Gold markets
-
మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!
అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నవంబర్ ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. అయితే గత రెండు రోజులుగా ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు (నవంబర్ 4) దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి?.. ఏ రాష్ట్రంలో గోల్డ్ రేటు ఎక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గత మూడు రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?ఢిల్లీలో గోల్డ్ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.చెన్నైలో కూడా పసిడి ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
దీపావళి ముగియగానే బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర రెండో రోజు గరిష్టంగా రూ. 160 తగ్గింది. దీంతో ఈ రోజు (నవంబర్ 2) మళ్ళీ గోల్డ్ రేటు పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు గోల్డ్ ధరలు వరుసగా రూ.150, రూ.160 తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు పసిడి ధర రూ.150, రూ.160 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. దేశ రాజధాని నగరంలో కూడా ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి రేటు రూ. 160 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,06,000 వద్ద నిలిచింది. నిన్న రూ. 3000 తగ్గిన వెండి ఈ రోజు ఎలాంటి పెరుగుదలను, తగ్గుదలను నమోదు చేయలేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
భారతదేశంలో పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి, నేడు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. చెన్నై, బెంగళూరులో ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? అనే వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు 57500 (22 క్యారెట్స్), రూ.62730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో నిన్న రూ. 250 నుంచి రూ. 270 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఈ రోజు పసిడి ధరలు రూ. 58000 (22 క్యారెట్స్), రూ. 63230 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 100 తగ్గి 57650 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 110 తగ్గి 62880 రూపాయలకు చేరింది. నిన్న రూ. 250 నుంచి రూ. 280 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కొంత తగ్గాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా ఈ రోజు వెండి ధరలు కూడా రూ. 700 (కేజీ) తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా వెండి ధరలు తగ్గాయి. -
World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత రిటైల్ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్ స్టోర్లు రిటైల్ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్‌లో జ్యుయలరీ మార్కెట్ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్‌లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది. సానుకూలతలు.. వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్ మార్కింగ్ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్టీ, డీమోనిటైజేషన్ ఇవన్నీ కూడా భారత్‌లో చైన్ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది. నిర్మాణాత్మక మార్పులు ‘‘భారత రిటైల్ జ్యుయలరీ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్ స్టోర్లు మరింత మార్కెట్ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. -
పసిడి ధరలు పటిష్టమే..!
న్యూఢిల్లీ/న్యూయార్క్: పసిడి బులిష్ ట్రెండ్ కనబడుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి .. ప్రత్యేకించి అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రత, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అమెరికా ఆర్థికాభివృద్ధి మళ్లీ మాంద్యంలోకి జారిపోతుందన్న అంచనాలు, దీనితో వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడ్ మొగ్గు చూపిస్తుందన్న విశ్లేషణలు పసిడికి బలాన్ని ఇస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఒక తక్షణం ఒక సురక్షిత సాధనంగా ఎంచుకుంటున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్‌ల నేపథ్యంలో– శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ఒకేరోజు 28 డాలర్లు ఎగిసి 1,537 డాలర్లకు పెరిగింది. ఇది వారం వారీగా 16 డాలర్ల పెరుగుదల. 1,546 డాలర్లు ఈ ఏడాది గరిష్టం కావడం గమనార్హం. 1,360 డాలర్ల కీలక నిరోధాన్ని దాటిన తర్వాత పసిడి వేగంగా 1,546 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. రానున్న వారం రోజుల్లో పసిడి 1,600 డాలర్ల స్థాయిని చేరడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఇక దేశీయంగా చూసినా పసిడి రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా పసిడి బలపడ్డంతోపాటు, డాలర్ మారకంలో రూపాయి (శుక్రవారం 71.66 వద్ద ముగింపు)బలహీన ధోరణి కూడా దేశీయంగా పసిడికి కలిసివస్తోంది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ ఎంసీఎక్స్‌లో పసిడి ధర 10 గ్రాములకు రూ.38,765 వద్ద ఉంది. -
1350 డాలర్లు దాటేయొచ్చు!!
గడిచిన ఏడాది కాలంగా చూస్తే గత వారంలో పసిడి మార్కెట్ అత్యుత్తమ పనితీరు కనపర్చింది. ఇదే ఊపు కొనసాగిస్తే.. కీలకమైన దీర్ఘకాలిక నిరోధ స్థాయి 1,350 డాలర్ల మార్కును సమీప కాలంలోనే దాటేసేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ కల్పన గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో బంగారం ధరలు మళ్లీ 1,350 డాలర్ల చేరువకు దగ్గరయ్యాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో ఆగస్టు కాంట్రాక్టుకు సంబంధించి పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 2.7 శాతం పెరిగి ఒక దశలో 1,347.10 డాలర్లుగా ట్రేడయ్యింది. గత నెలలో కనీసం 1,77,000 ఉద్యోగాల కల్పన జరగవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినప్పటికీ .. వాస్తవానికి కేవలం 75,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరగడం పసిడి ర్యాలీకి కారణమైనట్లు ఆర్థికవేత్తలు తెలిపారు. పసిడి మరింత అధిక స్థాయికి పరుగులు తీసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆర్జేవో ఫ్యూచర్స్ సంస్థ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఫిలిప్ స్ట్రీబుల్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఔన్సుకు 1,400 డాలర్లకు కూడా చేరగలిగేంత సత్తా కనిపిస్తోందని పేర్కొన్నారు. అయితే, ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని గట్టి నిరోధ స్థాయులు కూడా ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. 2015లో కనిష్ట స్థాయిని తాకినప్పట్నుంచి 1,350 నిరోధ స్థాయిని పసిడి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు పరీక్షిస్తూ వస్తోంది. ఏదైతేనేం.. పసిడి రేటు 1,350కి పైన పటిష్టంగా ముగిసిన పక్షంలో మధ్య కాలికంగా ఆ తర్వాత 1,360, 1,375 స్థాయులకు చేరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
స్వర్ణ కాంతులు..
నేడు దంతెరాస్... నగరంలో ముస్తాబైన జ్యువెలరీ షాపులు పెరగనున్న స్వర్ణాభరణాల విక్రయాలు సందడిగా మారనున్న గోల్డ్ మార్కెట్లు 20 శాతం వ్యాపారం పెరుగుతుందని అంచనాలు సిటీబ్యూరో: మహానగరం స్వర్ణకాంతులు సంతరించుకుంటోంది. అంగరంగవైభవంగా ఐదు రోజులపాటు జరిగే దీపావళి పర్వదినం తొలి రోజున(సోమవారం)వచ్చే దంతెరాస్(ధన త్రయోదశి)కు...నగరంలోని ప్రతి ఇళ్లు, ప్రతి దుకాణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. పురాణేతిహాసాల ప్రకారం..పాలసముద్రం చిలికినపుడు దంతెరాస్ రోజున శ్రీమహాలక్ష్మి అవతరించింది. లక్ష్మీదేవిని ఈ రోజున యథాశక్తి పూజిస్తే అనంత శుభాలు, అష్టైశ్వర్యాలు సమకూరుతాయని, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే క్రమంలో ఎంతో కొంత సువర్ణాన్ని కొనుగోలు చేస్తే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇదే విశ్వాసంతో ఉన్న మహిళలకు నగరంలోని ప్రముఖ స్వర్ణ, వజ్రాభరణాల దుకాణాలు పలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. బంగారం ధర ఎక్కువైనా నాణ్యత, మన్నిక, ఆకర్షణ, హోదాకు చిహ్నం అని భావిస్తుండడంతో పలువురు మహిళలు, ఉద్యోగులు తమ స్తోమతను బట్టి స్వర్ణాభరణాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. దీంతో నగరంలోని అబిడ్స్, కోఠి, అమీర్‌పేట్, బషీర్‌బాగ్, బంజారాహిల్స్,చార్మినార్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ తది తర ప్రాంతాల్లో ఉన్న బంగారు, వజ్రాభరణాల దుకాణాలు ప్ర త్యేక అమ్మకాలకు సిద్ధమయ్యా యి. వినియోగదారుల సందడితో నేటి నుంచి దుకాణాలు కిటకిటలాడే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధనలక్ష్మి పూజావిధానంలో నూతనంగా కొనుగోలు చేసిన స్వర్ణాభరణాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని వేదపండితులు సైతం సెలవిస్తుండడంతో ఆభరణాల అమ్మకాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం బంగా రం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం(పదిగ్రాములు) కు రూ.26 వేలు, 22 క్యారెట్ల బంగారం(పదిగ్రాములు)కు రూ.24,310 ఉందని వ్యాపారులు తెలిపారు. రోజురోజుకూ ధరవరల్లో మార్పులు అనివార్యమని చెప్పారు. మహానగర వ్యాప్తంగా వజ్రాభరణాల, స్వర్ణాభరణాల వ్యాపా రం ఈ దీపావళి పర్వదినం సందర్భంగా సుమారు రూ.50 కోట్లకు పైమాటేనని తెలి పారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడు సతమౌతున్నప్పటికీ దంతెరాస్ సెంటిమెంట్‌ను గౌరవించేవారూ లేకపోలేదని.. దీంతో గతేడాదితో పోలిస్తే బంగారం, ఆభరణాల అమ్మకాల్లో సుమారు 20 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నామన్నారు. ఇక ఆదివారం రాత్రి నుంచే పలు బంగారం దుకాణాల్లో సందడి కన్పిం చింది. షాపులను ప్రత్యేకంగా అలంకరించడం..ఆఫర్లు ప్రకటించడం..వెరైటీ ఆభరణాలు తయారు చేయడం ద్వారా ఆకర్షిస్తున్నారు.