important
-
వ్యవసాయ రంగమే దేశాభివృద్ధికి కీలకం
సాధారణంగా దేశాభి వృద్ధికి పారిశ్రామిక రంగం, సేవల రంగం కీలక మైనవి. దీనికి భిన్నంగా మన దేశంలో వ్యవ సాయ రంగమే కీలక రంగంగా మారింది. మూల ధన సాంద్రత, సాంకే తిక పరమైన వనరుల ఉపయోగంతో పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. ఇక సేవల రంగంలోనైతే మానవ వనరుల నైపుణ్యం అంతంత మాత్రంగా ఉండడం వలన ఆ రంగ పురోగ మనం స్వల్పంగానే ఉంది. ఫలితంగా దేశ ప్రగ తికి వ్యవసాయ రంగమే నేడు ఆధారంగాఉంది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతు. 1950లలో 70 శాతం దేశ ప్రజలు వ్యవ సాయ రంగం పైనే ఆధారపడి ఉండేవారు. ఆ శాతం 2024 నాటికి 54.6 శాతంగా ఉంది.అంటే ఇంకా ఎక్కువగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడే జీవిస్తున్నారన్నమాట! సాగు భూమి విస్తీర్ణం కూడా అమెరికా, చైనా తరువాత మన దేశంలోనే ఎక్కువ. అయితే రైతులకు ఇచ్చిన హామీలను మన పాలకులు నెరవేర్చనందు వలన పెట్టుబడికి చేసిన అప్పుకు వడ్డీ కూడా చెల్లించలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. గత 30 ఏళ్లలో రైతులు, రైతు కూలీలు నాలుగు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా తెలియజేస్తోంది. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధరను కల్పించి, వాటిని కొనుగోలు చేసినప్పుడే రైతులు సుభిక్షంగా ఉంటారు. అలాగే దేశం కూడా! పొరుగు దేశమైన చైనాతో పోల్చుకుంటే మన రైతుల పరిస్థితి కడు దయనీయంగాఉంది. 1980లో మనదేశంలో రైతుల తలసరి ఆదాయం 582 డాలర్లు కాగా, చైనాలో 307 డాలర్లు మాత్రమే! 2024 వచ్చేటప్పటికి చైనాలో రైతుల తలసరి ఆదాయం 25,015 డాలర్లకు పెరగగా మన రైతులు 10,123 డాలర్లు మాత్రమే పొందగలిగారు.రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర లభించ కపోవడంతో 1990–91లో వ్యవసాయ రంగ వాటా జీడీపీలో 35 శాతం కాగా... 2022–23 లో 15 శాతానికి పడిపోయింది. వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామిక జనాభా మాత్రం 60 శాతం వరకు ఉంది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా... దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు. శాశ్వత పేదరికం నుండి రైతు లను బయట పడేయడానికి ఏకైక మార్గం వ్యవ సాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్ట బద్ధమైన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం మార్కె ట్లను అస్తవ్యస్తం చేస్తుందని కేంద్రం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలపడం గమనార్హం.1991లో నూతన ఆర్థిక విధానాన్ని చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం నుండి శ్రామి కులు పారిశ్రామిక రంగానికి బదిలీ అవుతారని భావించడం జరిగింది. అలాగే గ్లోబలైజేషన్ వలన వ్యవసాయ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లోకి వెళ్లడం వలన రైతులు లాభపడతారని అను కున్నారు. ఈ విధానం వచ్చి 30 ఏళ్లు గడిచి పోయాయి. అయినా అనుకున్నవేవీ జరగలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆశయాలలో ముఖ్యమైనవి–విదేశీ వాణిజ్యం ద్వారా ప్రపంచ దేశాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉద్యోగ కల్పన చేయడం, ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుని లాభాలను ఆర్జించేటట్లు చేయడం! ఈ నేపథ్యంలో మన పాలకులప్రపంచ దేశాల ఆకలి తీర్చుతున్న భారత రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో అమ్మి లాభాలు పొందే విధంగా కార్యాచరణ చేప ట్టాలి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు సమ కూర్చిన వనరులకు సమానంగా రైతులకు కూడా ఇచ్చినప్పుడే దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటుంది.డా. ఎనుగొండ నాగరాజ నాయుడు వ్యాసకర్త రిటైర్డ్ ప్రిన్సిపాల్మొబైల్: 98663 22172 -
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్‌పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్‌ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్‌కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్‌లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్‌లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రహసనమేమీ కాదు
సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగం సహా వివిధ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఆయా సర్టిఫికెట్ల ధృవీకరణ అత్యంత కీలకం, అనివార్యం. సాంకేతికంగా అటెస్టేషన్, అపోస్టిల్గా పిలిచే ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనం అనే భావన అనేకమందిలో ఉంది. ఈ కారణంగానే ఏజెంట్లను ఆశ్రయించి అధిక మొత్తం చెల్లించడమో, ఢిల్లీ వరకు వెళ్లి దీన్ని పూర్తి చేసుకోవడమో జరుగుతోంది. అయితే.. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అ«దీనంలో ఉన్న బ్రాంచ్ సెక్రటేరియట్ ఈ ప్రక్రియల్ని చేపడుతుందని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ (ఆరీ్పఓ) జొన్నలగడ్డ స్నేహజ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆమె బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు ఒకే బ్రాంచ్ సెక్రటేరియట్ విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే విద్యార్హత పత్రాలతో పాటు జనన, వివాహ ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధం అంశాల్లో కమర్షియల్ డాక్యుమెంట్లు సైతం అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి అయితేనే ఆయా దేశాల్లో ఆ సర్టిఫికెట్ల చెల్లుబాటవుతాయి. దరఖాస్తుదారులు సమరి్పంచే పత్రాలను పరిశీలించి, సరిచూసి అవి సరైనవే అంటూ సరి్టఫై చేయడాన్నే అటెస్టేషన్, అపోస్టిల్ అంటారు. ఇందులో భాగంగా ఆయా ధ్రువపత్రాలకు వెనక అపోస్టిల్ స్టిక్కర్‌తో పాటు స్టాంపు, సంతకం చేస్తారు. ఈ సేవల్ని అందించడం కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దేశ వ్యాప్తంగా బ్రాంచ్ సెక్రటేరియట్లను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించింది సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అ«దీనంలో ఉంది. దరఖాస్తులను సచివాలయాల్లో సమర్పించాలి ధ్రువీకరణ ప్రక్రియల్ని ఆర్పీఓ అధీనంలోని బ్రాంచ్ సెక్రటేరియట్ చేస్తున్నప్పటికీ.. దరఖాస్తుదారులు మాత్రం నేరుగా సంప్రదించే అవకాశం లేదు. ఆయా రాష్ట్ర సచివాలయాల్లోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో పని చేసే కౌంటర్లలోనే పత్రాలు సమరి్పంచాల్సి ఉంటుంది. దీనికి ముందు మీ సేవ, ఆన్లైన్ విధానాల్లో నిరీ్ణత రుసుము చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ విభాగం అధికారులు ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన విద్యా సంస్థ, ప్రభుత్వ విభాగం, చాంబర్లను సంప్రదించి వాటి విశ్వసనీయతను నిర్ధారించే జీఏడీ సిబ్బంది అథంటికేట్ అంటూ స్టాంప్ వేసి, సంతకం చేసి దరఖాస్తుదారుకు తిరిగి ఇస్తారు. ఈ పక్రియలో నూ సాధారణ, తత్కాల్ అనే విధానాలు అమలులో ఉన్నాయి. ఆపై దరఖాస్తుదారు ఎంఈఏ అ«దీకరణ తో పని చేసే ఏజెన్సీల ద్వారా ఈ సర్టిఫికెట్లను ఆర్పీ ఓ బ్రాంచ్ సెక్రటేరియట్‌కు పంపాల్సి ఉంటుంది. అదే రోజు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి రాష్ట్ర ప్రభుత్వం అదీనంలో ఉండే జీఏడీ నుంచి ఆర్పీఓలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు అదీకృత అధికారుల వివరాలను చేరతాయి. వీరి వివరాలు, సంతకాలు, స్టాంపులను ఆయా ఏజెన్సీల నుంచి వచ్చిన దరఖాస్తుదారు సర్టిఫికెట్లపై ఉన్న వాటితో సరిచూస్తారు. అన్నీ సరిపోలితే అటెస్టేషన్, అపోస్టిల్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ సర్టిఫికెట్ల మళ్లీ ఏజెన్సీ ద్వారానే దరఖాస్తుదారుడికి చేరతాయి. యూఏఈ, సౌదీ వంటి దేశాలు అటెస్టేషన్‌ను, హెగ్ కన్వెన్షన్‌లో ఉన్న మిగిలిన 126 దేశాలు అపోస్టిల్ను అంగీకరిస్తున్నాయి. బ్రాంచ్ సెక్రటేరియేట్ అటెస్టేషన్‌ను ఉచితంగా, అపోస్టిల్ను ఒక్కో పత్రానికి రూ.50 చొప్పున వసూలు చేసి పూర్తి చేస్తోంది. ఏజెన్సీ మాత్రం సరీ్వస్ చార్జీగా ఒక్కో పత్రానికి రూ.84 (స్కానింగ్ ఫీజు రూ.3 అదనం) తీసుకునేందుకు ఎంఈఏ అనుమతిచ్చింది. బ్రాంచ్ సెక్రటేరియట్ ఒకసారి చేసిన అటెస్టేషన్, అపోస్టిల్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ చదివిన విదేశీ విద్యార్థులకూ తప్పనిసరి.. కేవలం భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారికే కాదు.. ఆయా దేశాల నుంచి వచ్చిన, ఇక్కడ విద్యనభ్యసించి తిరిగి వెళ్లే వారికీ అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. అప్పుడు ఇక్కడి విద్యాసంస్థలు జారీ చేసిన సరి్టఫికెట్లు అక్కడ చెల్లుబాటు అవుతాయి. ఎంఈఏ అధీకరణతో పని చేసే ఏజెన్సీల వివరాల కోసం వెబ్‌సైట్‌ను (www.mea.gov.in/ apostille. htm) సందర్శించాలి. అలాగే అటెస్టేషన్, అపోస్టిల్ అంశాల్లో ఇబ్బందులు ఉంటే ఈ–మెయిల్ ఐడీ(hobs.hyderabad@mea. gov.in) ద్వారా సంప్రదించాలి. ప్రస్తుతం ప్రతి నెలా 200 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. – జొన్నలగడ్డ స్నేహజ, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ -
చెవులు, ముక్కు కుట్టించుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.డాక్టర్ల దగ్గరే మేలు... ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పియర్సింగ్లో కలిగే అనర్థాలు... ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది. మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి... శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది. చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్కు వెళ్లకపోవడమే మంచిది. -
పని చెయ్యడం ఒక వేడుక
ఫలితం రావడానికి పనిచెయ్యడం ప్రాతిపదిక. ప్రయత్నం పని చెయ్యడానికి ప్రాతిపదిక. ఏ పరిణామానికైనా ప్రయత్నం, పని చెయ్యడం ఉండాలి. ప్రయత్నంతో పని చెయ్యడానికి మనిషి పూనుకోవాలి; ప్రయోజనకరమైన ఫలితాలను సాధించాలి. ‘తప్పులు జరుగుతాయన్న భయంతో పని మొదలు పెట్టక΄ోవడం చెడ్డవాడి లక్షణం; అజీర్ణం అవుతుందనే భయంవల్ల భ్రాంతిలో ఎవరు భోజనాన్ని వదిలేస్తారు? అని హితోపదేశం మాట. తప్పులు జరుగుతాయని పని చెయ్యక΄ోవడం నేరం. పని చెయ్యడం గురించి ఓషో ఇలా చె΄్పారు... జీవితం అన్నది బాధ్యతలతో మాత్రం పని చెయ్యడమా? లేదా వేడుకలోపాలుపంచుకోవడమా? పని చెయ్యడం మాత్రమే జీవితం అయితే జీవితం ఇబ్బందికరమైనదై ఇరుకైందిగా మారి΄ోతుంది. బరువెక్కిన హృదయంతో జీవించాల్సి వస్తుంది. కృష్ణుడు పని చెయ్యడం మాత్రమే బాధ్యత గా జీవించినవాడు కాదు. జీవితాన్ని ఒక వేడుకగా; ఒక ఉత్సవంగా మార్చుకున్నవాడు. జీవితం ఇంట్లో చదువుకునేపాఠం కాదు. జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చుకోవడం వల్ల ఎవరూ జీవితాన్ని కోల్పోవడం లేదు. పని చెయ్యి; ఆ పనిని వేడుకలాగా మార్చెయ్యి. అప్పుడు పని కూడా ఆటపాటల సంకలనంగా మారి΄ోతుంది. అందువల్ల చిన్నపని కూడా నిండుగా ఉంటుంది. పని సౌందర్యాత్మకం అవుతుంది. పనికి బానిసలుగా మారినవాళ్ల గురించి మీకు తెలిసి ఉంటుంది. పని చెయ్యడం కోసం జీవించేవాళ్లు ఉద్రిక్తతలో జీవించాల్సి వస్తుంది. పని పిచ్చివాళ్లైనవాళ్లు జీవించడాన్ని ఒక కర్మాగారంగా మార్చేసు కుంటున్నారు.‘చెయ్యి లేదా చచ్చి΄ో‘ అని ఘోషిస్తున్నారు. పని చెయ్యడం తప్పితే మరో కోణం వాళ్లకు తెలీదు. వాస్తవానికి వాళ్లకు పని చెయ్యడానికి ప్రయోజనం ఏమిటో తెలియదు. జీవితం అన్నది ఒక వేడుక. మనం పని చెయ్యడం నాట్యం చేస్తున్నట్టు ఉండాలి. పని చెయ్యడం ద్వారా వేడుకను తీసుకురావాలి. కఠినమైన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటేపాడడానికీ, ఆడడానికీ, వేడుక చేసుకోవడానికీ సమయం లేకుండా ΄ోతుంది. జీవితం ఇంటికీ, కార్యాలయానికీ మధ్యలో ఆగి΄ోతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్యలో ముళ్లకంచెను ఏర్పరుచుకుని మానసికంగా మీరు బాధకు గురి అవుతున్నారు. ఒకరోజున జీవితంలో విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించాలని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు రాదు; పని పిచ్చివాళ్లు ఎప్పటికీ జీవితాన్ని వేడుక చేసుకోరు. కృష్ణుడు జీవితాన్ని ఉత్సవంగా మార్చుకున్నాడు. పువ్వులు, పక్షులు, ఆకాశ తారలు జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. మనిషి తప్పితే జీవరాశులన్నీ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాయి. పువ్వులు ఎందుకు పూస్తూ ఉన్నాయి? అని అడగండి. తారలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి? అని అడగండి. గాలి ఎందుకు ఒంటరిగా వీస్తోంది? అని అడగండి. సూర్యుడికి కింద జీవిస్తున్నవి అన్నీ వేడుక చేసుకుంటున్నాయి. ప్రపంచమే వేడుక చేసుకుంటోంది. మనిషి కూడా ప్రపంచంలో భాగమే అని కృష్ణుడు చెబుతున్నాడు; వేడుక చేసుకోండి అని చెబుతున్నాడు. ఏ పనీ చెయ్యకుండా వేడుక చేసుకోమని కృష్ణుడు చెప్పలేదు. గాలి పని చెయ్యకుండా వీచడం లేదు. తార ఒకేచోట నుంచుని వేడుక చేసుకోవడంలేదు. అది కదులుతూనే ఉంది. పువ్వులు పుయ్యడం కూడా పనే. అయితే వీటికి పని చెయ్యడం ముఖ్యం కాదు. వేడుక ముఖ్యం. వేడుక ముందు ఉంటుంది అదే సమయంలో అవి తమ బాధ్యతల్ని కూడా నెరవేరుస్తాయి. వేడుకకు కొనసాగింపే పని; జీవితమే ఒక ఉత్సవం. పని చెయ్యడంలోని సౌందర్యాన్ని, పని చెయ్యడంవల్ల సత్ఫలితాన్ని మనిషి సొంతం చేసుకోవాలి. పని చేస్తూ మనిషి తన జీవితాన్ని ఉత్సవం చేసుకోవాలి. – శ్రీకాంత్ జయంతి -
తాలిబన్లతో సంప్రదింపులు చాలా అవసరం: యూకే
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం వంటి కారణాల దృష్ట్యా తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం చాలా అవసరమని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే అంశంలో ఇప్పుడే మాట్లాడటం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించారు. చదవండి: Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే! శుక్రవారం ఆయన ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాలిబన్ల నుంచి ఏవిధమైన సహకారం లేకుండా కాబూల్ నుంచి 15 వేల మందిని వెనక్కి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. ‘తాలిబన్లలోని కొందరు నేతలు కొన్ని అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. వాటిని కార్యరూపంలోకి తేవాలంటే వారితో చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! -
మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు: తాలిబన్లు
కాబూల్: భారతదేశానికి తాలిబన్ల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం స్పష్టం చేశారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జబీహుల్లా పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఆసియా ప్రాంతంలో భారత్ కీలకమైన దేశం. గత అఫ్గాన్ ప్రభుత్వం, భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడే నూతన అఫ్గాన్ ప్రభుత్వం సైతం అదే స్థాయిలో సహృద్భావ సంబంధాలను కోరుకుంటోంది’ అని జబీహుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో కలసి భారత వ్యతిరేక కార్యకాలాపాలకు తాలిబన్లు పాల్పడబోతున్నారనే వార్తలపై జబీహుల్లా స్పందించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాలిబన్లు భారత్‌కు ఎటువంటి హానీ తలపెట్టబోరన్నారు. తాలిబన్లు పాక్‌నూ తమ సొంత దేశంగా భావిస్తారని జబీహుల్లా ఇటీవల పేర్కొన్నారు. ఆ అంశంపై వివరణ ఇచ్చారు. ‘పాక్‌తో అఫ్గాన్‌కు సరిహద్దు బంధముంది. అఫ్గానీయులు తరచూ సరిహద్దు దాటి బంధువులు, వాణిజ్యం కోసం పాక్ ప్రజలతో మమేకమవుతారు. అలాంటి బంధాన్నే మేం కోరుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం. ముఖ్య దేశాలన్నీ ఎంబసీలను కొనసాగించాలి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌పైనా మాట్లాడారు. ‘ఒక ఉమ్మడి నిర్ణయం కోసం రెండు వైపుల నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధమే ఏకైక మార్గమని మేం భావించట్లేదు’ అని చెప్పారు. -
కోడి ముందా? గుడ్డు ముందా?
ఈ సామెత తెలియనివాళ్లు ఉండరు. దీనికి సమాధానం తెలిసినవాళ్లూ ఉండరు. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా తన జీవితానికి ఈ సామెతను ఆపాదించారు. సినిమాలంటే మీకు చిన్నప్పుడే ఇష్టం ఏర్పడిందా? లేక మీ అమ్మానాన్న (కమల్‌హాసన్, సారిక), ఇంకా ఇతర కుటుంబ సభ్యులు సినిమాల్లో ఉన్నందువల్ల మీరూ వచ్చేశారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే– ‘‘కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఏం చెబుతాం. ఇది కూడా అంతే. నేను సినిమా వాతావరణంలోనే పెరిగాను. అయితే మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? అని అడిగితే, ‘సంగీతం’ అంటాను. అయితే నన్ను సినిమానే సెలక్ట్ చేసుకుంది. ఎందుకంటే అది నా డెస్టినీ అని నా ఫీలింగ్. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా నాన్నగారు యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. జనరేటర్ వ్యాన్ దగ్గర కూర్చుని హోమ్‌వర్క్ రాసేదాన్ని. ప్రొడక్షన్లో ఉన్నవాళ్లంతా నన్ను గారం చేసేవారు. అందుకే చికెన్ అండ్ ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పా. నాకు సినిమా మీద దానంతట అదే ప్రేమ పెరిగిందో, సినిమా పరిశ్రమ పిలిచింది కాబట్టి వచ్చానో తెలియడంలేదు. అయితే ఒకటి మాత్రం నిజం. నా జీవితాన్ని సినిమా నుంచి వేరుచేసి చూడలేను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని ఇటీవల శ్రుతీహాసన్‌ని కలిశాడు. అభిమాన తారను కలిసినందుకు బోలెడంత ఆనందాన్ని వ్యక్తం చేసి, ‘మీ పెళ్లెప్పుడు? విందుకి వస్తాను’ అని ట్వీటర్ ద్వారా శ్రుతీని అడిగాడు. ‘‘పెళ్లి విందు అంటే ఇంకా చాలా టైమ్ ఉంది. నా బర్త్‌డే విందుకి వద్దువుగానిలే’’ అని సరదాగా సమాధానం ఇచ్చారామె. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన శ్రుతి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని అభిమానికి ఆమె ఇచ్చిన సమాధానం స్పష్టం చేస్తోంది కదూ. -
వేల్యూ ఇన్వెస్టింగ్ ప్రాధాన్యం అయితే...
ఇటీవలి మార్కెట్ కరెక్షన్లో పేరొందిన పలు ఫండ్స్ కూడా రాబడుల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నాయి. కానీ, కొన్ని ఫండ్స్ మాత్రం ప్రతికూలతలను గట్టిగా ఎదుర్కొని నిలబడ్డాయి. వాటిలో పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ కూడా ఒకటి. ఈ పథకం ఏడాది రాబడులను పరిశీలిస్తే బెంచ్ మార్క్ (నిఫ్టీ 500) కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. మల్టీ క్యాప్ కేటగిరీ రాబడులతో పోలిస్తే సగటున ఐదు శాతం అధికం కావడం ఈ పథకం పనితీరుకు నిదర్శనాలు. ఈ పథకం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయింది. అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా సగటున 19.5 శాతం రాబడులు ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో ఈ పథకం అగ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాన్ని కూడా చేర్చే అంశాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం పరాగ్ పారిఖ్ లాంగ్ టర్మ్ వేల్యూ ఫండ్ పేరులో ఉన్నట్టు వేల్యూ ఇన్వెస్టింగ్ సూత్రాన్ని పాటిస్తుంది. బుల్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపని స్టాక్స్, విలువ పరంగా ఆకర్షణీయ స్థాయిల్లో ఉన్న వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. బుల్స్ పరుగు నిదానించాక, ఈ స్టాక్స్ సత్తా చూపించే విధంగా ఉంటాయి. నాణ్యమైన స్టాక్స్‌ను, అది కూడా అధిక ధరల వద్ద కాకుండా సరసమైన ధరల వద్ద లభించే వాటిని దీర్ఘకాలిక దృష్టితో ఈ పథకం మేనేజర్లు పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేసుకుంటారు. బాటమ్ అప్, కొనుగోలు చేసిన తర్వాత వేచి ఉండే విధానాన్ని అనుసరిస్తారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ పథకం నగదు నిల్వలను, ఆర్బిట్రేజ్ పొజిషన్లను పెంచుకుంది. 2016 డిసెంబర్ నాటికి 9 శాతంగా ఉంటే, 2018 జూన్ నాటికి 24 శాతానికి పెంచుకోవడం జరిగింది. దేశీయ స్మాల్ స్టాక్స్‌లోనూ ఎక్స్పోజర్ను 20 శాతానికి తగ్గించుకుంది. ఏడాదిన్నర క్రితం ఇది 30 శాతం స్థాయిలో ఉంది. దీంతో మిడ్, స్మాల్ క్యాప్స్ భారీ నష్టాలను చవిచూసిన తాజా మార్కెట్ కరెక్షన్లో ఈ పథకం మెరుగ్గా ఉండేందుకు తోడ్పడింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలోని ఎంఫసిస్, మహారాష్ట్ర స్కూటర్స్ బాగా పెరిగాయి. ఈ పథకం తన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతు అంతర్జాతీయ బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులు 28 శాతంగా ఉన్నాయి. రాబడులు ఏడాది కాలంలో ఈ పథకం 16.5 శాతం రాబడులను అందించింది. మరి ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు 7.9 శాతమే కావడం గమనార్హం. మూడేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 12.7 శాతంగా ఉండగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతం. ఐదేళ్ల రాబడులు 19.5 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 16.1 శాతంగా ఉన్నాయి. వైవిధ్యం: అంతర్జాతీయంగా బ్లూచిప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకంలో ప్రత్యేకత. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో ఈ పథకం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మొత్తం పథకం నిధుల్లో 10% ఆల్ఫాబెట్‌లోనే ఉన్నాయి. తర్వాత ఫేస్బుక్లో 5% ఇన్వెస్ట్ చేసింది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ పథకం కనీసం 65% పెట్టుబడులను దేశీయ ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటుంది. -
స్త్రీ రక్షణ ఇంకా ముఖ్యం
అది ఢిల్లీలోని ఇండియా గేట్. అక్కడ ఒక స్త్రీ ఆవు మాస్క్ ధరించి నిలబడింది. దానిని అతడు ఫొటో తీశాడు. కలకత్తాలోని హౌరాబ్రిడ్జ్. అక్కడ మరో స్త్రీ ఆవు మాస్క్ ధరించి నిలబడింది. దానిని అతడు ఫొటో తీశాడు. ముంబైలో అరేబియా సముద్రం ఎదురుగా నిలుచుని ఉన్న ఆవు మాస్క్ స్త్రీ ఫొటోను కూడా అతడు తీశాడు.ఈ మూడు చోట్ల అనే ఉంది... దేశమంతా తిరుగుతూ దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆవు మాస్క్ ధరించిన స్త్రీలను సుజాత్రో ఘోష్ అనే ఆ 23 ఏళ్ల కుర్రవాడు ఫొటో తీయదలుచుకున్నాడు. తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టదలుచుకున్నాడు. ఎందుకు?దేశమంతా స్త్రీలు ఉన్నారు గనుక.అయితే?వారి మీద అత్యాచారాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి కనుక.దానికి ఇలాంటి నిరసన ఎందుకు? దేశంలో స్త్రీ రక్షణ కంటే మిన్నగా మత విశ్వాసాలు ముందుకొచ్చాయి. స్త్రీను కాపాడుకోవడంలో కంటే మత విశ్వాసాన్ని కాపాడుకోవడంలో మెజారిటీ సమాజం, రాజకీయ పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. స్త్రీ మీద అత్యాచారం జరిగితే అరెస్టులు, శిక్షలు తేలడానికి ఏళ్లు పడుతుంది. కాని మత విశ్వాసాల విషయాలలో ఆఘమేఘాల మీద చట్టాలు, ఆర్డినెన్స్‌లు జారీ అయిపోతున్నాయి. ‘ఇది సరికాదు’ అంటాడు సుజాత్రో ఘోష్.కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చి స్థిరపడిన ఈ ఫొటోగ్రాఫర్ దేశంలో జరుగుతున్న అత్యాచారాల పై కలత చెందాడు. తన వంతుగా సృజనాత్మకంగా నిరసన తెలియ చేయాలనుకున్నాడు. ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు మాస్క్ కొని తెలిసిన స్త్రీకి తొడిగి ఒక ఫొటో తీశాడు. ఆ ఫొటో చూశాక అతడికి తన నిరసన విధానం ఏమిటో తెలిసి వచ్చింది. దేశంలోని అన్ని ప్రాంతాలలో వివిధ స్త్రీలను ఆవు మాస్క్‌తో ఫొటోలు తీసి స్త్రీ రక్షణ పట్ల సమాజం, ప్రభుత్వాలు చైతన్యవంతం అవడానికి కృషి చేస్తున్నాడు.ఈ ప్రయత్నం అతణ్ణి పాపులర్ చేస్తోంది. అయితే ఊహించినట్టుగానే కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కొడతాం, చంపుతాం అని మెసేజ్‌లు పెట్టినవారు కూడా ఉన్నారు. కాని వేలాది మంది స్త్రీలు కుల, మతాల ప్రమేయం లేకుండా తన నిరసన విధానానికి మద్దతు పలకడం చూసి సుజాత్రో ధైర్యంగా ఉన్నాడు.మంచి పనికి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. నా నిరసన ఆగదు అన్నాడతను.‘‘గోవు పట్ల సమాజంలో ఉన్న మనోభావాలకు విలువ ఇవ్వాల్సిందే. కాని గోవు కంటే ముందు స్త్రీ మాన ప్రాణమే ముఖ్యం అని భావించే సమాజాన్ని కూడా ఆశించడం అవసరమని ఇటీవలి అత్యాచార ఉదంతాలు నిరూపిస్తున్నాయి కదూ’’ అంటాడు సుజాత్రో. -
లక్కుండాలట!
‘బోలెడన్ని తెలివితేటలు, విపరీతమైన టాలెంటు ఉన్నంత మాత్రాన సరిపోదు. కొంచెం లక్కుండాలి’ అనే మాట ఎవరో ఒకరు అనగా వినే ఉంటారు. లేకపోతే మీలో మీరే అనుకునే ఉంటారు. ఏదో జనాంతికంగా అనుకునే మాటలకు లేదా జనాభిప్రాయంగా వినిపించే మాటలకు శాస్త్రీయ ప్రామాణికత ఏముంటుందని ప్రశ్నించే మేధావులు కూడా మనలో ఉంటారు. అయితే, తెలివితేటలు, టాలెంటుతో పాటు కొంచెం లక్కుంటేనే బతుకు పోటీలో గెలుపు దక్కుతుందనే విషయం ఇటీవల వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో శాస్త్రీయంగా తేలింది. బిల్ గేట్స్ సహా గడచిన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఘన విజయాలను సాధించిన వెయ్యిమంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. సుదీర్ఘమైన కెరీర్లో విజయవంతంగా నిలదొక్కుకున్న వారికి తెలివితేటలు, ప్రతిభా పాటవాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందని, వారి ఘన విజయాల వెనుక అదృష్టమే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వార్విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇటలీలోని సిసిలీ నగరంలో ఉన్న కటానియా వర్సిటీ పరిశోధకులు వెయ్యిమంది ‘వర్చువల్’ వ్యక్తులపై నిర్వహించిన ప్రయోగంలో కూడా అదృష్టం ముఖ్య భూమిక పోషిస్తుందని తేలడం విశేషం. -
మేరీ మమ్మీ
ఫస్ట్ పర్సన్ హిందీలో మేరీ అంటే ‘నా’.. మమ్మీ అంటే అమ్మ.. మేరీ మమ్మీ అంటే నా అమ్మ! ప్రతి కొడుకుకి ఉండాల్సిన మమ్మీ మేరీ కోమ్!! తన కొడుకులకు రాసుకున్న ఉత్తరం అనువాదమిది! మన ఇళ్లల్లో కూడా ‘వాడికేం.. మగాడు’ అన్న మాట తరచూ వింటూంటాం.. అంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి మగపిల్లలకు ఏం చేసినా చెల్లుతుంది అని చెప్తున్నారన్నమాట! చెల్లదు .. అని చెప్తుంది మేరీ! ‘నో ’ అంటే ‘నో’!! డియర్ సన్స్.. ఎందుకో ఈ రోజు మీకు ఈ ఉత్తరం రాయాలనిపించింది. మన దగ్గర అమ్మాయిలకు గౌరవం లేదు. అబ్బాయిలుగా మీకూ ఒక ముక్కు, రెండు కళ్లు, రెండు చెవులు, మెదడు ఉన్నట్టే అమ్మాయిలుగా మాకూ ఉంటాయి. శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే మీ నుంచి మమ్మల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రాన మేం సెకండ్ సిటిజన్స్ కాము కదా! మీలాగే మేమూ మెదడుతో ఆలోచిస్తాం... మనుసుతో ఫీలవుతాం! ఇలాంటి పెద్ద విషయాలను పదేళ్లయినా నిండని మీతో ఎందుకు చెప్తున్నానంటే.. కనీసం ఈ వయసు నుంచయినా అమ్మాయిలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారని.. అమ్మాయిల విషయంలో సున్నితంగా ప్రవర్తించడం అలవడుతుందని! నాకూ తప్పలేదు.. మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు ఈవ్‌టీజింగ్‌కి, సెక్సువల్ అబ్యూజ్కి, లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. ఎవరో ఆడపిల్లల దాకా ఎందుకు కన్నలూ.. మీ అమ్మనైన నేనూ లైంగిక దాడికి గురయ్యాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు.. ఉదయం ఎనిమిదన్నరకు రిక్షాలో బాక్సింగ్ ట్రైనింగ్‌కి వెళ్తున్నా.. పక్కనుంచి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా నా మీదకు వంగి నా యెదను తడుతూ వెళ్లిపోయాడు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. కోపంతో రగిలిపోయాను. వెంటనే రిక్షాలోంచి దూకి, చెప్పుల్ని తీసి చేత్తో పట్టుకొని వాడిని వెంబడించాను. కాని వాడు తప్పించుకొని పారిపోయాడు. అరే వాడిని పట్టుకోలేకపోయానే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. వాడు దొరికి ఉంటే అప్పటికే నేను నేర్చుకున్న కరాటేను వాడి మీద ప్రాక్టిస్ చేసేదాన్ని. ఇంకోసారి.. ఢిల్లీ, హిస్సార్‌లో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది నాకు, నా ఫ్రెండ్స్‌కి. ట్రైనింగ్ క్యాంప్‌లో ఓ సాయంకాలం.. వాకింగ్ చేస్తుంటే! ఎందుకు విషయం అవుతోంది? ఆ సంఘటనల తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి.. మమ్మల్నే మాటలన్నారు. అమ్మాయిలను చూస్తే చాలు.. వాళ్ల వక్షస్థలాన్ని తాకాలని, పిరుదుల మీద తట్టాలని ఎందుకనుకుంటారు ఈ మగవాళ్లు? అమ్మాయిలున్నది అలాంటి వెకిలి ఆనందాలను పంచడానికి కాదు. అమ్మాయిలను బలవంతంగా తాకి అబ్బాయిలు పొందే సంతోషమేంటో నాకిప్పటికీ అర్థంకాదు! అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందంటే చాలు.. వాళ్లు వేసుకున్న బట్టలు ఎందుకు చర్చకొస్తాయి? వాళ్లు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లారనేది ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుంది? ఒరేయ్.. ఈ ప్రపంచం మీకెంత సొంతమో.. మాకూ అంతే కదా? మరి మాకెందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్? స్వేచ్ఛగా బయటకు వెళ్లడానికి అమ్మాయిలెందుకు వెనకాముందు ఆలోచించాలి? మీకు అర్థం కావాలి.. మీరు పెరుగుతున్నారు. అందులోనూ అబ్బాయిలు.. అందుకే మీకు అర్థంకావాలని చెప్తున్నానురా.. రేప్, అబ్యూజ్, ఈవ్ టీజింగ్, సెక్సువల్ హెరాస్మెంట్.. ఇవన్నీ నేరాలే. వీటికి తీవ్రమైన శిక్షలుంటాయి.. ఉన్నాయి.. ఉండాలి కూడా! కన్నలూ.. ఎప్పుడైనా ఎవరైనా ఆడపిల్లలను ఏడిపించడం మీరు చూస్తే వెంటనే వెళ్లి ఆ అమ్మాయిలకు సాయం చేయండి.. ధైర్యం చెప్పండి.. వాళ్లకు అండగా నిలబడండి.. మీ అమ్మగా మీ నుంచి నేను కోరుతున్నదిదే! రెస్పెక్ట్ విమెన్! అత్యంత విషాదమేంటంటే.. ఈ సమాజంలో సమంగా గౌరవం పొందాల్సిన మేము నిర్లక్ష్యానికి గురికావడం! మన దేశ రాజధాని ఢిల్లీలో.. కొన్ని వందల మంది అమ్మాయిలు రేప్‌కి గురయ్యారు. గురవుతూనే ఉన్నారు. ఎవ్వరూ ఆ అన్యాయాలను ఆపట్లేదు సరికదా కనీసం ప్రశ్నించడం లేదు. మీరు అలా కాదు.. మనిల్లు వేరు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమనే వాతావరణంలో మీరు పెరుగుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ మీ నాన్నే. ఆయన మీ ఫ్రెండ్స్ అందరి నాన్నల్లాగా నైన్ టు ఫైవ్ జాబ్ చేయరు. బాక్సర్‌గా నా ట్రైనింగ్, జాబ్, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా... ఇంటిపట్టునే ఉండడం నాకు కుదరదు. కాని మా ఇద్దరిలో ఎవరో ఒకరి అటెన్షన్ మీకు తప్పకుండా కావాలి. అందుకే ఆ బాధ్యతను మీ నాన్న తీసుకున్నారు. ఈ విషయంలో మీ నాన్నంటే నాకెంత గౌరవమో మాటల్లో చెప్పలేను. నా కోసం, మీ కోసం, ఈ ఇంటి కోసం ఆయన టైమ్‌ని, కెరీర్‌ని డెడికేట్ చేశారు. నా బలం మీ నాన్నే. ఆయన తోడులేందే నా ప్రయాణంలో ఒక్క అడుగూ ముందుకు సాగలేదు! అయితే త్వరలోనే మీరు బయటవాళ్ల నుంచి నాన్న మీద హౌజ్ హజ్బెండ్ అనే మాటలు వింటారు. ఒక్కటి గుర్తుంచుకోండి.. అలాంటి మాటలను అవమానంగా, అగౌరవంగా భావించాల్సిన పనిలేదు. ఇంటిని చూసుకునే బాధ్యత అమ్మకు మాత్రమే కాదు నాన్నకూ ఉంటుందని గ్రహించండి. రేపొద్దున మీరిలాంటి బాధ్యతను పంచుకోవాల్సి వస్తే నామోషీగా, అమర్యాదగా ఫీలవ్వకూడదు. అది అవమానం.. అది హేళన.. మీరు నా పక్కనుంచి నడుస్తుంటే కొంతమంది మీ అమ్మను ‘చింకీ’ (చట్టి ముక్కు, చిన్న కళ్లున్న చైనీస్ అనే అర్థంలో) అంటూ కామెంట్ చేయడం వింటారు. ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన చాలామంది అమ్మాయిలు వాళ్ల రూపురేఖలు, వాళ్ల వస్త్రధారణతో చింకీస్గా టార్గెట్ అవుతున్నారు. అది అవమానం. అది హేళన. అది జాత్యాహంకారం. నేను భారతీయురాలినే. మిమ్మల్నీ భారతీయులుగానే పెంచుతున్నా! భారతీయులమైనందుకు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నా. తిరుబాటుదారులున్న రాష్ట్రానికి చెందినవాళ్లం. ఆ హింస నుంచి మిమ్మల్ని కాపాడుకుంటున్నా... రక్షించుకుంటున్నా. ఆ భయాలనుంచి బయటపడే ధైర్యాన్ని మీకు నూరిపోస్తున్నా. ఈ దేశ పౌరులుగా మిగిలిన అందరితో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కు మీకెలా ఉందో మహిళలకూ పురుషులతో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కుంది. మీరు ఈ దేశ భవిష్యత్ పౌరులు. ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. మహిళలను మీరు గౌరవిస్తేనే ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు నిలబడుతాయి. అదే నిజమైతే.. నా దేశం నాకు ఎంతో పేరు, ప్రతిష్ఠలను ఇచ్చింది. కాని ఎమ్మెస్ ధోని, విరాట్ కొహ్లీలను గుర్తుపట్టినట్టుగా నన్ను గుర్తించరు. అలాగని ‘చింకీ’ అనే కామెంట్‌కీ నేను అర్హురాలిని కాదు కదా..! రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి నన్ను గౌరవించారు. చాలా సంతోషం. స్త్రీ సమస్యలను చర్చించే ఈ అవకాశాన్ని వదులుకోను. మహిళల మీద సాగుతున్న హింస గురించి పార్లమెంట్లో ప్రశ్నిస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అయితే సెక్సువల్ అబ్యూజ్, హెరాస్మెంట్స్ నేరాలే కావనే ముద్ర పడిపోయింది మనలో. అవి నేరాలే అనే విషయం మీకు చెప్పకపోతే.. వాటి గురించి మీకు అవగాహన పెంచకపోతే అమ్మగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే.. ఇవన్నీ చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నా.. శరీరాల మీద హక్కు కేవలం మగవాళ్లకే కాదు.. వాళ్ల శరీరాల మీద హక్కు స్త్రీలకూ ఉంటుంది. వాళ్లు ఒకసారి నో అని చెప్పారంటే ఆ ‘నో’ గౌరవించండి. బలవంతం చేసి వాళ్ల చావులను చూడకండి. రేప్ అనేది సెక్స్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ మిస్ప్లేస్డ్ సెన్స్ ఆఫ్ పవర్ అండ్ రివెంజ్! నన్ను ఇబ్బంది పెట్టినవాడిని చాచి ఒక్కటి ఇవ్వగలను. అది నా బాక్సింగ్ ప్రాక్టిస్నూ పెంచుతుంది. కాని కొట్టేదాకా తెచ్చుకోవడం ఎందుకని? కోరిక చాలా అందమైంది పరస్పర అంగీకారం, ఇష్టం ఉంటే! ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఇళ్లలో చాలా సార్లు వింటాం.. వాళ్లు మగ పిల్లలు.. మగ పిల్లలు మగపిల్లలే అని. అదే నిజం అయితే మగపిల్లలుగా ఈ దేశంలో అమ్మాయి భద్రంగా, గౌరవంగా మసిలే వాతావరణాన్ని కల్పించండి! ఇట్లు మీ అమ్మ మేరీ కోమ్ -
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్య సమాజం
– దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం : రైల్వేస్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యవంతమైన రైలు ప్రయాణం ప్రయాణికులు చేయవచ్చని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. భారతీయ రైల్వేలో చేపట్టిన స్వచ్ఛ్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్లో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రయాణికులు ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణించాలంటే పరిశుభ్ర వాతావరణం అవసరమన్నారు. 2019 అక్టోబర్ నాటికి భారతదేశం స్వచ్ఛ భారత్‌గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానిలో భాగంగా నియోజకవర్గంలో వారానికి ఒక రోజు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రైల్వేస్టేషన్లో బూజులు దులిపి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కర్రి ప్రభాకర బాలాజీ. యెగ్గిన నాగబాబు, సీఎ ఎంఆర్ఎల్ఎస్.మూర్తి, కంచుమర్తి నాగేశ్వరరావు, కర్రి సీతారామయ్య పాల్గొన్నారు. వసతుల కోసం రైల్వే అధికారికి వినతి తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లో వసతులు, రైల్వే హాల్టులు, ఇతరాల కోసం మంత్రి మాణిక్యాలరావు రైల్వే డెప్యూటీ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ బి.వెంకట్రావుకు వినతిపత్రం అందచేశారు. గూడ్సు షెడ్‌ను నవాబుపాలెంకు మార్చాలని కోరారు. ఇక్కడ గూడ్సు షెడ్ ప్రాంతంలో రెండో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు రోడ్డు వరకు రైల్వేపుట్ బ్రిడ్జిని విస్తరించాలని కోరారు. -
ఆటలపై మక్కువ పెంచుకోవాలి
ఖమ్మం స్పోర్ట్స్ : విద్యార్థులు చదువుతోపాటు ఆటలపై మక్కువ పెంచుకోవాలని హార్వెస్ట్ పాఠశాల కరస్పాండెంట్ రవిమారుత్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో నగర పాఠశాలల స్థాయి క్రీడలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. క్రీడా పతాకాన్ని ఎగురవేసి పోటీలను ప్రారంభించగా.. 25 పాఠశాలల విద్యార్థులు మార్స్‌ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిమారుత్ మాట్లాడుతూ పాఠశాలల విద్యార్థులందరూ ఒకేచోట చేరడంతో పండగ వాతావరణం నెలకొందన్నారు. క్రీడలు శారీరక, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారు చదువులో రాణించలేరనే అపోహ తొలగించుకోవాలన్నారు. డీసీఈబీ సెక్రటరీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని పాఠశాలలను సమన్వయపరుస్తూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈ పోటీలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. క్రీడల కన్వీనర్ పార్వతీరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. అనంతరం 25 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల క్రీడాకారులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ పీఈటీ ఎల్లారెడ్డి, సెక్రటరీ బి.నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫిజియోథెరపీదే కీలక పాత్ర
అరండల్‌పేట: శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకోవడంలో ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని రమేష్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్ధోపెడిక్ శస్త్రవైద్యనిపుణులు డాక్టర్ రావి పవన్‌కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ రావి పవన్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదన్నారు. చాలా సమస్యలకు ఫిజియోథెరపిలో ఉపశమనం ఉందన్నారు. ఫిజియోథెరపీపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిమ్స్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష, డైరెక్టర్ భీమనాధం భరత్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసులు, మేనేజర్ రాంబాబు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
సారిక కేసులో ఆ రిపోర్టే కీలకం
వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసు విచారణను శాస్త్రీయంగా చేస్తున్నామని ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టే కీలకంగా మారనుందని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేసును విశ్లేషిస్తుందని... ఈ నివేదికను బట్టే హత్యా లేదా ఆత్మహత్యా అనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం రాజయ్య కుటుంబసభ్యులు పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేశామని.. విచారణ తర్వాతే ఏం జరిగిందనేది తెలుస్తుందని ఏసీపీ తెలిపారు. -
అక్రమ ట్రాఫి’కింగ్’నసీర్ !
-
విద్యుత్ బిల్లులే కీలకం....!
లెవీ అక్రమాలను నిగ్గు తేల్చే విషయంలో రైస్ మిల్లుల విద్యుత్ బిల్లులు కీలకం కానున్నాయి. అయితే ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం ముందుకు వెళ్లడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బంది కూడా వివరాలు అందజేసేందుకు సహకరించడం లేదని తెలిసింది. జిల్లాలో రైతుల నుంచి తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, అందులో 67 శాతం బియ్యాన్ని లెవీకి అందించాల్సిన మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్‌తో పాటు జిల్లా అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నా కీలకమైన విద్యుత్ బిల్లులను తీసుకోవడంలో యంత్రాంగం అలసత్వం వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 140 మిల్లులు ఉన్నప్పటికీ అందులో దాదాపు 65 మిల్లుల వరకూ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ లెవీకి బియ్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్‌కు బదులు పీడీఎస్ బియ్యాన్ని కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని నిరోధించేందుకు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించాలని జేసీ రామారావు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా అధికారులు వ్యవహరించారు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కీలకమైన విద్యుత్ బిల్లుల జోలికి వెళ్లలేదు. టన్ను ధాన్యం ఆడేందుకు ఎంత విద్యుత్ వినియోగమవుతుందో లెక్కిస్తే, మిల్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యంతో సరి పోలిస్తే వారు ధాన్యం ఆడుతున్నారా? లేక పీడీఎస్ బియ్యం సరఫరా చేస్తున్నారా ? అన్న విషయం తేటతెల్లమయ్యేందుకు అవకాశాలున్నాయి. కానీ అధికారులు ఈ విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల ప్రమేయం? జిల్లాలో ఉన్న దాదాపు 140 మిల్లులలో విద్యుత్ వినియోగం రీడింగ్ నమోదులో స్పష్టత లేదని తెలిసింది. మిల్లుల్లో వినియోగమవుతున్న విద్యుత్‌కు, నమోదవుతున్న రీడింగ్ తేడాలుంటున్నాయని సమాచారం. జిల్లాలో ఉన్న మిల్లులు తరచూ వస్తున్న రీడింగ్‌కు, మిల్లింగ్ చేసి ఇచ్చిన లెవీ బియ్యాన్ని ఆడించేందుకు ఎంత విద్యుత్ వినియోగమవుతోంది అన్న వివరాలను పరిశీలిస్తే విషయం తెలుస్తుందని చెబుతున్నారు. అయితే దీనికి కొంతమంది విద్యుత్ సిబ్బంది సహకరించడం లేదని సమాచారం. దీంతో చివరకు జేసీ రామారావు రంగంలోకి దిగి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈకి లేఖ రాయవలసి వచ్చింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ రీడింగ్ పర్యవేక్షించాల్సిన అధికారుల ప్రమేయం కూడా ఉండబట్టే ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.