
న్యూఢిల్లీ: పెట్టుబడులకు కీలకమైన వైవిధ్య సాధనంగా బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంతనాగేశ్వరన్ అన్నారు. బంగారం విలువను కాపాడుకునే సాధనంగానే (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) కాకుండా, ఆభరణంగా, పోర్ట్‌ఫోలియోకి వైవిధ్యంగా నిలస్తుందన్నారు. అప్పటికి యావ్ ప్రపంచం అంతర్జాతీయంగా ఒకే మానిటరీ వ్యవస్థకు చేరుకుంటుందన్నారు.
ఐజీపీసీ–ఐఐఎంఏ బంగారం మార్కెట్ల వార్షిక సదస్సులో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. బంగారం ధర గతేడాది 27 శాతం మేర పెరగ్గా, ఈ ఏడాది ఇప్పటికే 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విలువను కాపాడుకునే సాధనంగా బంగారం పాత్రను పలుచన చేయకుండానే, బంగారం నిల్వలను ఉత్పాదకత పెంపునకు వినియోగించడానికి మార్గాలను భారత్ కొనుగొనాల్సి ఉందన్నారు.
ఇక్కడే విధానపరమైన సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు. గతంలో మాదిరి బంగారం మానిటైజేషన్ (నగదుగా మార్చుకోవడం) తరహా చర్యలను పరిశీలించాలన్నారు. 2015లో బంగారం మానిటైజేషన్ పథకాన్ని కేంద్రం ప్రకటించడం గమనార్హం. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా దానిపై వడ్డీని పొందే పథకం అది. దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర నాడు దీన్ని తీసుకొచి్చంది. ఆ తర్వాత కొన్నాళ్లకే మరుగునపడింది.
రుణ భారం మరింత పెరిగితే కష్టమే..
నేడు ప్రపంచ రుణ భారం జీడీపీతో పోల్చితే ఎన్నో రెట్లకు పెరిగిందని అనంతనాగేశ్వరన్ తెలిపారు. ‘‘ఆ స్థాయి అధిక రుణ భారం తలనొప్పిగా మారుతుంది. భవిష్యత్ ఆదాయం వడ్డీ చెల్లింపులకే వెళుతుంది. అభివృద్ధికి పెద్దగా మిగిలేది ఉండదు. అధిక రుణ భారం నేపథ్యంలో దేశాలు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించుకుని రుణం విలువను తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు’’అని నాగేశ్వరన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment