వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలు | Today Gold And Silver Prices March 27th, 2025 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలు

Published Thu, Mar 27 2025 10:11 AM | Last Updated on Thu, Mar 27 2025 10:34 AM

Gold and Silver Price Today 27 March 2025

ఎండాకాలంలో వచ్చిన వానలాగా.. అలా వచ్చి ఇలా వెళ్లినట్లు, బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గి.. మళ్ళీ అమాంతం పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 110 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,350 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,840 వద్ద ఉంది.

ఇదీ చదవండి: జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (మార్చి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దనే ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement