సారిక కేసులో ఆ రిపోర్టే కీలకం | FSL Report is important for this case | Sakshi
Sakshi News home page

సారిక కేసులో ఆ రిపోర్టే కీలకం

Published Thu, Nov 5 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనమళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది.

వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసు విచారణను శాస్త్రీయంగా చేస్తున్నామని ఏసీపీ శోభన్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టే కీలకంగా మారనుందని అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేదన్నారు.

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేసును విశ్లేషిస్తుందని... ఈ నివేదికను బట్టే హత్యా లేదా ఆత్మహత్యా అనే దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం రాజయ్య కుటుంబసభ్యులు పోలీసులు అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేశామని.. విచారణ తర్వాతే ఏం జరిగిందనేది తెలుస్తుందని ఏసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement