అభిప్రాయం
సాధారణంగా దేశాభి వృద్ధికి పారిశ్రామిక రంగం, సేవల రంగం కీలక మైనవి. దీనికి భిన్నంగా మన దేశంలో వ్యవ సాయ రంగమే కీలక రంగంగా మారింది. మూల ధన సాంద్రత, సాంకే తిక పరమైన వనరుల ఉపయోగంతో పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. ఇక సేవల రంగంలోనైతే మానవ వనరుల నైపుణ్యం అంతంత మాత్రంగా ఉండడం వలన ఆ రంగ పురోగ మనం స్వల్పంగానే ఉంది.
ఫలితంగా దేశ ప్రగ తికి వ్యవసాయ రంగమే నేడు ఆధారంగాఉంది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతు. 1950లలో 70 శాతం దేశ ప్రజలు వ్యవ సాయ రంగం పైనే ఆధారపడి ఉండేవారు. ఆ శాతం 2024 నాటికి 54.6 శాతంగా ఉంది.అంటే ఇంకా ఎక్కువగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడే జీవిస్తున్నారన్నమాట! సాగు భూమి విస్తీర్ణం కూడా అమెరికా, చైనా తరువాత మన దేశంలోనే ఎక్కువ. అయితే రైతులకు ఇచ్చిన హామీలను మన పాలకులు నెరవేర్చనందు వలన పెట్టుబడికి చేసిన అప్పుకు వడ్డీ కూడా చెల్లించలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. గత 30 ఏళ్లలో రైతులు, రైతు కూలీలు నాలుగు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా తెలియజేస్తోంది. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధరను కల్పించి, వాటిని కొనుగోలు చేసినప్పుడే రైతులు సుభిక్షంగా ఉంటారు. అలాగే దేశం కూడా! పొరుగు దేశమైన చైనాతో పోల్చుకుంటే మన రైతుల పరిస్థితి కడు దయనీయంగాఉంది. 1980లో మనదేశంలో రైతుల తలసరి ఆదాయం 582 డాలర్లు కాగా, చైనాలో 307 డాలర్లు మాత్రమే! 2024 వచ్చేటప్పటికి చైనాలో రైతుల తలసరి ఆదాయం 25,015 డాలర్లకు పెరగగా మన రైతులు 10,123 డాలర్లు మాత్రమే పొందగలిగారు.
రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర లభించ కపోవడంతో 1990–91లో వ్యవసాయ రంగ వాటా జీడీపీలో 35 శాతం కాగా... 2022–23 లో 15 శాతానికి పడిపోయింది. వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామిక జనాభా మాత్రం 60 శాతం వరకు ఉంది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా... దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు. శాశ్వత పేదరికం నుండి రైతు లను బయట పడేయడానికి ఏకైక మార్గం వ్యవ సాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్ట బద్ధమైన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం మార్కె ట్లను అస్తవ్యస్తం చేస్తుందని కేంద్రం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలపడం గమనార్హం.
1991లో నూతన ఆర్థిక విధానాన్ని చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం నుండి శ్రామి కులు పారిశ్రామిక రంగానికి బదిలీ అవుతారని భావించడం జరిగింది. అలాగే గ్లోబలైజేషన్ వలన వ్యవసాయ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లోకి వెళ్లడం వలన రైతులు లాభపడతారని అను కున్నారు. ఈ విధానం వచ్చి 30 ఏళ్లు గడిచి పోయాయి. అయినా అనుకున్నవేవీ జరగలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆశయాలలో ముఖ్యమైనవి–విదేశీ వాణిజ్యం ద్వారా ప్రపంచ దేశాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉద్యోగ కల్పన చేయడం, ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుని లాభాలను ఆర్జించేటట్లు చేయడం!
ఈ నేపథ్యంలో మన పాలకులప్రపంచ దేశాల ఆకలి తీర్చుతున్న భారత రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో అమ్మి లాభాలు పొందే విధంగా కార్యాచరణ చేప ట్టాలి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు సమ కూర్చిన వనరులకు సమానంగా రైతులకు కూడా ఇచ్చినప్పుడే దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటుంది.
డా. ఎనుగొండ నాగరాజ నాయుడు
వ్యాసకర్త రిటైర్డ్ ప్రిన్సిపాల్
మొబైల్: 98663 22172
Comments
Please login to add a commentAdd a comment