విల్లా కొంటే.. లంబోర్ఘిని కారు ఫ్రీ | Buy Villa and Get The Lamborghini Car Free | Sakshi
Sakshi News home page

విల్లా కొంటే.. లంబోర్ఘిని కారు ఫ్రీ

Nov 2 2024 1:03 PM | Updated on Nov 2 2024 1:54 PM

Buy Villa and Get The Lamborghini Car Free

భారతదేశంలోని చాలామంది వాహన ప్రియులు జీవితంలో ఒక్కసారైనా లంబోర్ఘిని కారును డ్రైవ్ చేయాలనుకుంటారు. అయితే దీని ధర రూ. కోట్లలో ఉండటం వల్ల అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి కారు ఫ్రీగా ఇస్తానంటే? ఎవరు మాత్రం వద్దంటారు. అయితే లంబోర్ఘిని కారు కావాలంటే.. ఓ విల్లా కొనాల్సి ఉంటుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ గ్రీన్స్ ఈ ప్రకటన చేసింది. ఇందులో లగ్జరీ విల్లా కొనుగోలు చేసినవారికి రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని కారును ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ ఓ విల్లా కొనుగోలు చేయాలంటే.. రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

విల్లా కోసం రూ. 26 కోట్లు చెల్లిస్తే అంతటితో సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కారు పార్కింగ్ చేయడానికి, క్లబ్ మెంబర్‌షిప్ కోసం, గోల్ఫ్ కోర్స్ కోసం ఇలా దాదాపు మరో రూ. కోటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement