అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. నవంబర్ ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. అయితే గత రెండు రోజులుగా ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు (నవంబర్ 4) దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి?.. ఏ రాష్ట్రంలో గోల్డ్ రేటు ఎక్కువగా ఉందనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.80,400.. 22 క్యారెట్ల ధర రూ.73,700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే గత మూడు రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.
ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?
ఢిల్లీలో గోల్డ్ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధర కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ రాజధానిలో బంగారు ధర రూ. 80,550 (10 గ్రా 24 క్యారెట్స్), రూ. 73,800 (10 గ్రా 22 క్యారెట్స్) వద్ద ఉంది.
చెన్నైలో కూడా పసిడి ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.80,400 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.73,700 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment