‌కొండేన్ చిత్రానికి ఇది రీమేక్. రావణ సూపర్ డూపర్ హిట్ కావడంతో మొదటి చిత్రమే హీరోయిన్గా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు వరుసగా అవకాశాలు రావడంతో చదువుకు కూడా బ్రేక్ పడింది. తొలి చిత్రం రావణ సెట్స్‌పై ఉన్నపుడే రెండవ సినిమా నా అభిమాననటుడు విజయ్‌తో వేట్టైక్కారన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. హీరోయిన్ కాకపోయినా గుర్తింపు ఉన్న పాత్ర, పైగా నా అభిమాన హీరో కావడంతో ఆనందంగా ఓకే చెప్పేశాను. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. మూడవ సినిమా పిళ్లైయార్ తెరు కడసివీడు కూడా తమిళమే. ఆ తరువాత తెలుగు సినిమా పరంపర ప్రారంభం అయింది. నాల్గవ సినిమా చమ్మక్ చల్లో, ఐదవ సినిమా ‘చూడామణి’, ఆరవ సినిమా ‘క్రూరుడు..కాని ప్రేమికుడు’ అన్నీ తెలుగు సినిమాలే. ఒకటి పూర్తికాగా, మిగిలిన రెండు సెట్స్‌పై ఉన్నాయి. తొలి సినిమాలో యోగేష్ హీరోగా నటించగా, విజయ్, జతిన్ రమేష్, వరుణ్ సందేశ్, నవీన్ సంజయ్, ఓంకార్ ఇలా వరుసగా ఇప్పటి వరకు నా హీరోలు. -
రొమాంటిక్ థ్రిల్లర్
ఖయ్యుమ్, సంచితా పదుకొనే జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. కేదారేశ్వరరెడ్డి దర్శకుడు. షేక్ అలీబాషా నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిదనీ, సింగిల్ షెడ్యూల్లో వైజాగ్, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేశ్ వర్మ. -
‘విల్లా’లో ఏం జరిగింది?
అశోక్ సెల్వన్, సంచిత పదుకొనే జంటగా దీపన్.ఆర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రం ‘విల్లా’. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ‘విల్లా’(పిజ్జా-2) పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు ఎస్.కె.ఎన్, శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘మా సంస్థలో మరో హిట్‌గా ‘విల్లా’ నిలుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే థ్రిల్లర్ చిత్రమిది. వచ్చేవారంలో పాటల్ని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: దీపక్‌కుమార్, ఎడిటింగ్: లియోజాన్పాల్.