దీపావళి ముగియగానే బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర రెండో రోజు గరిష్టంగా రూ. 160 తగ్గింది. దీంతో ఈ రోజు (నవంబర్ 2) మళ్ళీ గోల్డ్ రేటు పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.
చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ.150, రూ.160 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 160 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.
వెండి ధరలు
బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 3000 తగ్గిన వెండి ఈ రోజు ఎలాంటి పెరుగుదలను, తగ్గుదలను నమోదు చేయలేదు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment