![Is This The Right Time To Invest In Gold Here's What Experts Say](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/gold-market.jpg.webp?itok=fv8cGVqj)
సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 87,000 దాటేసింది. డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా.. స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓవైపు పసిడి ధరలు పెరుగుతుంటే.. మరోవైపు రూపాయి (డాలర్‌తో పోలిస్తే) బలహీనపడుతోంది. ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది.
స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి లేదా భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగారం మీద పెట్టుబడి సురక్షితమని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రజలు తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల.. బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది. డిమాండ్ పెరగడం వల్ల పసిడి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా రష్యా - ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. రూపాయి పతనం అయినప్పుడు.. ప్రజల చూపు డాలర్ మీద లేక.. బంగారం మీద పడుతుంది.
ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా?
స్టాక్ మార్కెట్ల మాదిరిగానే.. బంగారం భవిష్యత్తు మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయాలు లేదు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు ఇలాగే పెరుగుతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. రేటు తగ్గిన ప్రతిసారీ తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొనేవారు.. ఆభరణాలు లేదా బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కానీ తయారీ చార్జీలు వంటి వాటిని బేరీజు వేసుకోవాలి.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీతో లవ్.. హృదయాన్ని కదిలించిన సమాధానం!
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదో మంచి అవకాశం . అయితే ఈ ట్రెండ్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment