‘విల్లా’లో ఏం జరిగింది?
‘విల్లా’లో ఏం జరిగింది?
Published Tue, Sep 24 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
అశోక్ సెల్వన్, సంచిత పదుకొనే జంటగా దీపన్.ఆర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రం ‘విల్లా’. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ‘విల్లా’(పిజ్జా-2) పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు.
అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు ఎస్.కె.ఎన్, శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘మా సంస్థలో మరో హిట్‌గా ‘విల్లా’ నిలుస్తుంది.
ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే థ్రిల్లర్ చిత్రమిది. వచ్చేవారంలో పాటల్ని, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: దీపక్‌కుమార్, ఎడిటింగ్: లియోజాన్‌పాల్.
Advertisement
Advertisement